Israel-Hamas war: కెనడాలో ఉద్రిక్తతలు.. యూదు పాఠశాలపై మళ్లీ కాల్పులు
నవంబర్ 12న అక్కడి కాలమాణం ప్రకారం తెల్లవారుజామున 5 గంటలకు కాల్పుల శబ్దాలు వినిపించాయని, కాల్పులు జరిగినప్పుడు పాఠశాలలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని పోలీసులు తెలిపారు. బుల్లెట్ల ధాటికి పాఠశాల భవనం గోడలు దెబ్బతిన్నాయని, నేలపై గుంతలు ఏర్పడ్డాయని వివరించారు.
చదవండి: India–Israel relations: భారతదేశ రైతులకు ఇజ్రాయెల్‌తో ఉన్న సంబంధం ఏమిటి?
ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికే ఇలా ఒకే స్కూల్‌పై పదేపదే దాడులు చేస్తున్నారని ఆ పాఠశాల ప్రతినిధి లియోనెల్ పెరెజ్ విలేకరుల సమావేశంలో చెప్పారు. తరగతులు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.
వారం ప్రారంభంలో మాంట్రియల్ నగరంలోని కాంకోర్డియా విశ్వవిద్యాలయంలో పాలస్తీనియన్, ఇజ్రాయెల్ అనుకూల సమూహాలు ఘర్షణ పడినప్పుడు మాంట్రియల్ ప్రార్థనా మందిరం అగ్నిబాంబు దాడిలో స్వల్పంగా దెబ్బతింది. ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు.