Skip to main content

ఎంబీబీఎస్‌ సీట్లలో రాష్ట్రానికి ఆరో స్థానం

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌ సీట్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే ఆరో స్థానంలో నిలిచినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
telangana state is ranked sixth in MBBS seats
ఎంబీబీఎస్‌ సీట్లలో రాష్ట్రానికి ఆరో స్థానం

ఈ వైద్య విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ఒకేసారి 8 వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలో ఏర్పాటు కావడంతో మొత్తం ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 6,040కు చేరిందని తెలిపింది. ఐదేళ్లలోనే రాష్ట్రంలో 10 మెడికల్‌ కాలేజీలు ఏర్పడ్డాయి. అత్యధికంగా ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్న రాష్ట్రాలు ఎక్కువగా దక్షిణాదిలోనే ఉన్నాయి.

చదవండి: నర్సింగ్, మిడ్‌వైఫరీ పరీక్షలు తేదీలు ఇవే..

తమిళనాడు, కర్ణాటకల్లోనే 20 వేలకుపైగా ఎంబీబీఎస్‌ సీట్లు ఉండటం గమనార్హం. దేశంలోనే అత్యధికంగా తమిళనాడులో 10,825 సీట్లు ఉండగా, కర్ణాటకలో 10,745 సీట్లు ఉన్నాయి. తెలంగాణలో 18 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, 23 ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయని కేంద్రం పేర్కొంది. ఒకేసారి ఇన్ని సీట్లు పెరగడంతో ఈసారి బీ కేటగిరీలో 6.65 లక్షలకుపైగా ‘నీట్‌’ర్యాంకు సాధించిన విద్యా ర్థులకూ ఎంబీబీఎస్‌లో సీట్లు దక్కాయి.

చదవండి: NMC: విద్యార్థులకు డీఆర్‌పీ తప్పనిసరి

13.03 లక్షల మంది అల్లోపతి వైద్యులు 

నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) వివరాల ప్రకారం 2023 జూన్‌ నాటికి రాష్ట్ర వైద్య మండళ్లు, ఎన్‌ఎంసీలో 13.03 లక్షల మంది అల్లోపతి వైద్యులు రిజిస్టర్‌ చేసుకున్నారు. లక్ష మంది ఆయుష్‌ వైద్యు లున్నారు. ప్రతి వెయ్యిజనాభాకు ఒక డాక్టర్‌ ఉండాల్సి ఉండగా మన దేశంలో ప్రతి 834 మందికి ఒక డాక్టర్‌ ఉన్నారు. 

చదవండి: Indira Gandhi Peace Award: వైద్య సిబ్బందికి ఇందిరా శాంతి బహుమతి

Published date : 26 Dec 2022 03:20PM

Photo Stories