Skip to main content

Language: అంగన్ వాడీల్లో ‘ఇంటి భాష’లో బోధన

అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలు ఇంట్లో మాట్లాడే భాషలోనే బోధన చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ నిర్ణయించింది.
Language
అంగన్ వాడీల్లో ‘ఇంటి భాష’లో బోధన

ఈ కేంద్రాలకు వచ్చే పిల్లలకు మరింత సులభంగా బోధన, అభ్యసన కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. వీలైనంత త్వరలో దీనిని అమలు చేయాలని శిశు సంక్షేమ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాల్లో బోధన, అభ్యసనకు సంబంధించిన పుస్తకాలు, వర్క్బుక్లు అన్నీ తెలుగులో, ఒకట్రెండు ఇంగ్లిష్లో ఉంటున్నాయి. వీటి ద్వారా మైనార్టీలు, గిరిజనులు అధికంగా ఉండే అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లలకు బోధన చేస్తున్నప్పటికీ వారు ఇంట్లో మాట్లాడే భాషలో చెప్పే అంశాలనే వేగంగా అర్థం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా మైనార్టీలు, గిరిజన తెగలున్న ఆవాసాలు, ఏజెన్సీలు తదితర ప్రాంతాల్లో పిల్లల మాతృ భాషలోనే బోధన సాగిం చాలని క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆ దిశలో చర్యలు తీసుకుంటోంది. రెండు రోజుల కిందట జరిగిన సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ ఈ మేరకు శిశు సంక్షేమ శాఖ కమిషన్ కు ఆదేశాలు జారీ చేశారు.

చదవండి: 

ఒకేషనల్‌ కోర్సు విద్యార్థులకు షాక్‌

మహిళా కోటాపై ఐఐటీలకే అధికారం: ఎన్ టీఏ

Published date : 04 Oct 2021 04:02PM

Photo Stories