Stay Safe Online Quiz Competition: స్టే సేఫ్ ఆన్‌లైన్ క్విజ్.. ఒక్కొ విజేతకు రూ.10 వేలు..
అందులో భాగంగా ‘స్టే సేఫ్ ఆన్‌లైన్..’ నేపథ్యంతో ఆన్‌లైన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. పోటీలకు జూలై 31 వరకు గడువుందని అధికారులు పేర్కొన్నారు. ఆన్‌లైన్ క్విజ్‌లో పాల్గొనదలచిన వారు https://www.mygov.in/staysafeonline లింక్ పై క్లిక్ చేస్తే అదనపు వివరాలు తెలుస్తాయని వెల్లడించారు. టెలిగ్రామ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, https://t.me/ssoindia లింక్ ద్వారా గ్రూప్‌లో చేరొచ్చు.
ఈ ఆన్‌లైన్ క్విజ్‌లో పాల్గొనే వారికి ఒక్కొక్కరికి 10 ప్రశ్నలు ఇస్తారు.. 5 నిమిషాల వ్యవధిలో వీటికి సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. క్విజ్‌లో టాప్ 10లో నిలిచే విజేతలకు ఒక్కొ క్కరికి రూ.10 వేల చొప్పున నగదు పురస్కా రం ఇవ్వనున్నారు. క్విజ్‌లో పాల్గొని 50 శాతానికి పైగా మార్కులు సాధించిన వారికి డిజిటల్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు.
చదవండి: May Weekly Current Affairs (Awards) Bitbank: IIFA 2023లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న నటి ఎవరు?