Skip to main content

OU: హాస్టల్‌ సమస్యలు పరిష్కరిస్తా

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్‌లోని వివిధ హాస్టల్స్‌లో గల సమస్యలను పరిష్కరిస్తామని వీసీ ప్రొ.రవీందర్‌ అన్నారు.
OU
హాస్టల్‌ సమస్యలు పరిష్కరిస్తా

నవంబర్‌ 22న సి మెస్‌లో అన్నంతో పాటు వివిధ రకాల వంటలను స్వయంగా వీసీ చేతులతో వడ్డించి మొదటి సంవత్సరం పీజీ విద్యార్థుల భోజనశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతి చిన్న విషయానికి ఆందోళనలు చేయాల్సిన పనిలేదన్నారు. తానూ ఇక్కడ చదివిన విద్యార్థినేనని, యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలు తనకు తెలుసన్నారు.

చదవండి: 800 మంది పూర్వ విద్యార్థుల పీహెచ్‌డీలు రద్దు?

అన్ని సమస్యలను పరిష్కరించేందుకు, ఓయూ అభివృద్ధి, పూర్వ వైభవం కోసం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఓయూ కల్పిస్తున్న వసతులను సది్వనియోగం చేసుకొని బాగా చదివి ప్రయోజకులు కావాలన్నారు. పీజీలో సమయాన్ని వృధా చేయకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రొ.లక్ష్మీనారాయణ, సైన్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రొ.వీరయ్య, చీఫ్‌ వార్డెన్‌ డాక్టర్‌ కొర్రెముల శ్రీనివాస్‌రావు, అడిషనల్‌ చీఫ్‌ వార్డెన్‌ డాక్టర్‌ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. 

చదవండి: OU: క్యాంపస్‌లో ఈ పరిశోధనాకేంద్రం: వైస్‌ చాన్స్‌లర్‌

Published date : 23 Nov 2022 02:43PM

Photo Stories