SkillQuest: ఆర్ట్స్ కళాశాలలో స్కిల్ క్వెస్ట్
శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్) కళాశాలలో స్కిల్ క్వెస్ట్ (ఎంటర్, ఎక్స్‌ప్లోర్, ఎర్న్) పేరిట విద్యార్ధులు 50 స్టాల్స్ ఏర్పాటు చేశారు. మంత్రి ధర్మాన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెరుగైన ఫలితాల కోసం అధ్యాపక బృందం చేస్తున్న కృషిని కొనియాడారు. సరైన ఆలోచన, శిక్షణ ఉన్నప్పుడే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని చెప్పారు.
చదవండి: District Employment Officer: వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి
పెరుగుతున్న జనాభాతో పాటు ఉద్యోగాల కొరత ఏర్పడిందని, ఈ తరుణంలో సరైన నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా కాకుండా ప్రైవేటు జాబ్‌లు చేసేందుకు కూడా యువత సిద్ధంగా ఉండాలన్నారు.
ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సురేఖ మాట్లాడుతూ స్కిల్ క్వెస్ట్ కార్యక్రమ ఉద్దేశం వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఎం.వి.పద్మావతి, వైఎస్సార్‌పీసీ నగర అధ్యక్షుడు సాధు వైకుంఠరావు, విద్యావేత్త సురంగి మోహన్‌రావు, లుకలాపు గోవిందరావు, వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ, డాక్టర్ హరిత, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.