Skip to main content

PG Medical: పీజీ వైద్యవిద్యలో ఇన్ సర్వీస్‌ కోటా

పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్‌ కోటాను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
PG Medical
పీజీ వైద్యవిద్యలో ఇన్ సర్వీస్‌ కోటా

పీజీ ఇన్ సర్వీస్‌ కోటా అంశం పరిష్కారానికి ప్రభుత్వం అక్టోబర్‌ 18న తెలంగాణ డీఎంఈ రమేశ్‌రెడ్డి క న్వీనర్‌గా, డీహెచ్‌ శ్రీనివాసరావు, కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌తో కమిటీ ఏర్పాటుచేసింది. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల్లో కనీ్వనర్‌ కోటాలోని మొత్తం సీట్లలో 20 శాతం క్లినికల్, 40 శాతం ప్రీ పారా క్లినికల్‌ సీట్లను ఇన్ సర్వీస్‌ కోటా కింద కేటాయించాలని ఈ కమిటీ ప్రతిపాదించింది. అయితే దానిని యథాతథంగా ఆమోదించాలా? లేక పాత పద్ధతిలోనే 30 శాతం క్లినికల్, 50 శాతం ప్రీ పారా క్లినికల్‌కు కేటాయించాలా? అనే విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో శాశ్వత ప్రాతిపదికన నియమితులైన ఎంబీబీఎస్‌ వైద్యులు ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్నప్పుడు వారికి ఇన్‌ సర్వీస్‌ కోటాను వర్తింపజేస్తారన్న సంగతి తెలిసిందే. ఈ ఇన్ సర్వీస్‌ కోటాతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే 300 మంది ప్రభుత్వ ఎంబీబీఎస్‌ వైద్యులకు పీజీ కోర్సులుచేసే వెసులుబాటు కలగనుంది. 

చదవండి: 

Career in Nursing: ఏ కోర్సు చేసినా ఉజ్వల కెరీర్‌ ఖాయం... నెలకు రూ.44 వేల వ‌ర‌కు జీతం

Medical Colleges: పునాదులకే నోచని కొత్త మెడికల్‌ కాలేజీలు

Jobs: తెలంగాణలో బారీగా ఉద్యోగాలు

Published date : 17 Nov 2021 03:45PM

Photo Stories