Skip to main content

PM SHRI: ఆ స్కూళ్ల బడ్జెట్‌ ప్రతిపాదనలు పంపండి

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా (పీఎం–ఎస్‌హెచ్‌ఆర్‌ఐ) పథకం కింద తెలంగాణ నుంచి తొలివిడతగా ఎంపిక చేసిన 543 స్కూళ్లలో జాతీయ విద్యావిధానాన్ని (ఎన్‌ఈపీ) సమర్థంగా అమలు చేసేందుకు వీలుగా వార్షిక కార్యాచరణ ప్రణాళిక, బడ్జెట్‌ ప్రతిపాదనలను పంపాలని రాష్ట్రానికి కేంద్రం సూచించింది.
PM SHRI
ఆ స్కూళ్ల బడ్జెట్‌ ప్రతిపాదనలు పంపండి

ఈ పథకంలో భాగంగా అందించే నిధులను నిర్వహించేందుకు ప్రత్యేకంగా సింగల్‌ నోడల్‌ ఏజెన్సీని ఏర్పా­టు చేయాలని కోరింది. ఈ మేరకు లేఖ రాసింది. ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో గతేడాది పీఎం–ఎస్‌హెచ్‌ఆర్‌ఐ పథకానికి శ్రీకారం చుట్టిన కేంద్రం... గత వారం మొదటి విడతగా తెలంగాణ నుంచి 543 స్కూళ్లు సహా దేశవ్యాప్తంగా 6,448 స్కూళ్లను ఎంపిక చేయడం తెలిసిందే. రాష్ట్రం నుంచి ఎంపికైన స్కూళ్లలో 56 ఎలిమెంటరీ పాఠశాలలు, 487 సెకండరీ, సీనియర్‌ సెకండరీ పాఠశాలలు ఉన్నాయి. 

చదవండి:

‘నెట్‌’స్పీడైతే.. బోధన ‘వీఆర్‌’అవుద్ది!

PM SHRI Schools: తెలంగాణలో 543 పీఎం-శ్రీ పాఠశాలలు!

Published date : 04 May 2023 03:01PM

Photo Stories