Skip to main content

Holidays : బ్రేకింగ్ న్యూస్‌.. స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు పొడిగింపు.. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు కూడా సెల‌వులే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలో భారీ నుంచి అతిభారీగా వర్షాలు కురుస్తున్నాయి. నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని విద్యాసంస్థలు(స్కూల్స్, కాలేజీల‌కు), ప్రభుత్వ కార్యాలయాలకు జూలై 21, 22వ తేదీలో (శుక్రవారం, శనివారం) సెలవుల‌ను ప్ర‌భుత్వం ప్రకటించింది.
schools and office holidays due to rain news telugu
schools and office holidays due to rain in hyd

అలాగే ప్రైవేటు సంస్థలు కూడా సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మికశాఖను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ అవ‌కాశం కేవ‌లం జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారికి మాత్ర‌మే వ‌ర్తింస్తుంది. 

మరి కొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు జూలై 20, 21వ‌ తేదీలో సెల‌వులు ప్రకటించిన విష‌యం తెల్సిందే. అలాగే స్కూల్స్‌కు వ‌రుస‌గా నాలుగు రోజులు పాటు సెల‌వులు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

☛ July and August School Holidays 2023 list : ఈ నెల జూలై, వ‌చ్చే నెల‌ ఆగ‌స్టులో స్కూల్స్‌కు భారీగా సెల‌వులు.. ఎందుకంటే..?

నాలుగు రోజుల పాటు స్కూల్స్ సెల‌వులు..
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. శుక్ర, శనివారాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ప్రైవేటు విద్యా సంస్థలను సైతం మూసివేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలను దృష్టిలో పెట్టుకొని శుక్ర, శనివారాలు ప్రభుత్వం సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే.

➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ ​​​​​​​

రేపు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు..

KCR Today News holidays

ఎడతెగని వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు సీఎం కేసీఆర్ సెలవులు ప్రకటించారు. రానున్న రెండు రోజులు కూడా భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రైవేటు కార్యాలయాలు కూడా సెలవులు ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. వర్షాల కారణంగా రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోతుండడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పతుండడంతో సెలవులు ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.

☛ August 29, 30 Schools and Colleges Holidays : ఆగస్టు 29,30 తేదీల్లో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు.. ఎందుకంటే..?

ఈ 8 జిల్లాలకు.. 

heavy rain schools closed telugu news

పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాలు, ఉత్తర ఏపీ తీరం, దక్షిణ ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దాని వల్ల వచ్చే 24 గంటల్లో వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండటంతో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతాయని తెలిపింది.

☛ August 29, 30 Schools and Colleges Holidays : ఆగస్టు 29,30 తేదీల్లో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు.. ఎందుకంటే..?

వర్షపాతం నమోదైన జిల్లాలు : 
ఆదిలా­బాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, జన­గామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్‌ మల్కా­జిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ములుగు, నారాయణపేట, జయశంకర్‌ భూపాలపల్లి సాధార‌ణ వ‌ర్షపాతం నమోదైన జిల్లాలు ఉన్నాయి. అల‌గే అత్య‌ధిక‌ వర్షపాతం నమోదైన జిల్లాలుగా సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి.

తిప్పలు..

telangana rain news telugu

ఎడతెరిపి లేని ముసురు, వానలతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. వాగులు ఉప్పొంగి ప్రవహించి, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో.. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు నెలలు నిండిన గర్భిణులను సమీపంలోని సామాజిక ఆస్పత్రుల్లో చేర్చుతున్నారు. అలాగే వాజేడు, ఏటూరునాగారం మండలాల్లో పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మంగపేట మండలంలో మూడు ఇళ్లు కూలిపోయాయి. వెంకటాపురం(కె) మండలంలో నిర్మించిన పాలెం ప్రాజెక్టు ప్రధానకాల్వకు ఒంటిమామిడి గ్రామ సమీపంలో గండి పడింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జలు జాగ్ర‌త్త‌గా ఉండాలని ప్ర‌భుత్వం తెలిపింది. మహారాష్ట్ర, తెలంగాణ, గోవా వంటి రాష్ట్రాల్లో ఈ వారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఐఎండ‌డీ(IMD) జూలై 20 , 21, 2023 తేదీలలో తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షపాతం హెచ్చరికను జారీ చేసింది.

ఇక్క‌డ కూడా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవులు..

schools and colleges holidays due to heavy rain

భారీ వర్షాలతో ఉత్తరభారతం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎడతెరిపిలేని వానలతో దేశ రాజధాని ఢిల్లీలో జనజీవనం అస్తవ్యస్తమైనది. ఇప్పుడు దేశ వాణిజ్య రాజధాని ముంబై వంతు వచ్చింది. దంచి కొడుతున్న వానలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేస్తూ ముంబైలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే  ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే అధికారులను అలర్ట్ చేశారు. అవసరమైన అన్ని సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలను ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే ఇతర సముదాయాలను కాస్త ముందుగానే మూసివేయాలని సూచించారు. 

అప్ప‌టి వ‌ర‌కు బయటికి వెళ్లకుండా..

schools closed news due to rain

జూలై 21 వరకు రాయ్‌గఢ్‌లో ఆరెంజ్ హెచ్చరిక కొనసాగ‌నున్న‌ది. పాల్ఘర్ , థానే జిల్లాలు జూలై 20 వరకు వర్షాలు పడే సమాచారం ఉంది. అధికారులు స్థానికులను ఇంట్లోనే ఉండమని బయటికి వెళ్లకుండా ఉండాలని ప్రోత్సహించారు. యమునా నదికి వరదలు పెరుగుతున్నందున, ఢిల్లీలోని పాఠశాలలు కూడా జూలై 18 వరకు మూసివేసిన విష‌యం తెల్సిందే.

తెలంగాణ‌లో 2023-24 అకడమిక్ ఇయర్‌లో ప‌రీక్ష‌లు- సెల‌వులు ఇవే..

School & Colleges Holidays

☛ 2023-24 అకడమిక్‌ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి.
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు  పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి 
☛ అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్‌ ఇయర్‌ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్కూల్ సెల‌వుల(2023–24) పూర్తి వివ‌రాలు ఇవే..

ap schools holidays list 2023 telugu news

జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అయిన విష‌యం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ‌ స్కూల్ అకడమిక్‌ క్యాలెండర్‌ 2023–24ను విడుద‌ల చేశారు. స్కూల్‌ కాంప్లెక్స్‌ షెడ్యూల్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులు, లాంగ్వేజ్‌ మేళా, లాంగ్వేజ్‌ క్లబ్, లాంగ్వేజ్‌ ల్యాబ్స్‌, లెసన్‌ ప్లాన్‌ ఫార్మాట్‌ అండ్‌ గైడ్‌లైన్స్, లెర్న్‌ ఏ వర్డ్‌ ఏ డే, తెలుగు భాషా వారోత్సవాలు, కల్చరల్‌ యాక్టివిటీస్‌తో సహా స్కూళ్లలో చేపట్టాల్సిన పలు అంశాలతో అకడమిక్‌ క్యాలెండర్‌ను రూపొందించారు. 

ఏపీలో ఈ ఏడాది (2023-24) సెల‌వులు ఇలా..
☛ అక్టోబర్ 14 నుంచి 24 వరకు దసరా సెలవులు
☛ జనవరి 9, 2024 నుంచి 18, 2024 వరకు సంక్రాంతి సెలవులు
☛ డిసెంబ‌ర్ 17వ తేదీ నుంచి 26వ తేదీ వ‌ర‌కు క్రిస్ట‌మ‌స్ సెల‌వులు (మిష‌న‌రీ స్కూల్స్‌కు మాత్ర‌మే..)
☛ ఇంకా దీపావ‌ళి, ఉగాది, రంజాన్ మొద‌లైన పండ‌గ‌ల‌కు ఆ రోజును బ‌ట్టి సెల‌వులు ఇవ్వ‌నున్నారు.

Published date : 20 Jul 2023 09:03PM

Photo Stories