స్టెమ్‌లో ప్రాక్టికల్ ఓరియెంటెడ్‌గా బోధన
ఇటీవల అమెరికా ప్రభుత్వం ప్రొఫెషనల్ ఎక్సే్ఛంజ్ కార్యక్రమంలో భాగంగా యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ఇంటర్నేషనల్ విజిటర్ లీడర్‌షిప్ ప్రోగ్రాం 2022ను నిర్వహించింది. భారత దేశం నుంచి కృష్ణమంజరి పవార్ ఎంపికయ్యారు. ఏయూలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్ సౌజన్యంతో ఈ అవకాశం పవార్‌కు లభించింది. ‘హిడెన్ నో మోర్–ఎంపవరింగ్ విమెన్ లీడర్స్ ఇన్ స్టెమ్’ పేరుతో అమెరికాలోని విభిన్న ప్రాంతాల్లో 20 రోజుల పాటు కార్యక్రమం జరిగింది.
చదవండి: Pharmacy Students: నేరేడు ఆకుల్లోనూ ఔషధాలు..ఫార్మసీ విద్యార్థుల పరిశోధన
విభిన్న శాస్త్ర అంశాలు, పరిశోధన కేంద్రాలు, బోధన రంగాలలో పనిచేస్తున్న 41 మంది మహిళలు భాగస్వాములయ్యారు. వీరికి స్టెమ్ రంగంలో మహిళలకు అవకాశాలు, భవిష్యత్ తరాలను వారు ఏ విధంగా మార్గదర్శనం చేయాలి అనే విషయాలను వివరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో, ప్రధానంగా విశ్వవిద్యాలయంలో మహిళలు అందిస్తున్న సహకారం, ప్రోత్సహిస్తున్న విధానాన్ని అమెరికాలో ప్రపంచ దేశాల ప్రతినిధులకు తెలియజేసినట్లు పవార్ చెప్పారు. అమెరికాలో అనుసరిస్తున్న టెల్ యువర్ స్టోరీ విధానం బాగా నచి్చందని తెలిపారు. త్వరలో మాల్దీవుల నుంచి వచి్చన నీష, నేను సంయుక్తంగా ఒక పరిశోధన ప్రాజెక్టుకు దరఖాస్తు చేస్తున్నామని, మా ప్రతిపాదన వారికి నచ్చితే ఐదు వేల డాలర్ల ప్రాజెక్టును అందిస్తారని, ఇది వర్సిటీ పరంగా నాకు లభించిన మంచి అవకాశంగా ఆమె పేర్కొన్నారు.
చదవండి: Sandhya Devanathan: ఆంధ్రా నుంచి ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ వరకు.. ఎన్నో విజయాలు!