Fee Reimbursement: ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించండి
Sakshi Education
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని విద్యార్ధి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు కుంబాల లక్ష్మణ్ యాదవ్‌లు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని కళాశాలల విద్యార్థులకు సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
చదవండి: Single Girl Child Scholarship 2023: సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్–2023.. ఎవరు అర్హులంటే..
బీసీ సంక్షేమ కళాశాల వసతి గృహం, కళాశాల నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లను కళాశాల ఆవరణల్లోనే అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
Published date : 10 Oct 2023 01:28PM