ఓయూ, ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయంతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపుతోంది. బ్యాంకాక్ పర్యటనలో భాగంగా వారి ఆహ్వానం మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ ఏఐటీ ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏఐటీ అకాడమిక్ సెనెట్ ఛైర్మన్ నితిన్ కుమార్ త్రిపాఠి, అంతర్జాతీయ వ్యవహారాల సమన్వయకర్త సుమన్ శ్రేష్ట, ఆయా విభాగాధిపతులతో భేటీ అయ్యారు.
చదవండి: ఉపాధ్యాయుల నియామకం నాణ్యమైన విద్యకు సహాయపడుతుంది
విద్య, పరిశోధన రంగాల్లో విద్యార్థి, అధ్యాపకుల మధ్య పరస్పర విజ్ఞాన మార్పిడి సహా అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను అందిపుచ్చుకునే దిశగా కలిసి పనిచేద్దామని ప్రతిపాదించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఏఐటీ ఛైర్మన్ త్రిపాఠి, త్వరలోనే ఓయూను సందర్శిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఉస్మానియా – ఏఐటీ మధ్య పరస్పర అవగాహన ఒప్పందం ఉండేదని, కొన్ని కారణాల రీత్యా మధ్యలోనే నిలిచిపోయిందని ఓయూ వీసీ గుర్తు చేశారు. తిరిగి ఎంఓయూ కుదుర్చుకోవటం ద్వారా ఇంజినీరింగ్, మేనేజ్ మెంట్ , పర్యావరణ విభాగాల్లో అత్యుత్తమ విద్యా, పరిశోధనా ప్రమాణాలను ఇచ్చిపుచ్చుకునే వెసులుబాటు లభిస్తుందని అన్నారు.
చదవండి: ఓయూ విద్యార్థులంటే.. ఇలా ఉంటారు.. | Sekhar Kammula, Film Director, Producer
ఏఐటీ పాలక మండలిలో 15దేశాల అంబాసిడర్స్ సభ్యులుగా ఉన్నారని, విద్య, పరిశోధనల్లో నాణ్యత విషయంలో రాజీ లేకుండా పనిచేస్తున్నారని వివరించారు. ఏఐటీలో చేరే భారతీయ విద్యార్థులకు 30శాతం ఫీజు రాయితీ ఇవ్వాలనే తన ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. నాగరికత, సాంస్కృతిక అంశాల్లో ఇరు దేశాలకు మంచి సంబంధాలున్నాయని కలిసి పనిచేయటం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు లభిస్తాయని అన్నారు. ఓయూ పూర్వ విద్యార్థులు ఏఐటీలో అధ్యాపకులుగా రాణించటం శుభపరిణామమని వారి ద్వారా ఓయూ ఏఐటీ మధ్య వారధి సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు.
చదవండి: ఉద్యమాల గడ్డ నుంచి ఉద్యోగాల అడ్డాగా #OsmaniaUniversity: CV Anand, IPS