Skip to main content

Admissions: ‘మనూ’లో రెగ్యులర్‌ కోర్సులకు ఆన్‌లైన్‌ స్పాట్‌ అడ్మిషన్లు

మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో మెరిట్‌ ఆధారంగా అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులలో స్పాట్‌అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్‌ పోర్టల్‌ను ప్రారంభించింది.
Online spot admissions for regular courses in ‘Manu’
Online spot admissions for regular courses in ‘Manu’

Data Science: డేటా సైన్స్ నిపుణులకు తీవ్ర కొరత

వివిధ కోర్సులలో ప్రవేశానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు, ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్నా అడ్మిషన్లు పొందని అభ్యర్థుల కోసం ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఆన్‌లైన్‌లో బుధ, గురు, శుక్రవారాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిలి్పంచారు. ఎంపికైన వారి జాబితాను అక్టోబర్‌ 24వ తేదీన, సర్టిఫికెట్ల పరిశీలన 28న చేస్తారు. కాగా ఫీజు చెల్లింపును అక్టోబర్‌ 28, 29 తేదీలలో చెల్లించేందుకు అవకాశం కల్పిస్తారు. హైదరాబాద్‌ క్యాంపస్‌లో ఖాళీలు ఉన్న కోర్సులలో బీఎస్సీ(ఎంపీసీ), ఎంకామ్, ఎంఏ( ఎననామిక్స్, ఇస్లామిక్‌ స్టడీస్, పర్షియన్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్‌సైన్స్, సోషియాలజీ, విమెన్‌ స్టడీస్‌) ఉన్నాయి. కాగా బుద్గామ్‌ క్యాంపస్‌లో ఎంఏ ఎకనామిక్స్, ఇస్లామిక్‌ స్టడీస్‌లలో ఖాళీలు ఉన్నాయి. లక్నో క్యాంపస్‌లో ఎంఏ పర్షియన్‌ కోర్సులో మాత్రమే ఖాళీలు ఉన్నాయి. మరిన్ని వివరాలకు యూనివర్శిటీ వెబ్‌సైట్‌ manuu.edu.in  సందర్శించాలి. 


మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి 
 

Published date : 20 Oct 2021 04:02PM

Photo Stories