NMMS: ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష తేదీ ఇదే..
Sakshi Education
శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ ఉపకార వేతన పరీక్ష(ఎన్‌ఎంఎంఎస్) డిసెంబర్ 3న జరగనుందని, అభ్యర్థులంతా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు తెలిపారు.
ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారిక వెబ్‌పోర్టల్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీవోవి.ఇన్ లో లాగిన్ అయి హాల్‌టిక్కెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ఈ విషయమై ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.
చదవండి: NMMS Scholarship: నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్.. ప్రతి నెల రూ.వెయ్యి స్కాలర్‌షిప్
పాఠశాల యు–డైస్ కోడ్ ను ఉపయోగించి, పరీక్షలకు హాజరయ్యే పాఠశాల విద్యార్థుల హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసి అందజేయాలని సూచించారు. వారంతా శతశాతం పరీక్షలకు హాజరయ్యేలా శ్రద్ధ తీసుకోవాలని డీఈఓ విజ్ఞప్తి చేశారు.
Published date : 24 Nov 2023 04:01PM