KNRUHS: ఎంబీబీఎస్, బీడీఎస్‌లో ప్రవేశాల ప్రక్రియ షురూ.. చివరి తేదీ ఇదే..
దీని ద్వారా యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్–2023లో అర్హత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. జూలై 7 ఉదయం 8 గంటల నుండి 14వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. దరఖాస్తుతో పాటు అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు, ధ్రువపత్రాలను పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. దీనికి సంబంధించి వ్యక్తిగతంగా ఎలాంటి సమాచారం పంపరు.
చదవండి: Medical Health Department: ఈ ఉద్యోగుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో రిజర్వేషన్
వెబ్‌సైట్‌ను మాత్రమే చూడాలి. తుది మెరిట్ జాబితా విడుదల అనంతరం వెబ్ ఆప్షన్లకు యూనివర్సిటీ మరో ప్రకటన జారీ చేస్తుంది. తదనుగుణంగా అభ్యర్థులు ప్రాధాన్య క్రమంలో ఆప్షన్లు నమోదు చేసు కోవాలి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం జాతీయ స్థాయి నుంచి వచ్చే కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర స్థాయిలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఎంబీబీఎస్, డెంటల్ కోర్సుల కోసం రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజును ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ. 3,500గా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 2,900గా నిర్ధారించారు. ఫీజును డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
చదవండి: Medical Colleges: మరో 8 కొత్త మెడికల్ కాలేజీలు.. ‘జిల్లాకో మెడికల్ కాలేజీ’ ఇలా..
దరఖాస్తులో ఇబ్బంది ఎదురైతే..: అడ్మిషన్ కోసం వెబ్ ఆప్షన్ల కోసం ప్రత్యేకంగా షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తును సమర్పించడానికి విద్యార్థికి ఏదైనా ఇబ్బంది ఎదురైతే 93926 85856, 78425 42216, 9059672216 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. లేదాtsmedadm2023@gmail.com ఈ–మెయిల్ చేయొచ్చు. ప్రవేశాలకు సంబంధించిన అర్హతలు, ఇతర సమాచారానికి యూనివర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in ను సందర్శించాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
చదవండి: MBBS కన్వీనర్ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే.. ప్రైవేటు కళాశాలల్లో మాత్రం ఇలా..