Department of Education: ఉమ్మడి బోర్డ్‌కు ఆమోదం రావొచ్చు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్–టీచింగ్ సిబ్బంది నియామకానికి సంబంధించిన ఉమ్మడి నియామక బోర్డ్‌కు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలుపుతుందని ఆశిస్తున్నామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు.
ఉమ్మడి బోర్డ్‌కు ఆమోదం రావొచ్చు
ఉన్నత విద్య మండలిలో నవంబర్ 18న ఆమె విలేకరులతో మాట్లాడుతూ గవర్నర్ కోరిన విధంగా అన్ని వివరణలు ఇచ్చామని స్పష్టం చేశారు. వాటిపై ఆమె సంతృప్తి చెందినట్టు భావిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి బోర్డ్ ఏర్పాటుపై ప్రభుత్వం చేసిన చట్టంపై తనకు అనుమానాలున్నాయని, మంత్రి నివృత్తి చేయాలని గవర్నర్ లేఖ రాయడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సబిత కొన్ని రోజుల క్రితం గవర్నర్‌ను కలిశారు. దీనిపై గవర్నర్ మరికొన్ని వివరణలు కోరినట్టు ప్రచారం జరిగింది. ఇదే అంశాన్ని మంత్రి వద్ద విలేకరులు ప్రస్తావించగా సమాధానం చెప్పకుండా దాటవేశారు.