Admissions: విద్యార్థుల భవిష్యత్తుకు నవోదయం.. పరీక్ష విధానం ఇదీ..
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించేందుకు దీనిని స్థాపించారు. 2023–2024 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశానికి 4,789 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి జనవరి 20వతేదీన పరీక్ష నిర్వహించనున్నారు. ఇందు కోసం జిల్లాలో 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్‌టిక్కెట్లను https://cbseitms.rcil. gov.in/ nvs/ Admincard/ Admincard వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మొత్తం 80 సీట్లు..
నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో సీటు సాధిస్తే ఏడేళ్ల పాటు ఉచిత విద్య అందుతుంది. వలసపల్లి జవహర్ నవోదయ విద్యాలయంలో 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బాలికలకు 30 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లు కేటాయిస్తున్నారు. మొత్తం 80 సీట్లలో 75 శాతం అంటే 60 సీట్లను గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, 20 సీట్లు పట్టణ ప్రాంతల విద్యార్థులకు కేటాయిస్తారు.
చదవండి: Schools Closed : కల్లోలం.. పాఠశాలల మూసివేత..! ఎందుకంటే..?
పరీక్ష విధానం ఇదీ..
నవోదయ పరీక్ష 100 మార్కులకు 80 శాతం ప్రశ్నలు ఉంటాయి. సమయం రెండు గంటలు. దివ్యాంగులకు అదనంగా 40 నిమిషాలు సమయం ఇస్తారు. మేధాశక్తిని పరీక్షించేందుకు 50 మార్కులకు 40 ప్రశ్నలు, గణితంలో ప్రతిభను తెలుసుకునేందుకు 25 మార్కులకు 20 ప్రశ్నలు, భాషా పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు 25 మార్కులకు 20 ప్రశ్నలు ఇస్తారు.
ఆహ్లాదకర వాతావరణం..
నవోదయ విద్యాలయంలో సీబీఎస్‌ఈ సిలబస్‌తో కూడిన అత్యుత్తమ విద్యాబోధన అందిస్తారు. నిపుణులైన అధ్యాపకులు బోధిస్తారు. సువిశాల ప్రాంగణం, ఆహ్లాదకర వాతావరణం, అధునాత కంప్యూటర్ ల్యాబ్, పోషక విలువలతో కూడిన ఆహారం, మానసికోల్లాసానికి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా, ఎన్‌సీసీ తదితర అంశాలు నవోదయ విద్యాలయ ప్రత్యేకతలు. సీబీఎస్‌ఈ పరీక్ష ఫలితాల్లో నూరుశాతం ఉతీర్ణత సాధిస్తూ నవోదయాలు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.
- జనవరి 20న ప్రవేశ పరీక్ష
- 26 పరీక్షా కేంద్రాలు
- సీటు సాధిస్తే ఏడేళ్ల పాటు
- ఉచిత విద్యాబోధన
అత్యుత్తమ ప్రమాణాలు
విద్యాలయంలో అత్యుత్తమ విద్యా ప్రమాణాలు ఉన్నాయి. విద్యార్థుల సర్వోతముఖాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. విద్యాలయంలో కెరీర్ గైడెన్స్ సెల్ ఏర్పాటు చేశాం. న్యూట్రీషియన్ ఆధ్వర్యంలో పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తున్నాం. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు చాలా మంది ఉన్నత స్థాయిలో ఉన్నారు.
– గోవిందరావు, ప్రిన్సిపాల్, నవోదయ విద్యాలయం