Dasari Usha: ఐఐటీ స్టూడెంట్... పొలిటికల్ ఎంట్రీ
కరోనా సమయంలో మా సొంత జిల్లా పెద్దపల్లిలోని కనగర్తి గ్రామానికి వచ్చాక మా అమ్మనాన్నల పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించాం. ‘పద్మహన్మయ్య’ ట్రస్ట్ ద్వారా చదువుకున్న నిరుద్యోగులకు జీతాలు చెల్లించి 60గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల్లోని పిల్లలకు ఉచితంగా ట్యూషన్‌లు చెప్పించాం.
చదవండి: India: ఎన్నికల సంస్కరణలు (Electoral Reforms) అంటే ఏమిటి? | Groups | #sakshieducation
రాజకీయ ఒత్తిళ్ల కారణంగా డీఈఓ ఆ కార్యక్రమాలను రద్దుచేయమన్నారు. ఆ విషయమై కలెక్టర్‌కు విన్నవించినా ఫలితం లేకపోయింది. ‘కలెక్టర్ అయితే ఎంతో మందికి సేవ చేయవచ్చు’ అనుకున్న నేను ఆ సంఘటనతో నిర్ణయాన్ని మార్చుకున్నాను.
కలెక్టర్ అయినా రాజకీయ నేతల దగ్గర పని చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉందనిపించింది. దీనికి తోడు కులవివక్షతో మాపై బురదజల్లే ప్రయత్నాలు జరిగాయి. దాంతో రాజకీయాల్లోకి రావాలనిపించి బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్నాను.
– దాసరి ఉష, పెద్దపల్లి బీఎస్పీ అభ్యర్థి