Skip to main content

Ministry of Home: ఖైదీల్లో సత్ప్రవర్తనే లక్ష్యంగా.. త్రైపాక్షిక ఒప్పందం

లాలాపేట: ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావటం, మానసికంగా వారిని తీర్చిదిద్దేందుకు ఉస్మానియా యూనివర్సిటీ, పోలీసు పరిశోధన–అభివృద్ధి బ్యూరో, ఢిల్లీ జైళ్ల శాఖ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది.
Ministry of Home
ఖైదీల్లో సత్ప్రవర్తనే లక్ష్యంగా.. త్రైపాక్షిక ఒప్పందం

ఈ మేరకు ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారి అనుపమ నీలేఖర్‌ చంద్ర, ఢిల్లీ జైళ్ల శాఖ అధికారి హెచ్‌పీఎస్‌ శ్రాన్, ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ పి.లక్ష్మీనారాయణ, ఉన్నతి ప్రాజెక్టు డైరెక్టర్‌ ఓయూ విశ్రాంత అధ్యాపకురాలు ప్రొఫెసర్‌ బీనా చింతలపూరి సమక్షంలో ఎంవోయూ పత్రాలను మార్చుకున్నారు.

చదవండి: ఉపాధ్యాయుల నియామకం నాణ్యమైన విద్యకు సహాయపడుతుంది

‘ఉన్నతి‘అనే కాగ్నిటివ్‌ బిహేవియరల్‌ చేంజ్‌(సీబిసీ) ఇంటర్వెన్షన్‌ ప్రోగ్రాంను 2015లో తెలంగాణ జైళ్ల శాఖ ఆదేశాల మేరకు ఓయూ సైకాలజీ అధ్యాపకురాలు ప్రొఫెసర్‌ బీనా రూపొందించారు. ఈ ఒప్పందం ద్వారా తీహార్‌ జైల్లో ఖైదీల్లో నేరప్రవృత్తి, అపరాధ భావనను తగ్గించే విధంగా ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఎంఓయూపై ఓయూ వీసీ ప్రొఫెసర్‌ రవీందర్‌ హర్షం వ్యక్తం చేశారు.

చదవండి: కష్టపడితేనే ఏ రంగంలోనైనా గ్రోత్‌ ఉంటుంది.. లా లోనూ అంతే | Osmania University | Law

Published date : 10 Jul 2023 03:50PM

Photo Stories