Skip to main content

Karate Championship: విద్యార్థినికి కరాటేలో గోల్డ్‌ మెడల్‌

పర్వతగిరి: గోవాలో నవంబర్‌ 18నుంచి 23వ తేదీ వరకు వరల్డ్‌ పునకోసి చోటాఖాన్‌ ఆధ్వర్యంలో ఆలిండియా కరాటే ఛాంపియన్‌షిప్‌ పోటీలు నిర్వహించారు.
Gold medal in karate for student

ఈ పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 585మంది క్రీడాకారులు పాల్గొనగా కల్లెడ ఆర్డీఎఫ్‌ వనిత అచ్యుతపాయ విద్యాలయ జూనియర్‌ కళాశాలలో ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతున్న గట్ల మనుశ్రీ కరాటే కటాస్‌ విభాగంలో గోల్డ్‌ మెడల్‌, స్పరింగ్‌ విభాగంలో సిల్వర్‌ మెడల్‌, గ్రాండ్‌ ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీ అందుకుంది.

చదవండి: Boxing Competition: టీటీడబ్ల్యూఆర్‌డీసీ విద్యార్థులకు పతకాలు

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ ఎ.జనా ర్ధన్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ రాజు, ఏఓ ఏకాంబరం, శ్రీలత, శ్రీరామమూర్తి, మధుకర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌, దేవేందర్‌,అశోక్‌,అనిల్‌, నాగరాజు, మౌనిక, కమలేష్‌, మహేష్‌, కళాశాల అధ్యాపకులు మంగళవారం గోల్డ్‌ మెడల్‌ సాధించిన మనుశ్రీని అభినందించారు.

Published date : 29 Nov 2023 03:00PM

Photo Stories