Skip to main content

GAM 2023: ఉస్మానియా విశ్వవిద్యాలయం గ్లోబల్ అలుమ్ని మీట్ స‌మాచారం

ఉస్మానియా విశ్వవిద్యాలయం: ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యాబుద్దులు నేర్చుకుని ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడ్డ పూర్వ విద్యార్థులంతా జన‌వరి 3, 4 తేదీల్లో జరగనున్న "Global Alumni Meet - 2023" లో పాల్గొనాలని వైస్ ఛాన్స‌ల‌ర్‌ ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్ పిలుపునిచ్చారు.
GAM 2023
ఉస్మానియా విశ్వవిద్యాలయం గ్లోబల్ అలుమ్ని మీట్ స‌మాచారం

జనవరి 3, 4వ తేదీల్లో ఓయూ క్యాంపస్ లోని ఠాగూర్ ఆడిటోరియంలో ఈ గ్లోబల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. విభాగాల వారీగా అలుమ్నీ సమావేశాలు జరుగుతున్నా..ఉస్మానియా మొత్తంగా పూర్వ విద్యార్థుల సమావేశం జరగటం ఇదే తొలిసారని వివరించారు. ఓయూ సమగ్ర అభివృద్ధి, బ్యాండింగ్ విషయంలో పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేసే దిశగా సెక్షన్ – 8 కంపెనీ కింద ఇప్పటికే ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేశామని వివరించారు. సీఎస్ఆర్, అలుమ్ని, బ్రాండింగ్ కోసం సి.ఎ.బి డైరెక్టరేట్ ను రూపకల్పన చేశామని. ప్రస్తుతం ఈ గ్లోబల్ అలుమ్ని సి.ఎ.బి పర్యవేక్షణలో జరుగుతుందని చెప్పారు. కనెక్ట్ టు రీకనెక్ట్ పేరుతో పూర్వ విద్యార్థులందరినీ ఉస్మానియన్లుగా ఒకే వేదిక ద్వారా కలిపే ప్రయత్నంలో ఇప్పటికే వెయ్యి మంది పూర్వ విద్యార్థులు సమ్మేళనంలో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్నారని అన్నారు. ఇంకా పెద్ద మొత్తంలో విద్యార్థులు హాజరయ్యేందుకు స్పాట్ రిజిస్ట్రేషన్లకు కూడా ఏర్పాట్లు చేశారు.

చదవండి: సీజే రమణకు OU Doctorate

వైస్ ఛాన్స‌ల‌ర్‌ ప్రొఫెసర్ దండేబోయిన రవిందర్ మీడియా సమావేశంలో వెల్లడించిన మరికొన్ని విషయాలు..

  • ఉస్మానియా ఫౌండేషన్ ద్వారా విశిష్ట పూర్వ విద్యార్థులు, విశ్రాంత ఉప-కులపతులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో కీలక భూమిక పోషిస్తున్న ఉస్మానియా పూర్వ విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు 16 కమిటీలు పనిచేస్తున్నాయి.
  • ఉస్మానియా విశ్వవిద్యాలయ అభివృద్ధి, ఇతర అంశాలపై విశిష్ట పూర్వ విద్యార్థులతో పలు బృంద చర్చలు(ప్యానల్ డిస్కషన్స్) ఉంటాయి.
  • యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లోని లాన్‌లలో 3 వ తేదీన సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు.
  • 4వ తేదీన... అలుమ్ని రెండో రోజు పూర్వ విద్యార్థులు ఆయా విభాగాలను సందర్శించి, అధ్యాపకులు, విద్యార్థులతో మమేకమై చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకునేలా సంబంధిత హాస్టళ్లలో భోజనం చేసే ఏర్పాట్లు చేశారు.
  • గ్లోబల్ అలుమ్ని మీట్ సందర్భంగా ఉస్మానియా క్యాంపస్ సహా అనుబంధ కళాశాలలను సుందరంగా తీర్చితిద్దుతున్నారు.
  • పూర్వ విద్యార్థుల(అవసరమైన వారికి)కు సహాయకులుగా దాదాపు 300 మంది విద్యార్థులను వాలంటీర్లుగా ఎంపిక చేశారు. భద్రతా ఏర్పాట్లు, వైద్య సౌకర్యాలు సహా ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు.
  • గ్లోబల్ అలుమ్ని మీట్ లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న ఉస్మానియా పూర్వ విద్యార్థులు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్పాట్ రిజర్వేషన్లకు కూడా అవకాశం కల్పించారు.
  • ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ ఉస్మానియా పూర్వ విద్యార్థులు గ్లోబల్ అలుమ్ని మీట్ లో పాల్గొనేందుకు ఆసక్తి చూపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
  • 2022 ప్రారంభంలో అమెరికా పర్యటనలో భాగంగా విదేశాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థుల కమిటీలు చేసిన సూచనల మేరకు ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేశారు.
  • పూర్వ విద్యార్థుల నుంచి తిరిగి తాము చదువుకున్న విద్యాలయానికి తమ వంతు సహకారం తీసుకునేందుకు నిబంధనలు ఇబ్బందిగా ఉండేవి. విదేశాల నుండి విరాళాలు స్వీకరించడంలో ఉన్న అడ్డంకులను ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు ద్వారా అధిగమించనున్నాం.
  • పూర్వ విద్యార్థుల ఆర్థిక సహకారంతో రీసెర్చ్ అవార్డులు, ప్రసంగాలు, మౌళిక వసతుల కల్పన వారి పేర్ల మీద చేసేలా ఏర్పాట్లు చేశారు.
  • ఈ సమ్మేళనంలో ఈ మధ్య కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల సమాహారాన్ని నివేదిస్తాం.
  • బోధనా అభ్యాస వనరులను బలోపేతం చేయడం, విద్యార్థులకు సౌకర్యాలను మెరుగుపరచటం, గ్రీన్ క్యాంపస్ కార్యక్రమాలు, మౌళిక సదుపాయాల కల్పన, క్యాంపస్ సుందరీకరణ సహా పలు ప్రతిపాదిత ప్రాజెక్టులలో పూర్వ విద్యార్థుల భాగస్వామ్యాన్ని తీసుకుంటాం.

ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. లక్ష్మి నారాయణ, క్యాబ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజశేఖర్, ప్రొఫెసర్ స్టీవెన్సన్, ప్రొఫెసర్ శ్రీనివాసులు, ప్రొఫెసర్ ప్యాట్రిక్, డాక్టర్ నాజియ తదితరులు పాల్గొన్నారు.

Published date : 29 Dec 2022 06:10PM

Photo Stories