నిట్ ఎంబీఏ దరఖాస్తుల గడువు పెంపు
ఆయన జనవరి 21న మీడియాతో మాట్లాడారు. 2022 విద్యాసంవత్సరం నుంచి కోర్సును ప్రారంభించనున్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారు సది్వనియోగం చేసుకోవాలని కోరారు. ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకునేవారు ఏదైనా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. క్యాట్, సీమ్యాట్, జీమ్యాట్ వంటి పరీక్షల్లో అర్హత సాధించి ఉండాలి. హ్యూమన్ రీసోర్సు మేనేజ్‌మెంటు, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, బిజినెస్ అనలటిక్స్ డెసిషన్ మేకింగ్, ప్రొడక్షన్ ఆపరేషన్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అనే ఐదు కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలకు నిట్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అడ్మిషన్ల అధికారి డాక్టర్ తపస్ పర్మానిక్ తెలిపారు.
చదవండి:
Career Guidance: పదవ తరగతి తర్వాత.. కోర్సులు, ఉద్యోగ అవకాశాలు..
Admissions in NIT Rourkela: నిట్, రూర్కెలాలో ఎంబీఏ ప్రవేశాలు.. దరఖాస్తులకు చివరి తేది ఇదే..