ఉస్మానియా యూనివర్సిటీ: మౌలిక వసతుల కల్పన కోసం రూ.100 కోట్ల లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఓయూ ఫౌండేషన్‌కు ఇప్పటివరకు రూ.20 కోట్ల విరాళం అందినట్లు వీసీ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు.
OU Foundationకు రూ.20 కోట్ల విరాళం
సింగరేణి కాలరీస్ రూ.5 కోట్లు, ఎన్‌టీపీసీ రూ.5 కోట్లు, కోల్ ఇండియా లిమిటెడ్ రూ.3 కోట్లు, జెన్‌కో రూ.1.53 కోట్లు, భారత్ పెట్రోలియం రూ.1.5 కోట్లు విరాళంగా అందచేసినట్లు వీసీ వివరించారు. మరికొంతమంది కూడా తమ వంతుగా విరాళాన్ని అందించారని తెలిపారు. ఓయూ ఫౌండేషన్‌కు రూ.50 వేలను వీసీ రవీందర్ ఆగస్టు 15న ప్రకటించారు.