UGC: మాతృభాషలో డిగ్రీ కోర్సులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: మాతృభాషలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు చేసేందుకు వీలుకల్పిం చాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్ణయించింది.
ఇందుకు సంబంధించిన కసరత్తు మొదలైందని యూజీసీ చైర్మన్ జగదీశ్‌కుమార్ తెలిపారు. బెంగాలీ, గుజరాతీ, ఒడియా, తమిళ్, తెలుగు సహా మొత్తం 12 భాషల్లోకి ఇంగ్లిష్ లో ఉన్న డిగ్రీ పుస్తకాలను తర్జుమా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు.
చదవండి: డిజిటల్‌తో పల్లెకు చేరువగా ఉన్నత విద్య
కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ వివిధ భాషల్లో అనువాదం చేసే ప్రక్రియను మొదలు పెట్టింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020లో భాగంగా డిగ్రీ స్థాయిలో అనేక మార్పులు తెస్తున్నారు. ఇప్పటికే పలు పుస్తకాలను మాతృభాషల్లో ట్రాన్స్‌లేట్ చేశారు.
చదవండి: ఏకకాలంలో రెండు డిగ్రీ, పీజీ కోర్సులు.. నష్టమా?.. లాభమా?
Published date : 20 Dec 2022 03:29PM