కోర్సు పూర్తి చేసిన 180 రోజుల్లో డిగ్రీలివ్వాలి
Sakshi Education
విద్యార్థులకు పరీక్షా ఫలితాలు ప్రకటించిన 180 రోజుల్లోగా డిగ్రీ సర్టిఫికెట్లు ప్రదానం చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్ని విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థుల నుంచి వినతులు అందడంతో పాటు సమాచార హక్కు చట్టం కింద కూడా పలువురు దరఖాస్తు చేయటంతో ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. పలు విద్యాసంస్థలు డిగ్రీలు ప్రదానం చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, ఇది విద్యార్థుల హక్కులను హరించడమేనని అభిప్రాయపడింది. కోర్సులు పూర్తి చేసిన వారికి నిర్దేశించిన కాలపరిమితిలోగా సర్టిఫికెట్లు అందించాలని.. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Published date : 11 Apr 2022 04:08PM