National Science Day: నేటి నుంచి విద్యార్థులకు పోటీలు
Sakshi Education
సంగారెడ్డి అర్బన్: జిల్లావ్యాప్తంగా జాతీయ సైన్స్ దినోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఫిబ్రవరి 5న ఒక ప్రకటనలో తెలిపారు.
సంబరాల్లో భాగంగా విద్యార్థులకు పెయింటింగ్, కవిత్వం, పాటలు, ఉప న్యాస పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఏదైనా ఒక అంశంపై మాత్రమే పాల్గొనాలని సూచించారు. పాఠశాల స్థాయి పోటీలు ఫిబ్రవరి 6 తేదీన, మండల స్థాయి 7వ తేదీన, జిల్లాస్థాయి పోటీలు తొమ్మిదో తేదీన జిల్లా సైన్స్ కేంద్రంలో నిర్వహిస్తామన్నారు.
చదవండి: Elon Musk: మనిషి మెదడులో బ్రెయిన్ చిప్
ఒక్కొక్క పోటీ నుంచి ముగ్గురు చొప్పున ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ స్థానాలు పొందిన మొత్తం 12 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. రాష్ట్రస్థాయిలో ఎంపికై న విద్యార్థులకు ఈనెల 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించే కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందజేస్తామని వెల్లడించారు.
Published date : 06 Feb 2024 12:54PM