Common Science Education: ఉమ్మడి శాస్త్ర విద్యా విధానం అమలు చేయాలి
Sakshi Education
ఆదిలాబాద్ టౌన్: జాతీయ విద్యావిధానం ఎన్‌ఈపీ– 2020ను రద్దు చేసి ఉమ్మడి శాస్త్ర విద్యావిధానం అమలు చేయాలని విద్యార్థి సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ బి.రాహుల్ అన్నారు.
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఫిబ్రవరి 25న నిర్వహించిన అఖిల భారత విద్యార్థుల సదస్సులో పాల్గొని మాట్లాడారు. విశ్వ విద్యాలయాల్లో ఉన్న బోధన, బోధననేతర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటుకు సహకరించాలని కోరారు.
చదవండి: IIT & NIT: మరో 4 వేల సీట్లు పెంచే అవకాశం!
సదస్సులో విద్యార్థి సంఘాల నాయకులు అనసూయ, మమత, నవీన్ కుమార్, సుజయ్, సత్యనారాయణ, సాయికుమార్, ఇఫ్తార్‌ఖాన్, అశో క్ తదితరులు పాల్గొన్నారు.
Published date : 26 Feb 2024 01:08PM