Skip to main content

ఐఐటీల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో మార్పులు

Indian Institute of Technology (IIT)ల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సులను సమూలంగా మార్చాలని నిర్ణయించారు.
Changes in Bachelor of Design courses in IITs
ఐఐటీల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో మార్పులు

ఇందుకు అనుగుణంగా బోధన ప్రణాళికను కూడా రూపొందిస్తున్నారు. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులు, మార్కెట్‌ అవసరాలకు వీలుగా వీటిని తయారు చేయాలని ఏడాది క్రితమే ఓ నిర్ణయానికి వచ్చారు. తాజాగా బ్యాచులర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ డిజైన్‌–యూసీడ్‌) సిలబస్‌లో అనేక మార్పులు చేశారు. కొత్త సిలబస్‌ 2024 నుంచి అమలులోకి వచ్చే వీలుంది. ఈ బాధ్యతను ఐఐటీ ముంబైకి అప్పగించారు. ఇప్పటికే కొత్త సిలబస్, యూసీడ్‌ పరీక్ష విధానం గురించి ముంబై ఐఐటీ సూత్రప్రాయంగా కొన్ని విషయాలు వెల్లడించింది. పరీక్షలోని ‘ఏ’విభాగంలో పెద్దగా మార్పులు లేకున్నా, ‘బీ’విభాగంలో మాత్రం చాలా మార్పులు చేశారు. ఇప్పటి వరకూ ఉన్న 30 నిమిషాల పరీక్ష సమయాన్ని 60 నిమిషాలకు పెంచారు. ఇందులో ఇప్పుడున్న సిలబస్‌తో పనిలేకుండా.. మార్కెటింగ్, అంతర్జాతీయ మార్పుల కోణంలోనే సిలబస్‌ను తయారు చేశారు. హైదరాబాద్‌ ఐఐటీ సహా ముంబై, ఢిల్లీ, గువాహటి, జబల్‌పూర్‌ ఐఐటీలు బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సులను అందిస్తున్నాయి. బ్యాచిలర్‌ డిగ్రీనే కాకుండా మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి చేపట్టే ఉమ్మడి ప్రవేశ పరీక్షలను కూడా సమూలంగా మార్చే దిశగా ముంబై ఐఐటీ నేతృత్వంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

చదవండి: 

Engineering: తొలివిడత వదిలేస్తే మలివిడతలో చాన్స్‌

JEE Advanced 2022: టాప్‌ టెన్‌లో ఐదుగురు తెలుగు విద్యార్థులు విరే..

Published date : 16 Sep 2022 01:33PM

Photo Stories