Skip to main content

Central Government Jobs 2023: కేంద్ర సాయుధ బలగాల్లో 83,127 ఉద్యోగాలు.. వీటిని ఎప్పుడు భ‌ర్తీ చేస్తారంటే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : కేంద్ర సాయుధ బలగాల్లో 83వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు.
indian armed forces jobs 2023 news telugu
indian armed forces jobs

కేంద్ర సాయుధ బలగాల్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సశస్త్ర సీమాబల్ (SSB), అస్సాం రైఫిల్స్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. మొత్తం మంజూరైన ఉద్యోగాల్లో ప్రస్తుతం 83,127 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. వీటి త్వ‌ర‌లోనే అంచెలంచెలుగా భ‌ర్తీ చేస్తామ‌న్నారు. ఈ ఖాళీలను 2023లోనే నియామక ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు. సాయుధ బలగాల్లోని ఆయా విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి కేంద్ర హోంశాఖ.. యూపీఎస్సీ, ఎస్ఎస్‌సీ.., సంబంధిత బలగాల ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

కేంద్రీయ విద్యాలయాల్లో 58వేలకుపైగా ఉద్యోగాలు ఖాళీలు..

teaching jobs 2023

దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ స్కూళ్లు, ఉన్నత విద్యాసంస్థల్లో 58వేలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాష్ సర్కార్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానమిచ్చారు.అలాగే ఇటీవ‌లే కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివ‌రాల‌ను ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసిన విష‌యం తెల్సిందే.

విద్యాశాఖ‌లోని ఖాళీల వివ‌రాలు ఇవే..
➤ కేంద్రీయ విద్యాలయాలు : 18,411
➤ నవోదయ పాఠశాలలు : 5,027
➤ సెంట్రల్ వర్సిటీలు : 21,978
➤ ఐఐటీలు : 9477
➤ ఎస్ఐటీలు, ఐఐఈఎస్ఓలు : 5862
➤ ఐఐఎసీసీ, ఐఐఎస్ఈఆర్ : 978
➤ ఐఐఎంఎస్ : 1,050. 

మొత్తం 9,79,327 లక్షల ఉద్యోగాలు ఖాళీలు..

central government teacher jobs2023

2021 మార్చి 1 నాటికి కేంద్రంలోని 78 మంత్రిత్వశాఖలు, వివిధ విభాగాల్లో 9,79,327 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటిలో అత్యధికంగా రైల్వేలో 2.93 లక్షల పోస్టులు ఉన్నట్లు నివేదించింది. తర్వాత ప్రాధాన్యతలో రక్షణశాఖ 2.64 లక్షలు, హోంశాఖ 1.43 లక్షల, కేంద్ర విద్యాశాఖలో 58 వేల ఉద్యోగాలు  ఖాళీలను కలిగివున్నాయి.

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

మొత్తం 9,79,327 లక్షల ఉద్యోగాల పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 09 Feb 2023 01:10PM
PDF

Photo Stories