Skip to main content

Free Coaching: పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్‌: కేంద్ర ప్రభుత్వం

స్కీం ఫర్‌ ఫ్రీ కోచింగ్‌.. ప్రతిభ ఉండి ఆర్థిక సమస్యల కారణంగా పోటీ పరీక్షలకు కోచింగ్‌ తీసుకోలేని వారి కోసం కేంద్ర ప్రభుత్వం చేయూత అందిస్తోంది. స్కీమ్‌ ఫర్‌ ఫ్రీ కోచింగ్‌ ద్వారా భారత సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన సామాజిక న్యాయం, సాధికార విభాగం(డీఓఎస్‌జేఈ)..ఎస్సీ, ఓబీసీ అభ్యర్థులకు అవసరమైన శిక్షణకు ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 10వ తేదీలోపు ఆన్‌లైన్‌ వి«ధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
free coaching for competitive exams
free coaching for competitive exams

మొత్తం సీట్ల సంఖ్య: 1500
అర్హత: ఈ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఎస్సీ, ఓబీసీ అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలలోపు ఉండాలి.

వీటికే ఉచిత కోచింగ్‌
ఉద్యోగ పరీక్షలు: యూపీఎస్సీ నిర్వహించే గ్రూప్‌ ఎ,బీ స్థాయి ఉద్యోగాలు, ఎస్‌ఎస్‌బీ, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌(ఆర్‌ఆర్‌బీ) చేపట్టే నియామకాలు, రాష్ట స్థాయి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే పోటీ పరీక్షలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌ సంస్థలు చేపట్టే ఆఫీసర్‌ స్థాయి కొలువులకు సంబంధించిన పరీక్షల కోచింగ్‌కు ఫీజు చెల్లిస్తారు.
ఎంట్రన్స్‌ టెస్టులు: ఐఐటీ జేఈఈ, నీట్, క్యాట్, క్లాట్, సీడీఎస్, ఎన్‌డీఏ, జీఆర్‌ఈ, శాట్, జీమ్యాట్, టోఫెల్‌ లాంటి ఎంట్రన్స్‌ టెస్టులకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు శిక్షణకు అవసరమైన  ఫీజు చెల్లిస్తారు.

స్టయిపెండ్‌
స్థానికంగా ఉండే విద్యార్థులకు నెలకు రూ.3000, దూర ప్రాంత విద్యార్థులకు నెలకు రూ.6000, దివ్యాంగులకు నెలకు రూ.2000 అదనంగా స్టయిపెండ్‌ అందిస్తారు. 

రెండు విధాలుగా అమలు

  • ఈ స్కీమును రెండు విధాలుగా అమలు చేస్తారు. మొదటగా గుర్తింపు పొందిన కోచింగ్‌ సెంటర్లుల/ఇన్‌స్టిట్యూట్లకు సీట్లు కేటాయిస్తారు. ఇందులో ఇన్‌స్టిట్యూట్‌లే అర్హులైన విద్యార్థులను ఎంపిక చేస్తాయి.  
  • రెండో విధానంలో సంబంధిత మంత్రిత్వ శాఖ విద్యార్థులను ఎంపిక చేసి, వారికి ఇష్టమైన కోచింగ్‌ సెంటర్లలో కోచింగ్‌ తీసుకునే వెసులుబాటును కల్పిస్తుంది.
  • ఆయా కోచింగ్‌లకు సంబంధించిన ఫీజు మొత్తాన్ని రెండు విడతల్లో విద్యార్థుల బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తారు.

ముఖ్యమైన సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 10, 2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.coaching.dosje.gov.in
 

Published date : 08 Sep 2021 04:57PM

Photo Stories