CBSE Revised Timetable2024 -CBSE బోర్డ్ ఎగ్జామ్స్ పరీక్షా తేదీల్లో మార్పులు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)2024 బోర్డ్ ఎగ్జామ్స్‌కి సంబంధించిన డేట్‌షీట్‌ను అధికారిక బోర్డ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పదో తరగతి, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్-2024లో కొన్ని పరీక్షల తేదీలను మారుస్తూ CBSE ప్రకటన జారీ చేసింది. సవరించిన టైమ్‌టేబుల్ ప్రకారం... కొన్ని పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అవి ఈ విధంగా ఉండనున్నాయి.
పదో తరగతికి సంబంధించి: ఈ ఏడాది మార్చి4న నిర్వహించాల్సిన టిబెటన్ పేపర్ పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 16న నిర్వహించాల్సిన రిటైల్ పేపర్‌ను ఫిబ్రవరి 28న మారుస్తూ రీషెడ్యూల్ చేశారు. అదే విధంగా 12వ తరగతికి సంబంధించిన మార్చి 11న షెడ్యూల్ చేయబడిన ఫ్యాషన్ స్టడీస్ పరీక్షను మార్చి 21కు మారుస్తూ బోర్డు కొత్త తేదీలను ప్రకటించింది.
సీబీఎస్ఈ బోర్డు పరీక్షల షెడ్యూల్-2024లో భాగంగా పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభమై, మార్చి 13న ముగుస్తాయి. 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15న ప్రారంభమై, ఏప్రిల్ 2న ముగుస్తాయి. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్షా సమయం ఉండనుంది. మరిన్ని వివరాల కోసం CBSE అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inను సంప్రదించగలరు.
రీషెడ్యూల్ చేసిన టైమ్‌టేబుల్‌ను ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
1. ముందుగా CBSE వెబ్‌సైట్ cbse.gov.inకు వెళ్ళండి
2. సీబీఎస్సీ బోర్డ్ ఎగ్జామ్స్ 2024 రివైజ్డ్ డేట్‌షీట్ అనే లింక్‌ను క్లిక్ చేయండి
3. లింక్ క్లిక్ చేయగానే ఓ పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది. అందులో మారిన పరీక్షా తేదీలు చూసుకోవచ్చు.
4. ఇదే షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.