నట్టింట్లోనే...ఐఐటీ ప్రొఫెసర్ల పాఠాలు
Sakshi Education
ఐఐటీ ప్రొఫెసర్ల పాఠాలు వినాలంటే... జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ చూపాల్సిందేనా..? మంచి కాలేజీలో సీటు రాకుంటే..
నాణ్యమైన బోధన అందే అవకాశమే లేదా...! ఐఐటీలు, ఐఐఎంలు, నిట్‌లు, ఐఐఎస్సీ... కొందరికే పరిమితమా...? అంటే... ఎంతమాత్రం కాదని చెప్పొచ్చు. ఎందుకంటే... ఇప్పుడు స్మార్ట్‌ఫోన్/కంప్యూటర్‌తోపాటు ఇంటర్నెట్ ఉంటే చాలు.. పైసా ఖర్చులేకుండా... ఇంట్లోనే కూర్చొని ఐఐటీ ప్రొఫెసర్ల పాఠాలు వినొచ్చు. జేఈఈ నుంచి గేట్, నెట్, ఇంజనీరింగ్, డిగ్రీ.. ఇలా అన్ని రకాల కోర్సులు, పోటీ పరీక్షలకు సంబంధించిన వీడియోలు, వెబ్ కంటెంట్‌ను ఉచితంగా పొందొచ్చు. సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. వర్చువల్ ల్యాబ్స్ ద్వారా ప్రాక్టికల్ నైపుణ్యాలు అలవర్చుకోవచ్చు. అంతేకాదు సర్టిఫికెట్లు అందుకోవచ్చు. ప్రభుత్వ ఆధ్వర్యంలో, ఐఐటీలు వంటి టాప్ ఇన్‌స్టిట్యూట్‌ల నిర్వహణలో నడిచే ఎన్‌పీటీఈఎల్, స్వయం, స్వయం ప్రభ, ఈ-పీజీ, సాక్షాత్, విద్యామిత్ర, వర్చువల్ ల్యాబ్స్ వంటి పోర్టల్స్, చానల్స్ ద్వారా విద్యార్థులు నాణ్యమైన బోధనను సొంతం చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం...
ఎన్‌పీటీఈఎల్ :
మన దేశంలో ముఖ్యంగా వృత్తి విద్యా కళాశాలల్లో నాణ్యమైన ఫ్యాకల్టీ కొరత ఉంది. దాంతో ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో చేరిన విద్యార్థులకు సరైన బోధన అందడంలేదు. ఐఐటీలు వంటి ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్‌లో చదువుకునే అవకాశం లభించని విద్యార్థులకు సైతం ఐఐటీ ప్రొఫెసర్ల పాఠాలు అందుబాటులోకి తేవాలి, ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచాలనే లక్ష్యంతో... ఐఐటీలు, ఐఐఎస్సీతో కలిసి నేషనల్ పోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హ్యాన్స్‌డ్ లెర్నింగ్ (ఎన్‌పీటీఈఎల్)ను అందుబాటులోకి తెచ్చాయి. దీనిద్వారా ఇంట్లో నుంచే ఐఐటీ ప్రొఫెసర్లు, ప్రముఖ ఫ్యాకల్టీ బోధనా వీడియోలను చూడొచ్చు.
టాప్ ఇన్‌స్టిట్యూట్‌ల కలయికలో: ఏడు ఐఐటీలు (బాంబే, ఢిల్లీ, గువహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ), బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) సంయుక్తంగా ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ విద్యార్థుల కోసం అందిస్తున్న వీడియో లెక్చర్లు, వెబ్‌పాఠాల సమాహారమే ఎన్‌పీటీఈఎల్. ఇందులో ఈ-లెర్నింగ్ ద్వారా ఇంజనీరింగ్, సైన్స్ విద్యార్థుల కోసం వెబ్ మెటీరియల్, వీడియో లెక్చర్‌లను అందుబాటులో ఉంచారు.
ప్రయోజనాలు..
డౌన్‌లోడ్ చేసుకోవచ్చు: ఎన్‌పీటీఈఎల్ అందించే వివిధ సబ్జెక్టుల వీడియో లెక్చర్స్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ సదుపాయం లేనివారికి క్లాసులకు సంబంధించిన డీవీడీలు లభిస్తాయి.
వెబ్‌సైట్: www.nptel.ac.in
వర్చువల్ ల్యాబ్స్
వర్చువల్ ల్యాబ్స్‌లో భాగస్వాములైన ఇన్‌స్టిట్యూట్‌లు...
ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ రూర్కీ, ఐఐటీ గువహటి, ఐఐటీ హైదరాబాద్, అమృత విశ్వ విద్యాపీఠం, దయాల్‌బాగ్ యూనివర్సిటీ, ఎన్‌ఐటీ కర్ణాటక, సీవోఈ, పుణె.
వెబ్‌సైట్: https://vlab.co.in
స్వయం:
పదోతరగతి నుంచి పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థుల వరకూ... అందరికీ సబ్జెక్ట్ పరంగా అవసరమైన నైపుణ్యాలు అందించేందుకు రూపొందించిన విధానమే.. స్వయం (స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్). దీన్నొక విధంగా భారత్‌లో మూక్స్ (మ్యాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్)కు విస్తృత రూపంగా చూడొచ్చు. స్వయం నిర్వహణలో యూజీసీ, ఏఐసీటీఈ ప్రమేయం ఉంటుంది. పర్యవేక్షణ, ఫండింగ్‌ను ఎంహెచ్‌ఆర్‌డీ చూస్తుంది. స్వయం అనేది ఒక ఆన్‌లైన్ వెబ్ పోర్టల్. ఈ వెబ్ పోర్టల్ ద్వారా ఆర్ట్స్, సైన్స్, కామర్స్, సోషల్ సైన్స్, పర్‌ఫార్మింగ్ ఆర్ట్స్, హ్యుమానిటీస్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, లా, మెడిసిన్, అగ్రికల్చర్ తదితర అన్ని కోర్సుల విద్యార్థులకు మూక్స్ విధానంలో లెక్చర్స్, ఇంటారాక్టివ్ సెషన్స్ అందుబాటులో ఉంటాయి. సంప్రదాయ గ్రాడ్యుయేట్లకు సైతం సరికొత్త నైపుణ్యాలు, ఉన్నత పరిజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో ఎంహెచ్‌ఆర్‌డీ ఈ పథకాన్ని ప్రారంభించింది.
ఉపయుక్తం..
స్వయంప్రభ :
స్వయం, స్వయం ప్రభ రెండూ వేర్వేరు. స్వయం ఆన్‌లైన్ విధానంలో మూక్ కోర్సులను అందిస్తూ సర్టిఫికెట్లు ఇవ్వడం, క్రెడిట్ ట్రాన్స్‌ఫర్ వంటివి చేస్తుంది. స్వయంప్రభ అనేది ఉచితంగా ఎడ్యుకేషనల్ కంటెంట్‌ను అందించే 32 డీటీహెచ్ ఛానెళ్ల సమూహం. జీశాట్-15 ఉపగ్ర హ అనుసంధానంతో ఈ ఛానెళ్లు 24 గంటలపాటు ప్రసారమవుతాయి. స్వయంప్రభ ద్వారా రోజూ నాలుగు గంటల పాటు నూతన అంశాల (ఎడ్యుకేషనల్ కంటెంట్)ను ప్రసారం చేస్తున్నారు. విద్యార్థులు వీటిని ఏ సమయంలోనైనా వీక్షించేందుకు వీలుగా రోజూ ఐదుసార్లు పునఃప్రసారం చేస్తారు. కరిక్యులం ఆధారిత బోధన అన్ని వయోవర్గాల వారి లెర్నింగ్ అవసరాలను తీర్చే విధంగా స్వయంప్రభ ఛానెళ్ల ప్రసారం సాగుతుంది.
కంటెంట్ ఎవరిస్తారు?
స్వయంప్రభ ప్రసారం చేసే కంటెంట్‌ను దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థలు అందిస్తున్నాయి. కాబట్టి ఔత్సాహికులు నాణ్యమైన కంటెంట్‌ను పొందడంతోపాటు ఉత్తమ నైపుణ్యాలు అలవరచుకోవచ్చు. ఎన్‌పీటీఈఎల్, ఐఐటీలు, యూజీసీ, సీఈసీ, ఇగ్నో, ఎన్‌సీఈఆర్‌టీ, ఎన్‌ఐఓఎస్ ఈ కంటెంట్‌ను అందిస్తున్నాయి.
ఛానెళ్లు అందించే అంశాలు...
ఉన్నత విద్య: పీజీ, యూజీ స్థాయిల్లోని ఆర్ట్స్, సైన్స్, కామర్స్, ఫైన్‌ఆర్ట్స్, సోషల్ సెన్సైస్, హ్యుమానిటీస్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, లా, మెడిసిన్, అగ్రికల్చరల్ విభాగాలకు సంబంధించిన కరిక్యులం ఆధారంగా పాఠ్యాంశాలను ప్రసారం చేస్తారు.
స్కూల్ ఎడ్యుకేషన్ (9-12): టీచర్లకు అవసరమైన శిక్షణతోపాటు అత్యుత్తమ లెర్నింగ్ విధానాలను బోధిస్తారు. వీటిని తెలుసుకోవడం ద్వారా విద్యార్థులు సబ్జెక్టును మరింత లోతుగా అర్థం చేసుకోగలరు. దీంతోపాటు వృత్తి విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమవడంలోనూ ఈ ప్రసారాలు దోహదపడతాయి.
వెబ్‌సైట్: https://swayamprabha.gov.in
ఈ-పీజీ పాఠశాల :
ఎంహెచ్‌ఆర్‌డీ.. నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ కింద ఈ-పీజీ పాఠశాల కార్యక్రమాన్ని చేపట్టింది. ఎంహెచ్‌ఆర్‌డీ ఆధ్వర్యంలో కార్యక్రమ నిర్వహణను యూజీసీ చూస్తోంది. పీజీ స్థాయిలో అత్యుత్తమ నాణ్యత, కరిక్యులం ఆధారిత, ఇంటరాక్టివ్ ఈ-కంటెంట్ అందించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. సోషల్ సెన్సైస్, ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, హ్యుమానిటీస్, మ్యాథమెటిక్స్, నేచురల్ సెన్సైస్, లింగ్విస్టిక్స్ అండ్ లాంగ్వేజెస్ వంటి విభాగాల్లో మొత్తం 77 సబ్జెక్టులకు సంబంధించిన అత్యుత్తమ ఇంటరాక్టివ్ ఈ కంటెంట్‌ను ఈ-పీజీ పాఠశాల ద్వారా అందిస్తున్నారు. దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లోని ప్రొఫెసర్లు, ఇతర ఆర్ అండ్ డీ ఇన్‌స్టిట్యూట్‌ల్లోని అధ్యాపకులు కంటెంట్‌ను అందిస్తుండటం విశేషం.
వెబ్‌సైట్: https://epgp.inflibnet.ac.in
సాక్షాత్ :
విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో మానవ వనరుల మంత్రిత్వ శాఖ సాక్షాత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞాన సంబంధిత కంటెంట్ పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్నా.. చాలామంది వ్యక్తిగతంగా తమకేది అవసరమో తెలుసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గుర్తించిన ఎంహెచ్‌ఆర్‌డీ సాక్షాత్ కార్యక్రమం కింద కంటెంట్‌ను వ్యవస్థీకృతం చేసి సబ్జెక్టుల వారీగా, విభాగాలు వారీగా అందిస్తోంది. సాక్షత్ పోర్టల్ ద్వారా దేశంలోని ఆయా రంగాల్లోని నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోవచ్చు. తద్వారా ఆయా విభాగాలకు సంబంధించిన సందేహాలకు నివృత్తి.. పబ్లిక్ డొమైన్‌లో లభించినట్లవుతుంది. స్పోకెన్ ట్యుటోరియల్, టాక్ టు టీచర్, ఇ-యంత్ర, వర్చువల్ ల్యాబ్స్, ఈ-పీజీ పాఠశాల వంటివి సాక్షాత్‌లో అంతర్భాగం.
వెబ్‌సైట్: https://www.sakshat.ac.in
విద్యామిత్ర :
ఎంహెచ్‌ఆర్‌డీ... నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఇన్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఎన్‌ఎంఈ-ఐసీటీ) కింద ‘విద్యామిత్ర’ అనే ఆన్‌లైన్ లెర్నింగ్ పోర్టల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో ఆడియో, వీడియో లెర్నింగ్ మెటీరియల్స్, టెక్ట్స్యువల్ మెటీరియల్, మల్టీమీడియాకి సం బంధించిన మెటీరియల్ లభ్యమవుతాయి. విద్యామిత్ర పోర్టల్‌లో ఇన్‌స్టిట్యూట్ , సబ్జెక్టు, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిల వారీగా కంటెంట్‌ను బ్రౌజ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇందులో 44,450 ఇ-టెక్ట్స్; ట్యుటోరియల్/వీడియోలు: 66,174; అండర్ గ్రాడ్యుయేట్ ట్యుటోరియల్స్/వీడియోలు: 46,515; పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్యుటోరియల్స్/వీడియోలు: 20,487; ఇతర ట్యుటోరియల్స్/వీడియోలు: 4,753 ఉన్నాయి.
వెబ్‌సైట్: https://vidyamitra.inflibnet.ac.in

- అందరికీ నాణ్యమైన బోధన అందుబాటులోకి తెచ్చి ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ఏర్పడిందే ఎన్‌పీటీఈఎల్.
- ఐఐటీలతోపాటు ఐఐఎస్సీ ప్రొఫెసర్ల బోధనను ఎన్‌పీటీఈఎల్ వీడియోల ద్వారా విద్యార్థులు వినొచ్చు.
- ముఖ్యంగా ఎన్‌పీటీఈఎల్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రతిభావంతులైన విద్యార్థులకు నైపుణ్యాలు పెంచుకునే అవకాశం లభిస్తుంది.
- ఇప్పటికే ఇతర ఇన్‌స్టిట్యూట్స్‌లో బోధనలో ఉన్నవారు, ఉద్యోగాల్లో స్థిరపడిన వారు సైతం పోటీ ప్రపంచంలో మరింత రాణించడానికి ఎన్‌పీటీఈఎల్ ద్వారా అదనపు నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు.
- వీడియోలు ఉచితం: ఎన్‌పీటీఈఎల్‌లో ఆన్‌లైన్ వీడియో తరగతులు ఉచితంగా లభిస్తాయి. ప్రస్తుతం ఇందులో పెద్ద సంఖ్యలో వీడియో లెక్చర్స్, వెబ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నిర్ణీత వ్యవధిలో కోర్సు పూర్తిచేసిన తర్వాత నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ఆయా విద్యా సంస్థలు అందించే సర్టిఫికెట్లు కూడా పొందొచ్చు. ఈ సర్టిఫికెట్లు పొందినవారికి పరిశ్రమలు, కంపెనీలు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుంది.
డౌన్‌లోడ్ చేసుకోవచ్చు: ఎన్‌పీటీఈఎల్ అందించే వివిధ సబ్జెక్టుల వీడియో లెక్చర్స్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ సదుపాయం లేనివారికి క్లాసులకు సంబంధించిన డీవీడీలు లభిస్తాయి.
వెబ్‌సైట్: www.nptel.ac.in
వర్చువల్ ల్యాబ్స్
- ఎంహెచ్‌ఆర్‌డీ ప్రారంభించిన వర్చువల్ ల్యాబ్స్.. గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిల్లోని విద్యార్థులతోపాటు రీసెర్చ్ స్కాలర్స్‌కి సైతం ఉపయోగపడుతున్నాయి.
- ఈ వర్చువల్ ల్యాబ్స్ ద్వారా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగాల్లోని విద్యార్థులు ల్యాబరేటరీ పరిజ్ఞాన్ని అందుకోవచ్చు.
- వర్చువల్ ల్యాబ్స్‌ను ఇనిస్టిట్యూట్ వారీగా, కోర్సు వారీగా విభజించారు. కాబట్టి తమ కోర్సుకు సంబంధించిన ల్యాబ్‌ను ఎంచుకోవడం విద్యార్థులకు సులువవుతుంది.
- వర్చువల్ ల్యాబ్స్‌లో సైన్స్, ఇంజనీరింగ్‌లకు సంబంధించిన సమాచారం పెద్ద ఎత్తున అందుబాటులో ఉంది. వీటిని ఆయా విభాగాల విద్యార్థులు వీక్షించడం ద్వారా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు.
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఫిజికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్‌లకు సంబంధించిన వర్చువల్ ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయి.
- పరిశోధనలపట్ల ఆసక్తి, ఉత్సాహం కలిగిన విద్యార్థులకు వర్చువల్ ల్యాబ్స్ ఉపయుక్తం. వీటిద్వారా ప్రాథమిక అంశాలతోపాటు ఆయా విభాగాల్లోని తాజా మార్పులు, పరిణామాలపై అవగాహన పెంచుకోవచ్చు.
- వర్చువల్ ల్యాబ్స్‌లో విద్యార్థులు నిర్వహించిన ప్రయోగాలకు ఫలితాలను కూడా అందుకునే వీలుంటుది.
- వర్చువల్ ల్యాబ్స్‌ని వినియోగించుకోవాలనుకునేవారు ముందుగా వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి తమకు కావాల్సిన ల్యాబ్స్‌పై క్లిక్ చేయాలి.
- సిమ్యులేషన్ బేస్డ్ వర్చవల్ ల్యాబ్స్, రిమోట్ ట్రిగ్గర్డ్ వర్చువల్ ల్యాబ్స్ అని రెండు రకాల వర్చువల్ ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయి. రిమోట్ బేస్డ్ వర్చువల్ ల్యాబ్స్‌లో ప్రవేశాలు పరిమితంగా లభిస్తాయి. వీటికోసం ముందుగా సమయాన్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సిమ్యులేషన్ ల్యాబ్స్ మాత్రం రోజంతా అందుబాటులో ఉంటాయి.
వర్చువల్ ల్యాబ్స్‌లో భాగస్వాములైన ఇన్‌స్టిట్యూట్‌లు...
ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ రూర్కీ, ఐఐటీ గువహటి, ఐఐటీ హైదరాబాద్, అమృత విశ్వ విద్యాపీఠం, దయాల్‌బాగ్ యూనివర్సిటీ, ఎన్‌ఐటీ కర్ణాటక, సీవోఈ, పుణె.
వెబ్‌సైట్: https://vlab.co.in
స్వయం:
పదోతరగతి నుంచి పీజీ, ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థుల వరకూ... అందరికీ సబ్జెక్ట్ పరంగా అవసరమైన నైపుణ్యాలు అందించేందుకు రూపొందించిన విధానమే.. స్వయం (స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్). దీన్నొక విధంగా భారత్‌లో మూక్స్ (మ్యాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్)కు విస్తృత రూపంగా చూడొచ్చు. స్వయం నిర్వహణలో యూజీసీ, ఏఐసీటీఈ ప్రమేయం ఉంటుంది. పర్యవేక్షణ, ఫండింగ్‌ను ఎంహెచ్‌ఆర్‌డీ చూస్తుంది. స్వయం అనేది ఒక ఆన్‌లైన్ వెబ్ పోర్టల్. ఈ వెబ్ పోర్టల్ ద్వారా ఆర్ట్స్, సైన్స్, కామర్స్, సోషల్ సైన్స్, పర్‌ఫార్మింగ్ ఆర్ట్స్, హ్యుమానిటీస్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, లా, మెడిసిన్, అగ్రికల్చర్ తదితర అన్ని కోర్సుల విద్యార్థులకు మూక్స్ విధానంలో లెక్చర్స్, ఇంటారాక్టివ్ సెషన్స్ అందుబాటులో ఉంటాయి. సంప్రదాయ గ్రాడ్యుయేట్లకు సైతం సరికొత్త నైపుణ్యాలు, ఉన్నత పరిజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో ఎంహెచ్‌ఆర్‌డీ ఈ పథకాన్ని ప్రారంభించింది.
ఉపయుక్తం..
- స్వయం విధానంలో రెగ్యులర్ విద్యార్థులతోపాటు ఎలాంటి విద్యార్హత లేని వారు సైతం ఓపెన్ స్కూల్లో చేరి విద్యను అభ్యసించొచ్చు.
- పాఠశాల స్థాయిలో 110, సర్టిఫికెట్ లెవల్‌లో 70, డిప్లొమాకు సంబంధించి 38, అండర్ గ్రాడ్యుయేట్‌లకు 965, పోస్ట్ గ్రాడ్యుయేట్‌లకు 358 వీడియోలు అందుబాటులో ఉన్నాయి.
- స్వయం వెబ్‌పోర్టల్ ద్వారా మూక్స్ రూపంలో అందించే కోర్సులన్నీ సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర ప్రముఖ యూనివర్సిటీల ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో రూపొందుతాయి.
- ప్రొఫెసర్లను ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ లేదా సబ్జెక్ట్ మేటర్ ఎక్స్‌పర్ట్‌గా పిలుస్తారు. వీరు తాము అందించనున్న కోర్సు వివరాలను వెబ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.
- ఆమోదంపొందిన తర్వాత ఆన్‌లైన్ లెక్చర్స్ అందించే క్రమంలో లైవ్ ట్యుటోరియల్స్, సదరు కోర్సుకు సంబంధించిన మెటీరియల్‌ను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం, ఈ-టెక్స్ట్‌బుక్స్, ఇల్లస్ట్రేషన్స్ వంటి సౌకర్యాలన్నీ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఇవన్నీ ఉంటేనే ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ లేదా సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌గా పిలిచే ప్రొఫెసర్/లెక్చరర్‌కు అనుమతి లభిస్తుంది.
- స్వయం విధానంలో ఆన్‌లైన్ లెక్చర్స్ విని మూల్యాంకనలోనూ ప్రతిభ చూపిన విద్యార్థులకు.. సదరు కోర్సుకు బోధించిన ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ లేదా సబ్జెక్ట్ మేటర్ ఎక్స్‌పర్ట్ సర్టిఫికెట్ అందిస్తారు.
స్వయంప్రభ :
స్వయం, స్వయం ప్రభ రెండూ వేర్వేరు. స్వయం ఆన్‌లైన్ విధానంలో మూక్ కోర్సులను అందిస్తూ సర్టిఫికెట్లు ఇవ్వడం, క్రెడిట్ ట్రాన్స్‌ఫర్ వంటివి చేస్తుంది. స్వయంప్రభ అనేది ఉచితంగా ఎడ్యుకేషనల్ కంటెంట్‌ను అందించే 32 డీటీహెచ్ ఛానెళ్ల సమూహం. జీశాట్-15 ఉపగ్ర హ అనుసంధానంతో ఈ ఛానెళ్లు 24 గంటలపాటు ప్రసారమవుతాయి. స్వయంప్రభ ద్వారా రోజూ నాలుగు గంటల పాటు నూతన అంశాల (ఎడ్యుకేషనల్ కంటెంట్)ను ప్రసారం చేస్తున్నారు. విద్యార్థులు వీటిని ఏ సమయంలోనైనా వీక్షించేందుకు వీలుగా రోజూ ఐదుసార్లు పునఃప్రసారం చేస్తారు. కరిక్యులం ఆధారిత బోధన అన్ని వయోవర్గాల వారి లెర్నింగ్ అవసరాలను తీర్చే విధంగా స్వయంప్రభ ఛానెళ్ల ప్రసారం సాగుతుంది.
కంటెంట్ ఎవరిస్తారు?
స్వయంప్రభ ప్రసారం చేసే కంటెంట్‌ను దేశంలోని అత్యుత్తమ విద్యాసంస్థలు అందిస్తున్నాయి. కాబట్టి ఔత్సాహికులు నాణ్యమైన కంటెంట్‌ను పొందడంతోపాటు ఉత్తమ నైపుణ్యాలు అలవరచుకోవచ్చు. ఎన్‌పీటీఈఎల్, ఐఐటీలు, యూజీసీ, సీఈసీ, ఇగ్నో, ఎన్‌సీఈఆర్‌టీ, ఎన్‌ఐఓఎస్ ఈ కంటెంట్‌ను అందిస్తున్నాయి.
ఛానెళ్లు అందించే అంశాలు...
ఉన్నత విద్య: పీజీ, యూజీ స్థాయిల్లోని ఆర్ట్స్, సైన్స్, కామర్స్, ఫైన్‌ఆర్ట్స్, సోషల్ సెన్సైస్, హ్యుమానిటీస్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, లా, మెడిసిన్, అగ్రికల్చరల్ విభాగాలకు సంబంధించిన కరిక్యులం ఆధారంగా పాఠ్యాంశాలను ప్రసారం చేస్తారు.
స్కూల్ ఎడ్యుకేషన్ (9-12): టీచర్లకు అవసరమైన శిక్షణతోపాటు అత్యుత్తమ లెర్నింగ్ విధానాలను బోధిస్తారు. వీటిని తెలుసుకోవడం ద్వారా విద్యార్థులు సబ్జెక్టును మరింత లోతుగా అర్థం చేసుకోగలరు. దీంతోపాటు వృత్తి విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమవడంలోనూ ఈ ప్రసారాలు దోహదపడతాయి.
వెబ్‌సైట్: https://swayamprabha.gov.in
ఈ-పీజీ పాఠశాల :
ఎంహెచ్‌ఆర్‌డీ.. నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ కింద ఈ-పీజీ పాఠశాల కార్యక్రమాన్ని చేపట్టింది. ఎంహెచ్‌ఆర్‌డీ ఆధ్వర్యంలో కార్యక్రమ నిర్వహణను యూజీసీ చూస్తోంది. పీజీ స్థాయిలో అత్యుత్తమ నాణ్యత, కరిక్యులం ఆధారిత, ఇంటరాక్టివ్ ఈ-కంటెంట్ అందించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. సోషల్ సెన్సైస్, ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, హ్యుమానిటీస్, మ్యాథమెటిక్స్, నేచురల్ సెన్సైస్, లింగ్విస్టిక్స్ అండ్ లాంగ్వేజెస్ వంటి విభాగాల్లో మొత్తం 77 సబ్జెక్టులకు సంబంధించిన అత్యుత్తమ ఇంటరాక్టివ్ ఈ కంటెంట్‌ను ఈ-పీజీ పాఠశాల ద్వారా అందిస్తున్నారు. దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లోని ప్రొఫెసర్లు, ఇతర ఆర్ అండ్ డీ ఇన్‌స్టిట్యూట్‌ల్లోని అధ్యాపకులు కంటెంట్‌ను అందిస్తుండటం విశేషం.
వెబ్‌సైట్: https://epgp.inflibnet.ac.in
సాక్షాత్ :
విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో మానవ వనరుల మంత్రిత్వ శాఖ సాక్షాత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞాన సంబంధిత కంటెంట్ పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్నా.. చాలామంది వ్యక్తిగతంగా తమకేది అవసరమో తెలుసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. దీన్ని గుర్తించిన ఎంహెచ్‌ఆర్‌డీ సాక్షాత్ కార్యక్రమం కింద కంటెంట్‌ను వ్యవస్థీకృతం చేసి సబ్జెక్టుల వారీగా, విభాగాలు వారీగా అందిస్తోంది. సాక్షత్ పోర్టల్ ద్వారా దేశంలోని ఆయా రంగాల్లోని నిపుణుల అభిప్రాయాలను తెలుసుకోవచ్చు. తద్వారా ఆయా విభాగాలకు సంబంధించిన సందేహాలకు నివృత్తి.. పబ్లిక్ డొమైన్‌లో లభించినట్లవుతుంది. స్పోకెన్ ట్యుటోరియల్, టాక్ టు టీచర్, ఇ-యంత్ర, వర్చువల్ ల్యాబ్స్, ఈ-పీజీ పాఠశాల వంటివి సాక్షాత్‌లో అంతర్భాగం.
వెబ్‌సైట్: https://www.sakshat.ac.in
విద్యామిత్ర :
ఎంహెచ్‌ఆర్‌డీ... నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఇన్‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఎన్‌ఎంఈ-ఐసీటీ) కింద ‘విద్యామిత్ర’ అనే ఆన్‌లైన్ లెర్నింగ్ పోర్టల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో ఆడియో, వీడియో లెర్నింగ్ మెటీరియల్స్, టెక్ట్స్యువల్ మెటీరియల్, మల్టీమీడియాకి సం బంధించిన మెటీరియల్ లభ్యమవుతాయి. విద్యామిత్ర పోర్టల్‌లో ఇన్‌స్టిట్యూట్ , సబ్జెక్టు, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిల వారీగా కంటెంట్‌ను బ్రౌజ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇందులో 44,450 ఇ-టెక్ట్స్; ట్యుటోరియల్/వీడియోలు: 66,174; అండర్ గ్రాడ్యుయేట్ ట్యుటోరియల్స్/వీడియోలు: 46,515; పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్యుటోరియల్స్/వీడియోలు: 20,487; ఇతర ట్యుటోరియల్స్/వీడియోలు: 4,753 ఉన్నాయి.
వెబ్‌సైట్: https://vidyamitra.inflibnet.ac.in
Published date : 30 Aug 2018 05:37PM