Skip to main content

పెట్రోలియం కోర్సు పూర్తి చేస్తే కెరీర్‌ స్కోప్‌.. రూ.5లక్షల ప్రారంభ వేతనంతో ఉద్యోగాలు..

పెట్రోలియం ఇంజనీరింగ్‌ కోర్సులు చేసిన ప్రతిభా వంతులకు దేశవిదేశాల్లో డిమాండ్‌ నెలకొంది.

ముఖ్యంగా ప్రస్తుతం దేశంలో చమురు, సహజవా యు నిక్షేపాల అన్వేషణ విస్తృతంగా కొనసాగుతోంది. దాంతో దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థల్లో అవకాశాలకు కొదవలేదు. ముఖ్యంగా హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌), ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ), ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌(ఓఐఎల్‌), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌), గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్, రిలయన్స్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, అస్సాం పెట్రోలియం లిమిటెడ్‌ తదితర కంపెనీల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు.

వేతనాలు..
చమురు రంగం అభివృద్ధి పథంలోనే ఉంటుంది. కాబట్టి పెట్రోలియం ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన వారికి.. చక్కటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. వీరు ఆకర్షణీయ వేతనాలు సైతం అందుకోవచ్చు. పెట్రోలియం ఇంజనీరింగ్‌ కోర్సు పూర్తికాగానే వార్షిక ప్రారంభ వేతనం రూ.5 లక్షల నుండి రూ.8 లక్షల వరకు దక్కుతోంది. గేట్‌ ర్యాంకు ద్వారా ఓఎన్‌జీసీ లాంటి కంపెనీల్లో అవకాశం అందుకుంటే.. రూ.పది లక్షలకు పైగానే వార్షిక వేతనం అందుతుంది. అనుభవం ఉన్నవారికి గల్ఫ్‌ దేశాలలో భారీ వేతనాలు లభిస్తున్నాయి. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్‌ విభాగాల్లో పని చేసేవారికి వేతనాలతోపాటు ఇతర అలవెన్సులు సైతం ఇస్తున్నారు.

క్యాంపస్‌లోనే ఆఫర్స్‌..
పెట్రోలియం రంగంలో అవకాశాలు ఏటేటా పెరుగుతున్నాయి. ప్రస్తుతం పెట్రోలియం ఇంజనీరింగ్‌ ప్రత్యేక విభాగంగా అభివృద్ధి చెందింది. ఈ కోర్సు పూర్తిచేసినవారుSక్యాంపస్‌లోనే భారీ వేతనాలతో ఉద్యోగాలు పొందుతున్నారు. కాకినాడ, జేఎన్‌టీయూలో 2010లో ఈ విభాగం ప్రారంభించాక.. ఆరు బ్యాచ్‌ల విద్యార్థులు బయటకు వెళ్లారు. అందరూ కెరీర్‌లో బాగా సెటిల్‌ అయ్యారు. ఓఎన్‌జీసీ, రియలన్స్‌ గ్యాస్‌ ఇండస్ట్రీస్‌ దగ్గరలో ఉండటం వల్ల అక్కడి నిపుణులతో మా విద్యార్థులకు లైవ్‌ ప్రాజెక్టుల్లో శిక్షణ ఇస్తున్నాం. పెట్రోలియం కోర్సులు చేసిన వారికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఉంది.
– ప్రొఫెసర్‌ బి.బాలకృష్ణ, జేఎన్‌టీయూ–కే ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపల్‌

ఇంకా చదవండి: part 1: ఈ ఎవర్‌ గ్రీన్‌ కోర్సుపై యువతకు పెరుగుతున్న ఆసక్తి.. వివరాలు తెలుసుకోండిలా..

Published date : 28 Jun 2021 01:52PM

Photo Stories