Skip to main content

బీటెక్ సివిల్ ఇంజనీరింగ్.. కొలువుల పరంగా ఎప్పటికీ వన్నెతగ్గని బ్రాంచ్

సివిల్ ఇంజనీరింగ్ మరో ముఖ్యమైన బ్రాంచ్. మనం చూసే అందమైన రోడ్లు, రహదారులు, వంతెనలు, ఆకర్షణీయమైన భవనాల నిర్మాణం వెనుక సివిల్ ఇంజనీరింగ్ నిపుణుల కృషి ఉంటుంది.
దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ వంతెన నిర్మాణం వరకూ.. మన దేశంలోని అందమైన తాజ్‌మహాల్ నుంచి చార్‌మినార్ దాకా... ఇలా ప్రతీ నిర్మాణం వెనుక సివిల్ ఇంజనీర్ల ప్రతిభ ఉంటుంది. సివిల్ ఇంజనీర్ల కృషి, వారి సృజనాత్మకత వల్లనే మనం సుందరమైన నిర్మాణాలను చూడగలుగుతు న్నాం. అందుకే ఇప్పటికీ వన్నే తగ్గని బ్రాంచ్‌గా నిలుస్తోంది.. సివిల్ ఇంజనీరింగ్. ఈ బ్రాంచ్‌లో చేరిన విద్యార్థులు సృజనాత్మకతతో కూడిన డిజైన్లకు సంబంధించి నైపుణ్యాన్ని సంపాదిస్తే నిర్మాణ రంగంలో అవకాశాలకు ఢోకా ఉండదు.
ముఖ్య విధులు: స్మార్‌‌ట నగరాలు, ప్రాజెక్ట్‌లు, అర్బన్ డెవలప్‌మెంట్, భారీ ప్రాజెక్ట్‌లకు రూపకల్పన చేయడం వంటివి సివిల్ ఇంజనీర్ల ముఖ్య విధులు. నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత సివిల్ ఇంజనీరింగ్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింతగా పెరిగాయి. సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు.. స్టాడ్ ప్రో, జీఐఎస్, ఆటోక్యాడ్ వంటి సాఫ్ట్‌వేర్ కోర్సుల ద్వారా ఉన్నత స్థాయి కొలువులను పొందే అవకాశం ఉంది.

ఉద్యోగావకాశాలు..
సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన అభ్యర్థులకు ముఖ్యంగా మౌలిక వసతులు, నిర్మాణ రంగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నిర్మాణ రంగం నానాటికి విస్తరిస్తూనే ఉంది. ఈ రంగంలో ఉద్యోగాల పరంగా అవకాశాలకు కొదవలేదు. సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన విద్యార్థులకు దేశ విదేశాల్లో మంచి ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లోనే కాకుండా.. వీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోను, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ భర్తీ చేసే అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్ వంటి పోస్టులకు పోటీ పడే అవకాశం ఉంటుంది.
Published date : 22 Oct 2020 06:23PM

Photo Stories