సాఫ్ట్‌వేర్ కొలువులకు డిమాండ్ ఉన్న కోర్సులు..?
Sakshi Education
వేలమంది విద్యార్థులు ఇంజనీరింగ్ పట్టాలతో బయటికి వస్తున్నారు. ప్రతిభ కలిగిన అదృష్టవంతులు కొంతమందికి ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగాలు
లభిస్తున్నాయి. మరికొందరు ఉన్నత విద్య వైపు అడుగులు వేస్తున్నారు. అధిక శాతం మంది ఉద్యోగ వేటలో ఉంటున్నారు. వీరంతా తమ నైపుణ్యాలకు పదునుపెట్టి సాఫ్ట్‌వేర్ కొలువు సొంతం చేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం జాబ్ మార్కెట్‌లో డిమాండింగ్ ఐటీ కోర్సుల గురించి వాకబు చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్, ఐటీతో పాటు ఇతర బ్రాంచ్‌ల విద్యార్థులు సైతం సాఫ్ట్‌వేర్ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఐటీ కోర్సులేమిటి.. వీటితో భవిష్యత్ అవకాశాలు.. ఐటీ రంగంలో ఉద్యోగ సాధన ఎలాగో తెలుసుకుందాం...
చదివిన బ్రాంచ్‌తో సంబంధం లేకుండా.. ఎక్కువమంది విద్యార్థుల దృష్టంతా సాఫ్ట్‌వేర్ కొలువుపైనే ఉంది. మరోవైపు ఐటీ రంగంలో రోజుకో కొత్త టెక్నాలజీ పేరు వినిపిస్తోంది. ఈ కోర్సు నేర్చుకుంటే అవకాశాలుంటాయి.. ఆ కోర్సు నేర్చుకుంటే ఉద్యోగాలొస్తాయి.. అంటూ రకరకాల అభిప్రాయాలు! వాస్తవానికి ప్రస్తుతం ఆయా కోర్సులకు డిమాండ్ ఉన్నా.. విద్యార్థి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి.. ముఖ్యంగా ఫ్రెషర్స్ ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఓపెన్ సోర్స్ టెక్నాలజీ :
ఐటీ రంగంలో కంపెనీలు అనేకం. సంస్థను బట్టి ఉద్యోగుల సంఖ్య పది మంది నుంచి లక్షకు పైగానే ఉంటుంది. సంస్థల అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. ఏ కంపెనీలో ఏయే టెక్నాలజీకి డిమాండ్ ఉందనే విషయాన్ని నిర్ధారించడం అంత సులువేమి కాదు. అయితే కామన్‌గా ఒక విషయాన్ని గుర్తించొచ్చు. అంకుర సంస్థలు మొదలు టాప్ కంపెనీల వరకు.. మార్కెట్‌లో ఉచితంగా లభించే ఓపెన్ సోర్సు టెక్నాలజీలపై ఆసక్తి చూపుతున్నాయి. సంస్థలు తమ వ్యయాలను తగ్గించుకోవడానికి ఉచిత టెక్నాలజీ ప్లాట్‌ఫాంల వైపు మొగ్గుచూపుతాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు కూడా మార్కెట్‌లో లభించే ఓపెన్ సోర్సు టెక్నాలజీల వైపు దృష్టిపెట్టడం మేలు.
పైథాన్ సులువుగా..
జాబ్ మార్కెట్‌లో పైథాన్‌కు డిమాండ్ కనిపిస్తోంది. ఇది నేర్చుకోవడం కూడా సులువనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్లికేషన్ డెవలప్‌మెంట్ సమయం సైతం తక్కువగా ఉంటుందంటున్నారు. పైగా పైథాన్‌లో అందుబాటులో ఉండే లైబ్రరీల కారణంగా కోడ్ పరిమాణం తక్కువగా ఉంటుంది. అన్నింటి కంటే ముఖ్యంగా ఇటీవల కాలంలో బాగా ప్రాధాన్యం సంతరించుకుంటున్న లేటెస్ట్ టెక్నాలజీ మెషీన్ లెర్నింగ్‌కు పైథాన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. అలానే జావాస్క్రిప్ట్, డాట్ నెట్ ఎంవీసీ, జావా వంటి ఓపెన్ సోర్సు టెక్నాలజీల్లో శిక్షణ పొందిన వారికి అవకాశాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
జాబ్ మార్కెట్‌లో పీహెచ్‌పీ :
జాబ్ మార్కెట్‌లో అవకాశాల పరంగా పీహెచ్‌పీ కూడా ముందంజలో ఉంది. వెబ్ బేస్డ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి పీహెచ్‌పీ(హైపర్ టెక్ట్స్ ప్రీ-ప్రాసెసర్) ఉపయోగిస్తారు. డైనమిక్ కంటెంట్ క్రియేట్ చేసి దాన్ని డేటాబేస్‌తో అనుసంధానం చేయడానికి పీహెచ్‌పీని వాడతారు. దీన్ని సర్వర్‌సైడ్ లాంగ్వేజ్‌గా పరిగణిస్తారు. ఉచిత లాంగ్వేజ్ కావడంతో దీనికి వెబ్ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఉంది. ఇది మైఎస్‌క్యూఎల్, ఓరాకిల్, సైబేస్ లాంటి ఆర్‌డీబీఎంఎస్‌లను సపోర్ట్ చేస్తుంది.
జావా స్క్రిప్ట్‌పై పట్టుంటే..
జావా స్క్రిప్ట్... వెబ్‌సైట్‌ను ఆకర్షణీయంగా, రిచ్‌గా రూపొందించి.. యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దేందుకు ఉత్తమ టూల్. జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్‌పై పట్టు సాధిస్తే.. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డెవలమెంట్‌కు ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా డెస్క్‌టాప్, గేమ్ డెవలప్‌మెంట్, మొబైల్ యాప్ డెవలప్‌మెంట్‌లో జావాస్క్రిప్ట్‌ను ఉపయోగిస్తున్నారు. వెబ్ డెవలప్‌మెంట్‌లో ప్రతి టెక్నాలజీలోనూ జావాస్క్రిప్ట్ అవసరం ఉంటుంది.
ఎస్‌క్యూఎల్ :
డేటాబేస్‌కు సంబంధించి ఎస్‌క్యూఎల్(స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్)ను ప్రాథమిక లాంగ్వేజ్‌గా చెప్పవచ్చు. డేటాబేస్‌లో సమాచారాన్ని స్టోర్ చేయడానికి, ఆ డేటాను అవసరాల మేరకు వినియోగించుకోవడానికి క్వెరీ లాంగ్వేజ్ ఉపయోగపడుతుంది. సంస్థల రిలేషనల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టం(డీబీఎంఎస్)ల నుంచి డేటాయాక్సెస్, స్టోరింగ్ కోసం ఎస్‌క్యూఎల్‌ను ఉపయోగిస్తున్నారు. మైఎస్‌క్యూఎల్, ఒరాకిల్, ఇన్ఫోమిక్స్, సైబేస్, ఎంఎస్ యాక్సెస్ వంటి అన్ని ఆర్(రిలేషనల్) డీబీఎంఎస్‌లు ఎస్‌క్యూఎల్‌ను ప్రామాణిక డేటాక్వెరీ లాంగ్వేజ్‌గా ఉపయోగిస్తున్నాయి. ఐటీ రంగంలో ఎన్ని కోర్సులు, టెక్నాలజీలు కొత్తగా ప్రవేశిస్తున్నా.. రిలేషనల్ డీబీఎంఎస్‌కు సంబంధించి ఎస్‌క్యూఎల్‌కు ఉన్న ఫీచర్స్ దృష్ట్యా ఉత్తమ కోర్సుగా నిలుస్తోంది. ఎస్‌క్యూఎల్‌తోపాటు ఇతర డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులకు ఐటీ మార్కెట్‌లో ఎప్పటికీ అవకాశాలు తగ్గవని నిపుణులు చెబుతున్నారు. డేటాబేస్ నిపుణులు.. డెవలప్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో మెరుగైన అవకాశాలు అందుకోవచ్చు. వీరికి వేతనాలు కూడా ఎక్కువే.
మెషిన్ లెర్నింగ్.. ట్రెండింగ్ :
సాంకేతిక విప్లవంలో... కృతిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సరికొత్త ఆవిష్కరణ. ఐటీ రంగంలోనే ఇదో విప్లవాత్మక టెక్నాలజీగా చెప్పొచ్చు. మానవ ప్రమేయం లేకుండా కంప్యూటర్ ప్రోగ్రామ్‌ల ఆధారంగా పనిని చక్కబెట్టే సరికొత్త టెక్నాలజీ కృత్రిమ మేధస్సు. స్థూలంగా చెప్పాలంటే.. ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత కుప్పలుతెప్పలుగా డేటా జనరేట్ అవుతోంది. ఇలా ఉత్పత్తి అవుతున్న డేటాను విశ్లేషించి.. దాని ఆధారంగా కంపెనీలు వ్యాపార నిర్ణయాలు తీసుకుంటున్నాయి. డేటాను విశ్లేషిస్తూ తమ ఉత్పాదకతను,వ్యాపారాన్ని విస్తరించే వ్యూహాలు సిద్ధం చేసుకుంటాయి. డేటా విశ్లేషణను కంప్యూటర్ స్వయంగా చేసేలా ప్రోగ్రామింగ్ చేసే ప్రక్రియనే మెషిన్‌లెర్నింగ్ అంటారు. ఫేస్‌బుక్, అమెజాన్, గూగుల్, యూట్యూబ్, ప్రభుత్వ సంస్థలు, పరిశోధన సంస్థలు.. కృత్రిమ మేధ ఆధారంగా డేటాను విశ్లేషించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధలపై పట్టుంటే భవిష్యత్‌లో మంచి ఉద్యోగవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. ఇప్పటికే మెషిన్ లెర్నింగ్ మానవ వనరుల కొరత ఉందని నిపుణులు చెబుతున్నారు.
డేటాసైన్స్.. సహనం :
కంప్యూటర్/ఐటీ, డొమైన్ నాలెడ్జ్, మ్యాథ్స్, సాటిస్టిక్స్, మెషిన్ లెర్నింగ్ కలయికగా డేటాసైన్స్‌ను చెబుతారు. ఎంతో సహనం, ఓపిక ఉన్న వారు మాత్రమే డేటాసైన్స్ వైపు అడుగులు వేయాలని సూచిస్తున్నారు. నిరంతరం నేర్చుకునేతత్వం, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్‌పై ఆసక్తి ఉన్నవారికి డేటాసైన్స్ సరిపడే కోర్సు. అదేవిధంగా అల్గారిథమ్స్‌పై పట్టు ఉన్నవారికి డేటాసైన్స్ చక్కటి అవకాశం అంటున్నారు. ఐటీ కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా విద్యార్థులను నియమించుకొని వారికి డేటాసైన్స్‌పై శిక్షణ ఇస్తున్నాయి. ఫ్రెషర్స్ డేటాసైన్స్‌పై పట్టు సాధించడం అంత తేలిక కాదనే విషయాన్ని గుర్తించాలని చెబుతున్నారు. వాస్తవానికి ఫ్రెషర్స్ కంపెనీలో నేర్చుకునేది ఎక్కువగా ఉంటుందంటున్నారు.
సీనియర్లకు కోర్సులు..

- పీహెచ్‌పీలో ఉన్న సులువైన ఫంక్షన్స్, మెథడ్స్, సింటాక్స్ వల్ల ఈ లాంగ్వేజ్‌కు మార్కెట్‌లోఎక్కువ ఆదరణ కనిపిస్తుంది.
- ఇతర టెక్నాలజీలు, లాంగ్వేజ్‌లతో పోల్చుకుంటే పీహెచ్‌పీ నేర్చుకోవడం సులువు.
- జాబ్ మార్కెట్‌లో పీహెచ్‌పీ డెవలపర్లకు మంచి అవకాశాలు లభిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

- సీనియర్లకు, ఇప్పటికే డెవలపర్‌గా పనిచేస్తున్నవారికి కూడా మార్కెట్‌లో చాలా టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో బిగ్‌డేటా, ఇన్ఫామెటిక, డెవాప్స్, డేటా సైన్స్ వంటివి ముఖ్యమైనవి.
- ప్రోగ్రామింగ్ పట్ల ఆసక్తి లేనివారు ఆటోమేషన్ టెస్టింగ్‌పై దృష్టిసారించొచ్చు. ఏడబ్ల్యూఎస్, అజుర్,లైనక్స్ టెక్నాలజీలు నేర్చుకోవచ్చు.
- యాంగులర్ జేఎస్, రీయాక్ట్‌జేఎస్, నోడ్‌జేఎస్ టెక్నాలజీలు నేర్చుకోవడం ద్వారా మెరుగైన అవకాశాలు అందుకోవచ్చు.
- బిగ్‌డేటా, హడూప్, స్పార్క్‌తో ఏఐ, స్కేలా, ఆర్ లాంగ్వేజ్ నిపుణులకు కూడా ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇవి సీనియర్లకు ఉపయుక్తమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
- రిపోర్టింగ్ టూల్స్‌లో భాగంగా డేటా స్టూడియో, టాబ్ల్యూ, క్లిక్‌వ్యూ వంటి స్కిల్ ఉన్నవారికి కంపెనీలు ఆఫర్లు ఇచ్చేపరిస్థితి ఉంది.
- కాగ్నో, ఎస్‌క్యూఎల్ సర్వర్ రిపోర్టింగ్ టూల్స్.. ఎస్‌ఎస్‌ఆర్‌ఎస్, ఎస్‌ఎస్‌ఐఎస్ నేర్చుకోవచ్చనేది నిపుణుల మాట. ప్రధానంగా ఓరాకిల్ 18సీ, న్యూరల్ నెట్‌వర్స్, (మెషిన్ లెర్నింగ్ ఫ్రేమ్‌వర్క్), ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్; సైబర్ సెక్యూరిటీ, ఏజైల్ అండ్ స్క్రమ్, డిజిటల్ మార్కెటింగ్‌లో ప్రావీణ్యం ఉన్నవారికి అవకాశాలు పుష్కలమని చెప్పొచ్చు. ఐఫోన్ అప్లికేషన్ డెవలపర్, ఆండ్రాయిడ్ డెవలపర్, ఏడబ్ల్యూస్, సేల్స్‌ఫోర్స్ వంటి క్లౌడ్ టెక్నాలజీలకు డిమాండ్ ఎక్కువగా ఉంది.
రియల్ టైమ్ అనుభవంతోనే.. విద్యార్థులు ఒక విషయాన్ని ఇక్కడ గుర్తించుకోవాలి. కోర్సులో నేర్చుకునే ప్రోగ్రామింగ్‌తోనే ఇండస్ట్రీ స్థాయి కోడింగ్ చేయలేరు. రియల్‌టైం అనుభవంతో కోడింగ్ నైపుణ్యాలు మెరుగవుతాయి. మొదట్లో జీతాల గురించి ఆలోచించకుండా.. పని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఫ్రెషర్ నుంచి ప్రొఫెషనల్‌గా మారుస్తుంది. - దేప నవీన్ రెడ్డి, ఇన్ఫోసిస్ |
డేటా ఇంజనీర్‌గా... గణాంకాలపై పట్టుంటే డేటా ఇంజనీర్‌గా రాణించవచ్చు. స్టాటిస్టిక్స్ ప్రాథమిక అంశాలు, మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్, ఆర్, పైథాన్, ఎస్‌క్యూఎల్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, డేటా విజువలైజేషన్స్ టూల్స్‌పై పట్టు సాధించాలి. డేటా ఇంజనీర్‌గా, డేటా సైంటిస్టుగా రాణించాలనుకునే ఔత్సాహిక అభ్యర్థులు కనీసం ఏడాదిపాటు శ్రమిస్తేగానీ ఈ నైపుణ్యాలపై పట్టు సాధించలేరు. ఇది నిరంతరం అభ్యాస ప్రక్రియ. వీరికి ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తాయి. - వెంకట్, సీనియర్ డేటా సైంటిస్ట్ |
Published date : 12 Jul 2019 12:25PM