నమ్మకమైన కెరీర్‌కు.. మొబైల్ ఆప్స్ డెవలప్‌మెంట్
Sakshi Education
భారత్‌లో మొబైల్ విప్లవం కొనసాగుతోంది. బేసిక్ ఫోన్లు కనుమరుగై స్మార్ట్‌ఫోన్లు వెల్లువెత్తుతున్నాయి. మాటలకే పరిమితం కాకుండా పాటలు వినేందుకు, ఫోటోలు తీసుకునేందుకు, వీడియోలు చూసుకునేందుకు, వీడియో గేమ్స్‌కు, ఈ-మెయిల్స్ పంపుకోవడానికి.. ఇలా ఎన్నో అవసరాలను స్మార్ట్‌ఫోన్లు తీరుస్తున్నాయి. మొబైల్‌లో పనులను నిర్వర్తించాలంటే సంబంధిత అప్లికేషన్లు(ఆప్స్) అందులో ఉండాలి. వీటిని రూపొందించేవారే.. ఆప్స్ డెవలపర్లు. ఈ నేపథ్యంలో ఆప్స్ అభివృద్ధిని కెరీర్‌గా ఎంచుకుంటే మంచి భవిష్యత్తు సొంతమవడం ఖాయం.
నిపుణులకు గిరాకీ
స్మార్ట్‌ఫోన్లలో గేమింగ్, వీడియో కాల్స్, ఈ-మెయిల్స్, మ్యూజిక్ వంటి సేవలు విస్తృతమవుతుండడంతో మొబైల్ ఆప్ డెవలపర్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ప్రపంచంలో అతిపెద్ద మొబైల్ మార్కెట్‌లో భారత్ రెండోస్థానంలో నిలుస్తోంది. మొబైల్ అప్లికేషన్ల రాకతో డెవలపర్లకు, సర్వీస్ ప్రొవైడర్లకు వ్యాపార అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి. నైపుణ్యం కలిగిన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌కు విపరీతమైన గిరాకీ ఉంది. ఆప్ డెవలపర్‌గా కెరీర్ ప్రారంభించాలంటే.. సీ, సీ++, ఆబ్జెక్టివ్ సీ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో పట్టు సాధించా లి. బేసిక్స్ పూర్తిగా నేర్చుకొని మొదట కొన్ని ప్రాజెక్ట్‌ల్లో పనిచేసి అవగాహన పెంచుకోవాలి. స్వయంగా సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లను సృష్టించేందుకు ప్రయత్నిస్తే దీనిపై పరిజ్ఞానం మెరుగుపడుతుంది. తగిన అనుభవం సంపాదించిన తర్వాత సొంతంగా అప్లికేషన్లను రూపొందించొచ్చు.
కావాల్సిన స్కిల్స్
ఆప్ డెవలపర్లకు సృజనాత్మకత తప్పనిసరి. శాస్త్ర, సాంకేతిక రంగాలపై అవగాహన ఉండాలి. సృష్టించిన అప్లికేషన్లను మార్కెట్ చేసుకోవాలంటే వినియోగదారుల అవసరాలను గుర్తించగల నేర్పు అవసరం. అనుకున్న ఆప్‌ను రూపొందించేవరకు పట్టుదలతో పనిచేయగల సామర్థ్యం ఉండాలి. గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. మొబైల్ రంగంలో మార్పులు వేగంగా జరుగుతుంటాయి కాబట్టి ఆ వేగాన్ని అందుకొనే నైపుణ్యం కావాలి.
అర్హతలు: ఇంటర్మీడియెట్ తర్వాత ప్రవేశ పరీక్ష రాసి, కంప్యూటర్ సైన్స్‌లో బీఈ/బీటెక్ పూర్తిచేయొచ్చు. ప్రైవేట్ కంప్యూటర్ శిక్షణా కేంద్రాలు కూడా ఆప్స్ డెవలప్‌మెంట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
వేతనాలు: ఆప్స్ డెవలపర్లకు వారి అర్హతలు, అనుభవం, పనితీరును బట్టి వేతనాలు అందుతాయి. ప్రారంభంలో నెలకు రూ.20 వేల వేతనం లభిస్తుంది. పనితీరును మెరుగుపర్చుకుంటే నెలకు రూ.50 వేలకు పైగానే పొందొచ్చు. నిపుణులకు విదేశాల్లోనూ అవకాశాలు దక్కుతాయి.
కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:

- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐఐఐటీ)
వెబ్‌సైట్స్: www.iiita.ac.in, www.iiitdm.ac.in, www.iiitd.ac.in, www.iiitdmj.ac.in, www.iiitm.ac.in
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - ఢిల్లీ, బాంబే
వెబ్‌సైట్: www.iitd.ac.in, www.iitb.ac.in
- బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్-పిలానీ
వెబ్‌సైట్: www.bitspilani.ac.in
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ) - దుర్గాపూర్
వెబ్‌సైట్: www.nitdgp.ac.in
‘ఆప్’ నిపుణులకు డిమాండ్! ‘‘స్మార్ట్ ఫోన్ల వినియోగం గణనీయంగా వృద్ధి చెందుతోన్న తరుణంలో మొబైల్ అప్లికేషన్స్‌ను రూపొందించే నిపుణులకు సైతం డిమాండ్ పెరుగుతోంది. వివిధ కేటగిరీల్లో ఇప్పటికే వేలాది మొబైల్ అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. మెడికల్ రంగంలోనూ ఆప్స్ అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే బస్సు టికెట్ దగ్గర్నుంచి ఫ్లైట్ టికెట్ వరకు ఆప్స్ సాయంతో బుక్ చేసుకోవచ్చు. ఏ సంస్థకైనా గతంలో వెబ్‌సైట్ ఉంటే సరిపోయేది. కానీ ప్రస్తుతం మొబైల్ వినియోగదారుల సంఖ్య ఎక్కువైన నేపథ్యంలో సంస్థలకు మొబైల్ వెర్షన్‌తో కూడిన ఆప్ తప్పనిసరి అవుతోంది. కాబట్టి ఈ రంగంలో అవకాశాలకు కొదవలేదని చెప్పొచ్చు. సీ, సీ++, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లపై పరిజ్ఞానం ఉన్నవారు ఆండ్రాయిడ్, లేదా ఐఓఎస్ మొబైల్ ఆప్ డెవలపర్‌గా శిక్షణ పొంది ఈ కెరీర్‌ను ఎంచుకోవచ్చు. ప్రభుత్వం కూడా స్టార్టప్స్‌ను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో సొంతంగా మొబైల్ ఆప్స్ రూపొందిస్తూ ఉపాధి పొందొచ్చు’’ సీహెచ్. అరుణ్‌కుమార్, డెరైక్టర్, స్విచ్ సాఫ్ట్ టెక్నాలజీస్ |
Published date : 05 Sep 2014 05:19PM