బ్లాక్‌చైన్ టెక్నాలజీ రంగంలో... 5లక్షల ఉద్యోగాలు
Sakshi Education
టెక్నాలజీ అన్ని రంగాల్లో శరవేగంగా దూసుకుపోతోంది. వేగంగా మారుతున్న టెక్నాలజీ కారణంగా ప్రపంచం మొత్తం డిజిటల్ మయం అవుతోంది. ముఖ్యంగా ఆర్థిక కార్యకలాపాల పారదర్శకతను పెంచేవిధంగా విప్లవాత్మక టెక్నాలజీ తెరపైకి వచ్చింది.అదే..‘బ్లాక్ చైన్ టెక్నాలజీ’.
ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో సమాచార భద్రతకు సైబర్ దాడుల నుంచి ఎదురవుతున్న సవాళ్లు ఎన్నో! ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని పారదర్శకంగా, భద్రంగా నిర్వహించేందుకు ఈ బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతోంది. ఓ అంచనా ప్రకారం- రానున్న మూడేళ్లలో బ్లాక్‌చైన్ టెక్నాలజీ రంగంలో 5లక్షల మంది అవసరం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో... బ్లాక్‌చైన్ టెక్నాలజీ ప్రవేశం.. కెరీర్ అవకాశాలు.. అందుబాటులో ఉన్న కోర్సుల గురించి తెలుసుకుందాం... బ్లాక్‌చైన్ టెక్నాలజీ అంటే..? బ్లాక్‌చైన్ టెక్నాలజీ అనేది ఒక పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ. భద్రపరిచిన సమాచారం ఎంతటి సైబర్ హ్యాకర్లైనా దొంగిలించలేని విధంగా ఉండే కట్టుదిట్టమైన డిస్ట్రిబ్యూటెడ్ నెట్‌వర్క్ ఇది. విలువైన, గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లోని సర్వర్లల్లో నిక్షిప్తం చేసి.. ఇతరులు దొంగిలించకుండా ఒకదానితో మరొకదాన్ని కనెక్ట్ చేసి.. టెక్నాలజీ ఆధారిత భద్రత కల్పించడమే బ్లాక్‌చైన్ టెక్నాలజీ ప్రత్యేకత.
ఎవరి సృష్టి :
బిట్‌కాయిన్ల తయారీలో వినియోగించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమే.. బ్లాక్‌చైన్ టెక్నాలజీ. సటోషీ నకమోటో పేరుతో.. కొందరు అజ్ఞాత టెకీలు దీన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ బ్లాక్‌చైన్ టెక్నాలజీ అన్ని రంగాలకు విస్తరిస్తోంది.
పీర్-టూ-పీర్ :
బ్లాక్‌చైన్ టెక్నాలజీలో సమాచారాన్ని నియంత్రించడానికి సెంట్రలైజ్డ్ అథారిటీ అంటూ ఏమీ ఉండదు. దీనిలో భాగస్వాములైన వారు మాత్రమే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ.. సమాచార మార్పిడి చేసుకుంటారు.
డిస్ట్రిబ్యూటెడ్ :
క్రిప్టాలజీ :
క్రిప్టాలజీ విధానం ద్వారా సమాచారం మొత్తాన్ని కోడ్స్‌లోకి మార్చి భద్రపరుస్తారు. సమాచారాన్ని దొంగిలించాలనుకునే వారు ఏకకాలంలో నోడ్స్ (వివిధ ప్రాంతాల్లో భద్రపరిచిన సమాచారం) అన్నింటిపైనా దాడిచేసి తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేయడం సాధ్యమయ్యే పనికాదు.
బ్లాక్‌చైన్‌తో ఉపయోగాలు..
క్లౌడ్ స్టోరేజ్ అప్లికేషన్స్..
ప్రస్తుతం సర్వర్లన్నింటినీ క్లౌడ్ స్టోరేజ్ అప్లికేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఈ విధానంలో సింగిల్ స్టోరేజ్ ప్రొవైడర్ సమాచారం మొత్తాన్ని నియంత్రిస్తుంది. బ్లాక్‌చైన్ టెక్నాలజీలో సమాచారాన్ని డీ-సెంట్రలైజ్ చేస్తారు.
సమాచారం సురక్షితం :
ప్రతిదీ డిజిటల్‌గా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సమాచార భద్రత అనేది సవాలుగా మారింది. ప్రతి ముగ్గురిలో ఒకరు సైబర్ దాడికి గురవుతున్నారని ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. బ్లాక్‌చైన్ టెక్నాలజీ.. డిజిటల్ ఐడెంటిటీ కల్పించి సమాచారాన్ని సురక్షితంగా ఉండేలా చేస్తుంది. సైబర్ నేరాలను అడ్డుకుంటుంది.
కెరీర్ :
ప్రస్తుతం అన్ని రంగాల్లో డిజిటైలేజేషన్ పెరుగుతోంది. దీంతో పెరిగిన టెక్నాలజీకి అనుగుణంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి చాలా రకాల విధానాలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా పారదర్శకతను పెంచే, సైబర్ భద్రతతో కూడిన వ్యవస్థే బ్లాక్‌చైన్ టెక్నాలజీ. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ఈ విధానం అన్ని రంగాల్లోకి ప్రవేశించింది. మన దేశంలోనూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో బ్లాక్‌చైన్ టెక్నాలజీ విస్తరిస్తోంది. రానున్న ఐదేళ్లలో ప్రపంచ ఐటీ రంగంలో పదిశాతం ఉద్యోగాలు బ్లాక్‌చైన్ టెక్నాలజీలోనే ఉంటాయని అంచనా. ఇదే ఇప్పుడు యువతకు కెరీర్ పరంగా కలిసొచ్చే అంశంగా మారింది.
సీఎస్‌ఈ అనుకూలం..
బ్లాక్‌చైన్ టెక్నాలజీ.. సాఫ్ట్‌వేర్ ఆధారిత సెక్యూరిటీ వ్యవస్థ. దీన్ని రూపొందించడానికి అవసరమైన ప్రోగ్రామింగ్, అల్గారిథమ్స్, డేటాస్ట్రక్చర్, జావా, ఆర్, పైథాన్ వంటి లాంగ్వేజ్‌లు సీఎస్‌ఈ విద్యార్థులు సులభంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సీఎస్‌ఈ అభ్యర్థులు బ్లాక్‌చైన్ రంగంలో రాణించేందుకు వీలుంటుంది.
ఆన్‌లైన్ కోర్సులు..
ఐఐటీ-హైదరాబాద్, టాలెంట్ స్ప్రింట్ సంస్థలు అడ్వాన్స్‌డ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఇన్ బ్లాక్‌చైన్ టెక్నాలజీ కోర్సును ప్రారంభించాయి. అలాగే బ్లాక్‌చైన్‌కు సంబంధించి ఆన్‌లైన్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. బ్లాక్‌చైన్ కౌన్సిల్, గవర్నమెంట్ బ్లాక్‌చైన్ అసోసియేషన్, సెంట్రల్ బ్లాక్‌చైన్ బాడీస్ ఆఫ్ అమెరికా, ఇతర మూక్స్ వంటివి ఆన్‌లైన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అందిస్తున్నాయి.
ఉద్యోగావకాశాలు...
బ్లాక్‌చైన్ టెక్నాలజీ వినియోగంలో అన్నింటికంటే ఫైనాన్షియల్ రంగం ముందు వరుసలో ఉంది. ఎందుకంటే.. వర్చువల్ కరెన్సీ అయిన బిట్‌కాయిన్‌లకు ఆధారం.. బ్లాక్‌చైన్ టెక్నాలజీ. కాబట్టి ఇందులో నిపుణుల అవసరం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, రిటైల్, హెల్త్‌కేర్, టెలికాం సహా వివిధ రంగాల్లో బ్లాక్‌చైన్ టెక్నాలజీ దూసుకువస్తోంది. రానున్న రోజుల్లో బ్లాక్‌చైన్ టెక్నాలజీ మరింతగా విస్తరించే అవకాశం ఉందని అంచనా. దీంతో ఆయా రంగాల్లో బ్లాక్‌చైన్ ఇంజనీర్, డెవలపర్, ప్రాజెక్ట్ మేనేజర్, వెబ్ డిజైనర్లకు డిమాండ్ ఏర్పడనుంది!!
- బ్లాక్‌చైన్ టెక్నాలజీలో.. బ్లాక్ అంటే ఒక భాగం. ప్రతి లావాదేవీ.. అందులో భాగమైన వారందరి వివరాలు ఒక్కో బ్లాక్‌గా ఏర్పడతాయి. ఒకవేళ ఈ బ్లాక్‌లో ఉన్నవారితో ఇంకో లావాదేవీ జరిగితే.. అది గత బ్లాక్‌కు అనుబంధంగా మరో ప్రత్యేకమైన బ్లాక్‌గా ఏర్పడుతుంది. ఇలా బ్లాక్‌లన్నీ వరుసగా ఒక చైన్ మాదిరిగా తయారవుతాయి. మొత్తం చైన్‌లో దేంట్లో ఏ చిన్న మార్పు జరిగినా.. ఆ లావాదేవీ జరిగిన బ్లాక్‌లో నమోదవుతుంది. పది నిమిషాలకు ఒకసారి బ్లాక్‌ల్లోని వివరాలు నెట్‌వర్క్‌లో ఉండే అందరి కంప్యూటర్లలోకి చేరి.. లావాదేవీలన్నీ సక్రమంగా ఉన్నదీ లేనిదీ సరిచూసుకుంటాయి. ఏదైనా తేడా వస్తే.. ఆ విషయం నెట్‌వర్క్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిపోతుంది.
ఎవరి సృష్టి :
బిట్‌కాయిన్ల తయారీలో వినియోగించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమే.. బ్లాక్‌చైన్ టెక్నాలజీ. సటోషీ నకమోటో పేరుతో.. కొందరు అజ్ఞాత టెకీలు దీన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఈ బ్లాక్‌చైన్ టెక్నాలజీ అన్ని రంగాలకు విస్తరిస్తోంది.
పీర్-టూ-పీర్ :
బ్లాక్‌చైన్ టెక్నాలజీలో సమాచారాన్ని నియంత్రించడానికి సెంట్రలైజ్డ్ అథారిటీ అంటూ ఏమీ ఉండదు. దీనిలో భాగస్వాములైన వారు మాత్రమే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ.. సమాచార మార్పిడి చేసుకుంటారు.
డిస్ట్రిబ్యూటెడ్ :
- బ్లాక్‌చైన్ టెక్నాలజీలో.. నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయి.. వివిధ ప్రాంతాల్లోని సర్వర్లలో నిల్వ చేసిన సమాచారాన్ని హ్యాక్ చేయడం దాదాపు అసాధ్యమని చెప్పొచ్చు. ఎందుకంటే.. ఏదైనా మార్చాలంటే.. ఆ సర్వర్ మీద పనిచేసే వారే దాన్ని మార్చే అవకాశం ఉంటుంది. వేరే వాళ్లు ఆ సమాచారాన్ని ఎడిట్ చేయడానికి వీలు ఉండదు.
- ఇందులో సమాచారాన్ని నమోదు చేసే వారికి ఒక సీక్రెట్ పాస్‌వర్డ్ ఇస్తారు. వారు కూడా క్షణాల్లో లాగిన్ అయి..సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. డిస్ట్రిబ్యూటెడ్ నెట్‌వర్క్ పాస్‌వర్డ్ కలిగిన వారే ఇందులో లాగిన్ అవగలరు. ఇతరులు ఎవరైనా లాగిన్ కావాలని ప్రయత్నిస్తే.. క్షణాల్లో మిగతా వారందరికీ తెలియజేసి అప్రమత్తమయ్యే విధంగా బ్లాక్‌చైన్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు.
- బ్లాక్‌చైన్ టెక్నాలజీలో.. వివిధ ప్రాంతాల్లో సమాచారాన్ని భద్రపరిచే వ్యవస్థను నోడ్స్ అని, పాస్‌వర్డ్‌ను హాష్‌కీ అని పిలుస్తారు.
క్రిప్టాలజీ :
క్రిప్టాలజీ విధానం ద్వారా సమాచారం మొత్తాన్ని కోడ్స్‌లోకి మార్చి భద్రపరుస్తారు. సమాచారాన్ని దొంగిలించాలనుకునే వారు ఏకకాలంలో నోడ్స్ (వివిధ ప్రాంతాల్లో భద్రపరిచిన సమాచారం) అన్నింటిపైనా దాడిచేసి తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేయడం సాధ్యమయ్యే పనికాదు.
బ్లాక్‌చైన్‌తో ఉపయోగాలు..
- బ్లాక్‌చైన్ టెక్నాలజీతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రభుత్వంలోని ఏ విభాగంలోనైనా కింది నుంచి పైస్థాయి వరకూ.. జరిపే కార్యకలాపాల్లో ఏ దశలో ఎలాంటి అవకతవకలు, పొరపాట్లు జరిగినా.. సంబంధిత అధికారులందరికీ తెలిసిపోతుంది.
- ప్రభుత్వ పాలనకు సంబంధించి భూ రికార్డులు ట్యాంపరింగ్ జరగకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా భద్రపరచవచ్చు.
- బ్యాంకు లావాదేవీలపై సైబర్ దాడులను పూర్తిగా నిరోధించించేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
- ఓటర్ల జాబితాలను బ్లాక్‌చైన్ టెక్నాలజీతో అనుసంధానించడం వల్ల పౌరులు దేశంలో ఎక్కడి నుంచైనా తమ ఓటు హక్కును వినియోగించుకునే వీలు ఉంటుంది.
- బ్లాక్‌చైన్ టెక్నాలజీతో రిగ్గింగ్‌కు ఆస్కారం లేకుండా ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించవచ్చు.
- బ్యాంకుల్లో సులభంగా రుణాలు తీసుకోవడానికి ఈ టెక్నాలజీ దోహదపడుతుంది. అలాగే ఆసుపత్రుల్లో రోగులకు చేసే వైద్యపరీక్షల వివరాలు బ్లాక్‌చైన్ విధానంలో నమోదు చేస్తే.. మళ్లీ మళ్లీ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా ఏ రంగంలోనైనా పనులు పారదర్శకంగా జరగడానికి.. అనవసర పనిని తగ్గించడానికి బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.
- మొత్తం ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ బ్లాక్‌చైన్ టెక్నాలజీ పరిధిలోకి తెస్తే ..లావాదేవీలకు సంబంధించి ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా.. అన్ని స్థాయిల్లో ఉండే అధికారులకు తెలిసిపోతుంది. ఫలితంగా తప్పిదాలు, అవకతవకలు జరగకుండా వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది.
క్లౌడ్ స్టోరేజ్ అప్లికేషన్స్..
ప్రస్తుతం సర్వర్లన్నింటినీ క్లౌడ్ స్టోరేజ్ అప్లికేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఈ విధానంలో సింగిల్ స్టోరేజ్ ప్రొవైడర్ సమాచారం మొత్తాన్ని నియంత్రిస్తుంది. బ్లాక్‌చైన్ టెక్నాలజీలో సమాచారాన్ని డీ-సెంట్రలైజ్ చేస్తారు.
సమాచారం సురక్షితం :
ప్రతిదీ డిజిటల్‌గా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సమాచార భద్రత అనేది సవాలుగా మారింది. ప్రతి ముగ్గురిలో ఒకరు సైబర్ దాడికి గురవుతున్నారని ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. బ్లాక్‌చైన్ టెక్నాలజీ.. డిజిటల్ ఐడెంటిటీ కల్పించి సమాచారాన్ని సురక్షితంగా ఉండేలా చేస్తుంది. సైబర్ నేరాలను అడ్డుకుంటుంది.
కెరీర్ :
ప్రస్తుతం అన్ని రంగాల్లో డిజిటైలేజేషన్ పెరుగుతోంది. దీంతో పెరిగిన టెక్నాలజీకి అనుగుణంగా ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి చాలా రకాల విధానాలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా పారదర్శకతను పెంచే, సైబర్ భద్రతతో కూడిన వ్యవస్థే బ్లాక్‌చైన్ టెక్నాలజీ. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ఈ విధానం అన్ని రంగాల్లోకి ప్రవేశించింది. మన దేశంలోనూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో బ్లాక్‌చైన్ టెక్నాలజీ విస్తరిస్తోంది. రానున్న ఐదేళ్లలో ప్రపంచ ఐటీ రంగంలో పదిశాతం ఉద్యోగాలు బ్లాక్‌చైన్ టెక్నాలజీలోనే ఉంటాయని అంచనా. ఇదే ఇప్పుడు యువతకు కెరీర్ పరంగా కలిసొచ్చే అంశంగా మారింది.
సీఎస్‌ఈ అనుకూలం..
బ్లాక్‌చైన్ టెక్నాలజీ.. సాఫ్ట్‌వేర్ ఆధారిత సెక్యూరిటీ వ్యవస్థ. దీన్ని రూపొందించడానికి అవసరమైన ప్రోగ్రామింగ్, అల్గారిథమ్స్, డేటాస్ట్రక్చర్, జావా, ఆర్, పైథాన్ వంటి లాంగ్వేజ్‌లు సీఎస్‌ఈ విద్యార్థులు సులభంగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సీఎస్‌ఈ అభ్యర్థులు బ్లాక్‌చైన్ రంగంలో రాణించేందుకు వీలుంటుంది.
ఆన్‌లైన్ కోర్సులు..
ఐఐటీ-హైదరాబాద్, టాలెంట్ స్ప్రింట్ సంస్థలు అడ్వాన్స్‌డ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఇన్ బ్లాక్‌చైన్ టెక్నాలజీ కోర్సును ప్రారంభించాయి. అలాగే బ్లాక్‌చైన్‌కు సంబంధించి ఆన్‌లైన్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. బ్లాక్‌చైన్ కౌన్సిల్, గవర్నమెంట్ బ్లాక్‌చైన్ అసోసియేషన్, సెంట్రల్ బ్లాక్‌చైన్ బాడీస్ ఆఫ్ అమెరికా, ఇతర మూక్స్ వంటివి ఆన్‌లైన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అందిస్తున్నాయి.
ఉద్యోగావకాశాలు...
బ్లాక్‌చైన్ టెక్నాలజీ వినియోగంలో అన్నింటికంటే ఫైనాన్షియల్ రంగం ముందు వరుసలో ఉంది. ఎందుకంటే.. వర్చువల్ కరెన్సీ అయిన బిట్‌కాయిన్‌లకు ఆధారం.. బ్లాక్‌చైన్ టెక్నాలజీ. కాబట్టి ఇందులో నిపుణుల అవసరం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, రిటైల్, హెల్త్‌కేర్, టెలికాం సహా వివిధ రంగాల్లో బ్లాక్‌చైన్ టెక్నాలజీ దూసుకువస్తోంది. రానున్న రోజుల్లో బ్లాక్‌చైన్ టెక్నాలజీ మరింతగా విస్తరించే అవకాశం ఉందని అంచనా. దీంతో ఆయా రంగాల్లో బ్లాక్‌చైన్ ఇంజనీర్, డెవలపర్, ప్రాజెక్ట్ మేనేజర్, వెబ్ డిజైనర్లకు డిమాండ్ ఏర్పడనుంది!!
Published date : 28 Nov 2019 03:32PM