Skip to main content

Chartered Accountancy: ఈ కోర్సు పూర్తి చేసుకుంటే.. కార్పొరేట్‌ కెరీర్‌ సొంతం

సీఏ.. చార్టర్డ్‌ అకౌంటెన్సీ. ఉజ్వల భవితకు మార్గం వేసే.. కామర్స్‌ ప్రొఫెషనల్‌ కోర్సు. ఈ కోర్సు పూర్తి చేసుకుంటే.. ఆకర్షణీయ వేతనాలతో చక్కటి కార్పొరేట్‌ కెరీర్‌ సొంతమవుతుంది. మరోవైపు సీఏ ఉత్తీర్ణత అంత సులువు కాదనే అభిప్రాయం. పరీక్షలు క్లిష్టంగా ఉంటాయనే భావన! దాంతో విద్యార్థులు సీఏ పరీక్షలనగానేæఎంతో ఒత్తిడికి గురవుతుంటారు. వాస్తవానికి కొద్దిపాటి మెళకువలతో సీఏ పరీక్షల్లో విజయం సాధించొచ్చు అంటున్నారు నిపుణులు! ఇటీవల ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ).. డిసెంబర్‌–2021 సెషన్‌కు సంబంధించి పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. సీఏ కోర్సు దశలు, పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌...
Chartered Accountancy
Chartered Accountancy
  • డిసెంబర్‌–2021 సెషన్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల
  • ప్రిపరేషన్‌లో కీలకం మోడల్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లు
  • నిరంతర ప్రాక్టీస్‌తో పరీక్షల్లో ప్రతిభ చూపే అవకాశం



సీఏ.. చార్టర్డ్‌ అకౌంటెన్సీ. ఉజ్వల భవితకు మార్గం వేసే.. కామర్స్‌ ప్రొఫెషనల్‌ కోర్సు. ఈ కోర్సు పూర్తి చేసుకుంటే.. ఆకర్షణీయ వేతనాలతో చక్కటి కార్పొరేట్‌ కెరీర్‌ సొంతమవుతుంది. మరోవైపు సీఏ ఉత్తీర్ణత అంత సులువు కాదనే అభిప్రాయం. పరీక్షలు క్లిష్టంగా ఉంటాయనే భావన! దాంతో విద్యార్థులు సీఏ పరీక్షలనగానేæఎంతో ఒత్తిడికి గురవుతుంటారు. వాస్తవానికి కొద్దిపాటి మెళకువలతో సీఏ పరీక్షల్లో విజయం సాధించొచ్చు అంటున్నారు నిపుణులు! ఇటీవల ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ).. డిసెంబర్‌–2021 సెషన్‌కు సంబంధించి పరీక్షల తేదీలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. సీఏ కోర్సు దశలు, పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌...
 

మొత్తం మూడు దశలు

సీఏ కోర్సులో మూడు దశలు ఉన్నాయి. అవి.. ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్‌. ఈ మూడు దశల పరీక్షలకు డిసెంబర్‌ సెషన్‌ షెడ్యూల్‌ వెలువడింది. దీంతో విద్యార్థులు ఇక పూర్తి స్థాయిలో ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అందుకోసం నిర్దిష్టంగా టైమ్‌ టేబుల్‌ రూపొందించుకొని.. ఏ సమయంలో, ఏ సబ్జెక్ట్‌ చదవాలి అనేదానిపై ముందస్తు కసరత్తు చేయాలి.

కష్టమైన సబ్జెక్ట్‌

ప్రిపరేషన్‌ సమయంలో కష్టం అనుకున్న సబ్జెక్ట్‌ను ఎక్కువ సేపు చదవడం మేలు. అలాకాకుండా సులువైన సబ్జెక్ట్‌ను ఎక్కువగా చదివితే కష్టమైన సబ్జెక్ట్‌ ప్రిపరేషన్‌కు సమయం సరిపోదు. సీఏ పరీక్షల్లో మూడు దశల్లోని ప్రతి పేపర్‌లోనూ తప్పనిసరిగా 40 శాతం మార్కులు సాధించాలి. ప్రతి గ్రూప్‌లో మొత్తంగా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. కాబట్టి విద్యార్థులు ప్రిపరేషన్‌లో అన్ని పేపర్లకు సమప్రాధాన్యం ఇవ్వాలి.

కొత్త పుస్తకాలు వద్దు

ప్రస్తుత సమయంలో స్టడీ మెటీరియల్‌లోని సబ్జెక్ట్‌లనే చదవాలి. కొత్త స్టడీ మెటీరియల్‌ లేదా కొత్త పాఠ్యపుస్తకాలు చదవడం సరికాదు. ఇన్‌స్టిట్యూట్‌ స్టడీ మెటీరియల్‌నే ప్రామాణికంగా తీసుకోవాలి. మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించడానికి కీలకంగా నిలిచే సబ్జెక్ట్‌లపై బాగా పట్టు పెంచుకోవాలి. అందుకోసం ప్రిపరేషన్‌ సమయంలో వీటికి కొంత ఎక్కువ సమయం కేటాయించాలి.

ఒకటికి నాలుగుసార్లు

ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్‌.. ఇలా ఏ దశకు హాజరవుతున్న విద్యార్థులైనా.. ఐసీఏఐ స్టడీ మెటీరియల్‌లో ఉండే అన్ని ప్రశ్నలను ఒకటికి నాలుగుసార్లు చదవాలి. ఈ ఇన్‌స్టిట్యూట్‌ ప్రతి పరీక్షకు విడుదల చేసే మోడల్‌ టెస్ట్‌ పేపర్స్‌(ఎంటీపీఎస్‌), రివిజన్‌ టెస్ట్‌ పేపర్‌(ఆర్‌టీపీఎస్‌)లను పరిశీలించాలి. ఆర్‌టీపీఎస్‌లో ప్రతి చాప్టర్‌ నుంచి ముఖ్యమైన ప్రశ్నలు ఇస్తారు. వాటిని తప్పకుండా సాధన చేయాలి.

ప్రాక్టీస్, ప్రాక్టీస్‌

సీఏ పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం రివిజన్‌ టెస్ట్‌ పేపర్స్‌(ఆర్‌టీపీఎస్‌), మోడల్‌ టెస్ట్‌ పేపర్స్‌(ఎంటీపీఎస్‌)ను తప్పనిసరిగా ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్‌ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాబ్లమ్స్‌ విషయంలో ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి రోజు కనీసం రెండు పేపర్లను రివిజన్‌ చేయాలి. దీంతోపాటు సొంతంగా ఫాస్ట్‌ ట్రాక్‌ నోట్స్‌ రూపొందించుకోవడం మేలు. ఇటీవల కాలంలోని సవరణలను తప్పనిసరిగా చదవాలి. వీలైనంత ఎక్కువ మోడల్‌ టెస్ట్‌లు రాయడం మేలు చేస్తుంది. విద్యార్థులు కాలిక్యులేటర్‌ టైపింగ్‌ ప్రాక్టీస్‌పైనా దృష్టిపెట్టాలి.

ఫౌండేషన్‌ పేపర్లు

సీఏ కోర్సులో తొలి దశ ఫౌండేషన్‌.. నాలుగు పేపర్లలో జరుగుతుంది.

  • పేపర్‌–1: ప్రిన్సిపుల్స్‌ అండ్‌ ప్రాక్టీస్‌ ఆఫ్‌ అకౌంటింగ్‌(వంద మార్కులు): ఇందులో ముఖ్యమైన చాప్టర్స్‌: పార్ట్‌నర్‌షిప్‌ అకౌంట్స్, కంపెనీ అకౌంట్స్, అకౌంటింగ్‌ ఫర్‌ నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్, ఫైనల్‌ అకౌంట్స్,కన్‌సైన్‌మెంట్‌ అకౌంట్స్,బిల్స్‌ ఆఫ్‌ ఎక్సే్ఛంజ్‌. అకౌంట్స్‌లోని ప్రతి అంశాన్ని క్షుణ్నంగా చదవాలి. లెక్కలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి. కాన్సెప్ట్‌ ఆధారిత ప్రాక్టీస్, ప్రిపరేషన్‌ లాభిస్తుంది.
  • పేపర్‌–2: బిజినెస్‌ ‘లా’స్, బిజినెస్‌ కరస్పాండెన్స్‌ అండ్‌ రిపోర్టింగ్‌(వంద మార్కులు): బిజినెస్‌ లాలో ఫ్రీ కన్సంట్, వాయిడ్‌ అగ్రిమెంట్స్, పార్ట్‌నర్‌షిప్‌ యాక్ట్, సేల్స్‌ ఆఫ్‌ గూడ్స్‌ యాక్ట్, కంపెనీస్‌ యాక్ట్, ఆఫర్‌ అండ్‌ యాక్సెప్టెన్స్‌ చాప్టర్లను బాగా చదవాలి. కంపెనీస్‌ యాక్ట్, లిమిటెడ్‌ లయబిలిటి పార్ట్‌నర్‌షిప్‌ చాప్టర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బిజినెస్‌ కరస్పాండెన్స్‌ అండ్‌ రిపోర్టింగ్‌కు సంబంధించి లెటర్‌ రైటింగ్, నోట్‌ మేకింగ్, డ్రాఫ్టింగ్‌ స్కిల్స్, కమ్యూనికేషన్‌ స్కిల్స్, డైరెక్ట్‌–ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్, యాక్టివ్‌–ప్యాసివ్‌ వాయిస్, మెమో రైటింగ్‌కు సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి. మీటింగ్స్‌ అండ్‌ యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్స్,కంప్లయింట్‌ అండ్‌ రిప్లయి టు కంప్లయింట్‌ లెటర్స్‌ను కూడా బాగా ప్రాక్టీస్‌ చేయాలి.
  • పేపర్‌–3: బిజినెస్‌ మ్యాథమెటిక్స్,లాజికల్‌ రీజనింగ్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌(100 మార్కులు): బేసిక్‌ ఫార్ములాలపై పట్టు సాధించాలి. అన్ని ఫార్ములాలను ఒక చోట రాసుకొని.. ప్రతి రోజు కనీసం 15 నిమిషాలు పునశ్చరణ చేయాలి.
  • పేపర్‌–4: బిజినెస్‌ ఎకనామిక్స్‌ అండ్‌ కమర్షియల్‌ నాలెడ్జ్‌(100 మార్కులు): థియరీ ఆఫ్‌ కన్సూమర్‌ బిహేవియర్, కాస్ట్‌ అనాలిసిస్, ప్రొడక్షన్‌ అనాలిసిస్, ప్రైస్‌ అండ్‌ అవుట్‌ పుట్‌ డిటర్మినేషన్, బిజినెస్‌ సైకిల్స్, డిమాండ్‌ ఫోర్‌క్యాస్టింగ్‌లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. బిజినెస్‌ అండ్‌ కమర్షియల్‌ నాలెడ్జ్‌లో.. బిజినెస్‌ టెర్మినాలజీ, టెక్నికల్‌ వర్డ్స్‌పై అవగాహన పెంచుకోవాలి. వ్యాపార రంగంలో తాజా మార్పులను గమనిస్తూ ఉండాలి.

సీఏ ఇంటర్‌.. ఇలా

రెండు గ్రూపులుగా ఎనిమిది సబ్జెక్టుల్లో సీఏ ఇంటర్‌ పరీక్షలు జరుగుతాయి. ప్రతి గ్రూప్‌లో రెండు పేపర్లు చొప్పున మొత్తం నాలుగు పేపర్ల(పేపర్‌–2, పేపర్‌–4, పేపర్‌–6, పేపర్‌–7)లో డిస్క్రిప్టివ్,ఆబ్జెక్టివ్‌ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. 30శాతం మార్కులకు ఎంసీక్యూస్‌కు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో పేపర్‌కు వంద మార్కులు కేటాయిస్తారు. విద్యార్థులు ప్రతి గ్రూప్‌లో ఒక్కో సబ్జెక్ట్‌లో 40శాతం మార్కులు, ఓవరాల్‌గా యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

  • పేపర్‌–1(అకౌంటింగ్‌–100 మార్కులు): అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌పై పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలి. అన్ని చాప్టర్‌లలోనూ ఒక బేసి క్‌ ప్రాబ్లమ్‌ను ఎంచుకొని ప్రాక్టీస్‌ చేయాలి. మిగతా ప్రాబ్లమ్స్‌లో ముఖ్యమైన అంశాలను హైలైట్‌ చేసుకోవాలి. కాన్సెప్ట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇన్వెస్ట్‌మెంట్‌ అకౌంట్స్, అకౌంట్స్‌ ఫ్రమ్‌ ఇన్‌–కంప్లీట్‌ రికార్డ్స్, బ్రాంచ్‌ అకౌంట్స్‌ చాప్టర్లపై ప్రత్యేక దృష్టి సారించాలి.
  • పేపర్‌–2 (కార్పొరేట్‌ ‘లా’స్‌ అండ్‌ అదర్‌ ‘లా’స్‌–100 మార్కులు): 30 శాతం ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు అడిగే ఈపేపర్‌లో కొత్త చాప్టర్లు, కొత్త సవరణలను ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. స్టేట్‌మెంట్‌ ఆధారిత ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. అన్ని చాప్టర్లను విశ్లేషణాత్మక దృక్పథంతో చదవాలి. కంపెనీల చట్టంపై మరింత శ్రద్ధ పెట్టాలి.
  • పేపర్‌–3 (కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌–100 మార్కులు): థియరీ ప్రశ్నలు, ఫార్ములాలపై పట్టు సాధించాలి. మెటీరియల్స్, లేబర్, ఓవర్‌హెడ్స్‌ వంటి ప్రాథమిక చాప్టర్లలో అవగాహన అవసరం. కాస్ట్‌ షీట్, యూనిట్‌ కాస్టింగ్, ఏబీసీ కాస్టింగ్, సర్వీస్‌ కాస్టింగ్‌లపై దృష్టి సారించాలి. ఓవర్‌హెడ్స్, స్టాండర్డ్‌ కాస్టింగ్, మార్జినల్‌ కాస్టింగ్, ప్రాసెస్‌ కాస్టింగ్‌లలో అప్లికేషన్‌ అప్రోచ్‌తో సమస్యల సాధన చేయాలి.
  • పేపర్‌–4 ట్యాక్సేషన్‌(100 మార్కులు): ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అంశాలను నూతన ఫైనాన్స్‌ యాక్ట్‌కు అన్వయించుకొని చదవాలి. ఫైనాన్స్‌ యాక్ట్‌–2021పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. టోటల్‌ ఇన్‌కమ్‌కు సంబంధించిన ప్రాబ్లమ్స్‌ను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌లో పాత, కొత్త సిలబస్‌ ప్రకారం జీఎస్‌టీకి ప్రాధాన్యం ఇవ్వాలి.
  • పేపర్‌–5 (అడ్వాన్స్‌డ్‌ అకౌంటింగ్‌–100 మార్కులు): అకౌంటింగ్‌ స్టాండర్డ్స్‌ను తప్పనిసరిగా చదవాలి. వీలైనంత ఎక్కువగా ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్‌ చేయాలి. అమాల్గమేషన్‌ అండ్‌ ఇంటర్నల్‌ రీ–కన్‌స్ట్రక్షన్, కన్సాలిడేషన్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్, పార్ట్‌నర్‌షిప్‌ అకౌంట్స్‌ చాప్టర్స్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
  • పేపర్‌–6 (ఆడిటింగ్‌ అండ్‌ అష్యూరెన్స్‌–100 మార్కులు): ఆడిటింగ్‌ స్టాండర్డ్‌ పేరు, నెంబర్‌ను బాగా గుర్తు పెట్టుకోవాలి. కంపెనీ ఆడిట్‌ అండ్‌ ఆడిట్‌ రిపోర్ట్‌ చాప్టర్‌లోని ప్రాక్టికల్‌ ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ట్రూ ఆర్‌ ఫాల్స్‌ ప్రశ్నలపై ప్రత్యేక దృష్టి సారించాలి.
  • పేపర్‌–7 (ఎంటర్‌ప్రైజ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌–100 మార్కులు): ఆబ్జెక్టివ్‌ కొశ్చన్స్, డెఫినిషన్స్, వ్యత్యాసాలు, తప్పు ఒప్పు ప్రశ్నలు వంటి వాటిని ప్రత్యేక దృష్టితో చదవాలి. ఫలితంగా అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో ఉండే ఎంటర్‌ప్రైజ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌లో ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌లో ప్రాక్టీస్‌పై ఫోకస్‌ చేయాలి.
  • పేపర్‌–8 (ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఎకనామిక్స్‌ ఫర్‌ ఫైనాన్స్‌–100 మార్కులు): సోర్సెస్‌ ఆఫ్‌ ఫైనాన్స్, స్కోప్‌ అండ్‌ ఆబ్జెక్టివ్‌ ఆఫ్‌ ఎఫ్‌ఎం వంటి చాప్టర్లలో థియరీ ప్రశ్నలు బాగా చదవాలి. ఇన్వెస్ట్‌మెంట్‌ డెసిషన్స్‌ అండ్‌ వర్కింగ్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ చాప్టర్లలో కాన్సెప్ట్స్‌పై స్పష్టత తెచ్చుకోవాలి. రిస్క్‌ అనాలిసిస్, లీజింగ్‌ అండ్‌ డెసిషన్స్‌ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎకనామిక్స్‌ ఫర్‌ ఫైనాన్స్‌లో ఫార్ములా ఆధారిత కొశ్చన్స్‌ను ప్రాక్టీస్‌ చేయాలి. అన్ని చాప్టర్లలోనూ ఇంట్రడక్షన్, డెఫినిషన్స్, ఫ్లోచార్ట్స్, గ్రాఫ్స్, టెక్నికల్‌ టర్మ్స్,అప్రాప్రియేట్‌ అసెంప్షన్స్, ఫార్ములా, ఎగ్జామ్‌పుల్స్, సైడ్‌ హెడింగ్స్‌పై దృష్టి పెట్టాలి.

 

సీఏ ఫైనల్‌ పక్కాగా

సీఏ ఫైనల్‌ పరీక్షలు కూడా రెండు గ్రూప్‌లుగా జరుగుతాయి. ప్రతి గ్రూప్‌లో నాలుగు పేపర్లు చొప్పున.. మొత్తం ఎనిమిది పేపర్లకు పరీక్ష నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు వంద మార్కులు కేటాయిస్తారు. విద్యార్థులు ప్రతి గ్రూప్‌లో ఒక్కో సబ్జెక్ట్‌లో 40 శాతం మార్కులు, ఓవరాల్‌గా యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.

  • పేపర్‌–1 ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌: ఇండియా అకౌంటింగ్‌ స్టాండర్డ్స్, ఇంటిగ్రేటెడ్‌ రిపోర్టింగ్, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ చాప్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి చాప్టర్‌లోనూ ఒక బేసిక్‌ ప్రాబ్లమ్‌ విధానాన్ని తెలుసుకొని.. మిగతా ప్రాబ్లమ్స్‌లోని ముఖ్యాంశాలపై, కాన్సెప్ట్స్‌పై అవగాహన పెంచుకోవాలి.
  • పేపర్‌–2 స్ట్రాటజిక్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌: ఫారెన్‌ ఎక్సే్ఛంజ్‌ ఎక్స్‌పోజర్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్, మెర్జర్స్‌ అండ్‌ అక్విజిషన్స్‌తోపాటు కొత్త చాప్టర్లు.. కార్పొరేట్‌ ఎవాల్యుయేషన్, ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్టార్టప్‌ ఫైనాన్స్‌ చాప్టర్లపైనా దృష్టి పెట్టాలి. పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ను ముందుగా పూర్తి చేసుకోవడం మేలు చేస్తుంది.
  • పేపర్‌–3 అడ్వాన్స్‌డ్‌ ఆడిటింగ్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ ఎథిక్స్‌: ఆడిటింగ్‌ స్టాండర్డ్స్‌కు సంబంధించి ఏదైనా ఒక ప్రామాణిక పుస్తకాన్ని చదవాలి. ప్రాక్టికల్‌ ప్రశ్నలపై దృష్టిపెట్టాలి. కంపెనీ ఆడిట్, ఆడిట్‌ రిపోర్ట్‌లపై అవగాహన అవసరం.
  • పేపర్‌–4 కార్పొరేట్‌ ‘లా’స్‌ అండ్‌ ఎకనామిక్‌ ‘లా’స్‌: అపాయింట్‌మెంట్‌ అండ్‌ క్వాలిఫికేషన్‌ ఆఫ్‌ డైరెక్టర్స్, బోర్డ్‌ మీటింగ్స్‌ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అపాయింట్‌మెంట్‌ అండ్‌ రెమ్యునరేషన్‌ ఆఫ్‌ మేనేజీరియల్‌ పర్సనల్‌పైనా దృష్టిపెట్టాలి.
  • పేపర్‌–5 స్ట్రాటజిక్‌ కాస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఎవాల్యుయేషన్‌: థియరీకి కేస్‌ స్టడీ చాప్టర్లపై దృష్టి పెట్టాలి. మోడ్రన్‌ బిజినెస్‌ ఎన్విరాన్‌మెంట్, డెసిషన్‌ మేకింగ్, ప్రైసింగ్‌ డెసిషన్స్, పెర్‌ఫార్మెన్స్‌ మెజర్‌మెంట్‌ అండ్‌ ఎవాల్యుయేషన్, డివిజినల్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్రైసింగ్‌ అండ్‌ బడ్జెటరీ కంట్రోల్‌ వంటి అంశాలు బాగా చదవాలి.
  • పేపర్‌–6 ఎలక్టివ్‌ పేపర్‌: సీఏ ఫైనల్‌ పరీక్షల్లో ఒక పేపర్‌ను ఎలక్టివ్‌ పేపర్‌గా నిర్ణయించారు. రిస్క్‌ మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్‌ ట్యాక్సేషన్, ఎకనామిక్‌ ‘లా’స్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ క్యాపిటల్‌ మార్కెట్స్, గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌ అండ్‌ స్టాండర్డ్స్, మల్టీ డిసిప్లినరీ కేస్‌ స్టడీ పేపర్‌లలో ఏదో ఒక పేపర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఓపెన్‌ బుక్‌ విధానంలో జరిగే ఈ పేపర్‌లో.. ఎలక్టివ్‌ సబ్జెక్ట్‌లోని అన్ని పాఠ్యాంశాలపై అవగాహన పెంచుకోవాలి.
  • పేపర్‌–7 డైరెక్ట్‌ ట్యాక్స్‌ ‘లా’స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ ట్యాక్సేషన్‌: నిర్దిష్టంగా ఒక స్టడీ మెటీరియల్‌ను ఎంపిక చేసుకోవాలి. రివిజన్‌ సమయంలో సమ్మరీ మాడ్యూల్, స్టడీ మెటీరియల్, ఫైవ్‌ హెడ్స్‌ అంశాలు తప్పనిసరిగా చదవాలి. సవరణలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
  • పేపర్‌–8 ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్స్‌ ‘లా’స్‌: ఈ పేపర్‌లో ఎఫ్‌టీపీ చాప్టర్‌ నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు అడిగే వీలుంది. కాబట్టి ఈ చాప్టర్‌ను నిర్లక్ష్యం చేయొద్దు. థియరీకి,ప్రాబ్లమ్స్‌కు సమ ప్రాధాన్యం ఇస్తూనే.. ప్రాక్టికల్‌ ప్రాబ్లమ్స్‌పై దృష్టిపెట్టాలి.

 

సీఏ.. డిసెంబర్‌ పరీక్ష తేదీలు

ఫౌండేషన్‌ పరీక్ష తేదీలు: డిసెంబర్‌ 13, 15, 17, 19 వరకు

ఇంటర్మీడియెట్‌ పరీక్ష తేదీలు

గ్రూప్‌–1 పేపర్లు: డిసెంబర్‌ 6, 8, 10, 12
గ్రూప్‌–2 పేపర్లు: డిసెంబర్‌ 14, 16, 18, 20

ఫైనల్‌ పరీక్షల తేదీలు

ఫైనల్‌ గ్రూప్‌–1 పేపర్లు: డిసెంబర్‌ 5, 7, 9, 11
ఫైనల్‌ గ్రూప్‌2 పేపర్లు: డిసెంబర్‌ 13,15,17,19
ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: సెప్టెంబర్‌ 16 నుంచి 30 వరకు.

వెబ్‌సైట్‌: https://icaiexam.icai.org

 

Published date : 16 Sep 2021 05:44PM

Photo Stories