యూసీడ్ పరీక్ష విధానం ఇలా..
Sakshi Education
ఇటీవల ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటున్న యూసీడ్ పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియ ఇలా ఉంటుంది.. సమాచారం ఇదిగో..
- ప్రశ్నపత్రం 300 మార్కులకు ఉంటుంది. ఈ పేపర్‌లో పార్ట్ ఏ, పార్ బీ ఉంటాయి. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతుంది.
- పార్ట్ ఎ: 240 మార్కులకు ఆన్‌లైన్ ఆధారితంగా ఉంటుంది. వ్యవధి రెండున్నర గంటలు. ఇందులో మూడు ఉప సెక్షన్లు ఉంటాయి
- సెక్షన్ 1: న్యూమరికల్ ఆన్సర్ టైప్(ఎన్‌ఏటీ) ప్రశ్నలు 18 అడుగుతారు. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. వీటికి అంకెలు సమాధానాలుగా ఉంటాయి. ప్రశ్నకు ఎలాంటి ఛాయిస్‌లు ఉండవు. సమాధానాన్ని వర్చువల్ కీ బోర్డు ద్వారా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
- సెక్షన్ 2: మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నలు(ఎంఎస్‌క్యూ) 18 అడుగుతారు. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి. తప్పు సమాధానానికి 0.19 మార్కు కోత విధిస్తారు.
- సెక్షన్ 3: మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు 32 అడుగుతారు. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు కేటాయిస్తారు. తప్పు సమాధానానికి 0.71 మార్కు కోత విధిస్తారు.
- పార్ట్ బీ : 60 మార్కులకు ఒక ప్రశ్న ఉంటుంది. వ్యవధి 30 నిమిషాలు. ప్రశ్న కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. సమాధానాన్ని ఆన్సర్ బుక్‌లెట్‌లో రాయాల్సి ఉంటుంది. ఇందులో అభ్యర్థి డ్రాయింగ్ స్కిల్స్‌ను పరీక్షిస్తారు.
సిలబస్..
- పార్ట్ ఎలో డిజైన్ ఆప్టిట్యూడ్‌కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. విజువల్, స్పేషియల్ సామర్థ్యం, అబ్జర్వేషన్, డిజైన్ అండ్ సెన్సిటివిటీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ సోషల్ అవేర్‌నెస్, అనలిటికల్ అండ్ లాజికల్ రీజనింగ్, లాంగ్వేజ్ అండ్ క్రియేటివిటీ, డిజైన్ థికింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టాపిక్స్‌ను ప్రిపేరవ్వాల్సి ఉంటుంది.
- పార్ట్ బిలో డ్రాయింగ్ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఇందులో భాగంగా అభ్యర్థులు మంచి క్వాలిటీతో ప్రొడక్ట్స్, వ్యక్తులు, సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ..
- యూసీడ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు భాగస్వామ్య ఇన్‌స్టిట్యూట్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్(బీడీఈఎస్) కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన కామన్ అప్లికేషన్ ఫారం యూసీడ్ అధికారిక వెబ్‌సై ట్‌లో అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులు పర్సనల్ వివరాలు, ఇన్‌స్టి ట్యూట్ ప్రాధాన్యతలను అప్లికేషన్‌లో పేర్కొనాల్సి ఉంటుంది. అనంతరం అప్లికేషన్ కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ ఫీజు రూ.2,000 చెల్లించి దరఖాస్తును అప్‌లోడ్ చేయాలి. యూసీడ్ పరీక్షలో అభ్యర్థులు సాధించిన ర్యాంకు, కేటగిరీ, ప్రాథమ్య ఇన్‌స్టిట్యూట్‌ల ఆధారంగా ప్రవేశాలను ఖరారు చేస్తారు.
ఇంకా చదవండి: part 1: ఐఐటీల్లో చదవాలనుకునే వారికి మరోదారి.. యూసీడ్.. సమాచారం ఇదిగో..
ఇంకా చదవండి: part 3: ఐఐటీల్లోనే పీహెచ్‌డీ సైతం పూర్తి చేయొచ్చు..
ఇంకా చదవండి: part 4: ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి విదేశాల్లో మంచి డిమాండ్
ఇంకా చదవండి: part 5: ఈ కోర్సులు చేసిన వారికి దేశ, విదేశాల్లో ఎన్నో రంగాల్లో ఉద్యోగ అవకాశాలు
Published date : 25 Sep 2020 06:01PM