Skip to main content

యూపీఎస్సీ– సీడీఎస్‌ ఎగ్జామ్ తో ఆర్మీలో ఉద్యోగాలు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)... కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(2)–2020కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇండియన్‌ మిలిటరీ అకాడెమీ (డెహ్రాడూన్‌), ఇండియన్‌ నావెల్‌ అకాడెమీ (ఎజిమళ), ఎయిర్‌ఫోర్స్‌ అకాడెమీ(హైదరాబాద్‌), ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ(చెన్నై)ల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
  • పరీక్ష పేరు: కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ (2)–2020
  • మొత్తం ఖాళీల సంఖ్య: 344
విభాగాల వారీగా ఖాళీలు..
  • ఇండియన్‌ మిలిటరీ అకాడెమీ, డెహ్రాడూన్‌– 100
  • ఇండియన్‌ నావెల్‌ అకాడెమీ, ఎజిమళ–26
  • ఎయిర్‌ఫోర్స్‌ అకాడెమీ, హైదరాబాద్‌–32
  • ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ(పురుషులు), చెన్నై–169
  • ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ(మహిళలు), చెన్నై–17
విద్యార్హతలు..
  • ఇండియన్‌ మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీల్లో ప్రవేశానికి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి.
  • ఇండియన్‌ నావెల్‌ అకాడెమీలో ప్రవేశానికి ఇంజనీరింగ్‌ డిగ్రీ పూర్తి చేయాలి.
  • ఎయిర్‌ఫోర్స్‌ అకాడెమీలో ప్రవేశానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతోపాటు 10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌ చదివి ఉండాలి లేదా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేయాలి.
వయసు..
  • ఇండియన్‌ మిలిటరీ అకాడెమీకి అవివాహిత పురుష అభ్యర్థులు 02.07.1997 నుంచి 01.07.2002 మధ్య జన్మించి ఉండాలి.
  • ఇండియన్‌ నావెల్‌ అకాడెమీకి అవివాహిత పురుష అభ్యర్థులు 02.07.1997 నుంచి 01.07.2002 మధ్య జన్మించి ఉండాలి.
  • ఎయిర్‌ఫోర్స్‌ అకాడెమీకి జులై 01,2021 నాటికి వయసు 20 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
  • ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ(ఎస్‌ఎస్‌సీ కోర్సు పురుషులు) కోసం అవివాహిత పురుష అభ్యర్థులు 02.07.1996 నుంచి 01.07.2002 మధ్య జన్మించి ఉండాలి.
  • ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీ(ఎస్‌ఎస్‌సీ కోర్సు మహిళలు నాన్‌ టెక్నికల్‌) కోసం అవివాహిత మహిళలు 02.07.1996 నుంచి 01.07.2002 మధ్య జన్మించి ఉండాలి.
  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. ఇండియన్‌ మిలిటరీ అకాడెమీ, ఇండియన్‌ నావెల్‌ అకాడెమీ, ఎయిర్‌ఫోర్స్‌ అకాడెమీల్లో ప్రవేశానికి రాత పరీక్ష 300 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో జరుగుతుంది. ఇందులో ఇంగ్లిష్‌కు 100 మార్కులు; జనరల్‌ నాలెడ్జ్‌కు 100 మార్కులు; ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌కు 100 మార్కులు ఉంటాయి. అలాగే ఈ విభాగాలకు సంబంధించి ఇంటర్వ్యూకు 300 మార్కులు కేటాయించారు.
  • ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడెమీలో ప్రవేశం కోసం 200 మార్కులకు రాత పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో ఇంగ్లిష్, జనరల్‌ నాలెడ్జ్‌ ఉంటాయి. దీనికి ఇంటర్వ్యూ 200 మార్కులకు నిర్వహిస్తారు.
ముఖ్య సమాచారం..
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం
  • పరీక్ష ఫీజు: మహిళలు, ఎస్సీ/ఎస్టీలకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.200.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో
  • దరఖాస్తులకు చివరి తేది: 25.08.2020
  • దరఖాస్తుల ఉపసంహరణ: 01.09.2020 నుంచి 07.09.2020 మధ్య దరఖాస్తులను ఉపసంహరించుకోవచ్చు.
  • పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://upsconline.nic.in
Published date : 07 Aug 2020 06:57PM

Photo Stories