విద్యార్థుల్లో సామాజిక దృక్పథం పెరిగేలా ప్రోత్సాహం
Sakshi Education
టెక్నికల్ అభ్యర్థుల్లో సామాజిక దృక్పథం పెరగాలి. ఎందుకంటే.. సాంకేతికత ఆధారంగా సామాజిక అభివృద్ధికి దోహదపడే అంశాలపై పరిశోధనలు, ఆవిష్కరణలు జరగాలి. కేవలం తమ డొమైన్ ఏరియాకే పరిమితమైతే..అది వారి వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే ఉపయోగపడుతుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో స్వీయ అభివృద్ధితోపాటు సామాజిక ప్రగతి కూడా ఎంతో ముఖ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకునే పలు అంశాల్లో ఔట్‌రీచ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ.. విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడే పరిశోధనలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం.
వైవిధ్యం దిశగా ఐఐటీలు..
ఐఐటీలు..ఇంజనీరింగ్ బోధన, పరిశోధనలకే పరిమితం కాకుండా.. వైవిధ్యం దిశగా అడుగులు వేస్తున్నాయి. అందుకే ఐఐటీల్లో మేనేజ్‌మెంట్ కోర్సులను అందించడం మొదలుపెట్టాం. భవిష్యత్తులో లా, ఎంబీబీఎస్ వంటి కోర్సులను కూడా ప్రవేశపెట్టే అవకాశాలపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఐఐటీ ఖరగ్‌పూర్ ఎంబీబీఎస్ కోరు ్సను అందించాలని యోచిస్తున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో ఇతర ఐఐటీలు కూడా ఈ విధానాన్ని అనుసరించే అవకాశముంది.
కొనసాగింపు: ఎర్లీ ఎగ్జిట్ అయిన వారికి బీఎస్సీ డిగ్రీకి అవకాశం?

Published date : 25 Sep 2020 02:46PM