Skip to main content

విదేశాల్లో మెడిసిన్ చేసి స్వదేశంలో ప్రాక్టీస్ చేయాలనుకునే వారికి అవకాశం.. ఎఫ్‌ఎంజీఈనోటిఫికేషన్ విడుదల!

విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించి.. స్వదేశంలో మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించాలనుకుంటున్న భారతీయ/భారత సంతతి విద్యార్థుల కోసం ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్(ఎఫ్‌ఎంజీఈ) నోటిఫికేషన్ విడుదలైంది.
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ) ఏటా రెండుసార్లు(జూన్/ డిసెంబర్‌ల్లో) ఎఫ్‌ఎంజీఈ స్క్రీనింగ్ టెస్ట్‌ను నిర్వహిస్తుంది. ఎఫ్‌ఎంజీఈ-2020 డిసెంబర్ సెషన్‌కు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. దరఖాస్తుకు అర్హతల వివరాలకు ఇలా..

ఎఫ్‌ఎంజీఈ స్క్రీనింగ్ టెస్ట్..
ప్రపంచ వ్యాప్తంగా వైద్య వృత్తికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందుకే మెడికల్ కోర్సుల్లో చేరాలన్నది దేశంలోని లక్షల మంది కల. కాని మెడికల్ కాలేజీల్లో పరిమిత సీట్లు, అపరిమిత పోటీ కారణంగా విదేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ విధంగా విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించిన అభ్యర్థులు స్వదేశంలోనే తమ వృత్తిని కొనసాగించాలని కోరుకుంటారు. ఇలాంటి వారికి నేరుగా భారత్‌లో మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించేందుకు అనుమతి ఉండదు. వీరు ముందుగా భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్(ఎఫ్‌ఎంజీఈ)లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)లో శాశ్వత సభ్యత్వం లభిస్తుంది.

అర్హతలు..
  • ఎఫ్‌ఎంజీఈ స్క్రీనింగ్ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. భారతీయలు లేదా విదేశాల్లో స్థిరపడిన భారత సంతతికి చెందిన వారై ఉండాలి.
  • 30.11.2020నాటికి విదేశాల్లో ఎంబీబీఎస్ లేదా తత్సమాన విద్యలో ఉత్తీర్ణత సాధించిన వారు ఎఫ్‌ఎంజీఈ-2020 డిసెంబర్ స్క్రీనింగ్ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • కెనడా/న్యూజిలాండ్/యూకే/యూఎస్/ఆస్ట్రేలియాల్లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి.. ఆయా దేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ స్క్రీనింగ్ టెస్ట్‌లో అర్హత సాధించాల్సిన అవసరం లేదు. వారు నేరుగా ఎంసీఐ/ఎస్‌ఎంసీలో సభ్యత్వాన్ని నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది.
  • పాకిస్తాన్‌లో మెడిసిన్ పాసైన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది.
ఇంకా తెలుసుకోండి: part 2: విదేశాల్లో మెడిసిన్ చేసి స్వదేశంలో ప్రాక్టీస్ చేయాలనుకునే వారు సాధించాల్సిన ఎఫ్‌ఎంజీఈ పరీక్ష విధానం తెలుసుకోండిలా..!
Published date : 16 Oct 2020 01:08PM

Photo Stories