Skip to main content

త్రివిధ దళాల్లో ఆఫీస‌ర్ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది ఇదే..

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌.. సాయుధ బలగాల్లో కొలువంటే యువతలో ఎనలేని క్రేజ్‌! త్రివిధ దళాల్లో ఉద్యోగం లభిస్తే.. సమాజంలో గౌరవం, ఉన్నతమైన కెరీర్‌ సొంతమవుతుందనే ఆలోచన. ఇలాంటి వారికి చక్కటి మార్గంగా నిలుస్తోంది.. కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(సీడీఎస్‌ఈ)!

 ఈ పరీక్షలో విజయం సాధించి.. తదుపరి దశ ఎంపిక ప్రక్రియలోనూ ప్రతిభ చూపితే.. త్రివిధ దళాల్లో ఆఫీసర్‌ హోదాలో పర్మనెంట్‌ కమిషన్‌తో కెరీర్‌ ప్రారంభించొచ్చు. ఇటీవల సీడీఎస్‌ఈ(2)– 2020కి యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. సీడీఎస్‌ఈ పరీక్ష విధానం.. అర్హతలు.. ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకుందాం.. 

త్రివిధ దళాల్లోని ఆఫీసర్‌ కేడర్‌ ఉద్యోగాల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తుంది. బ్యాచిలర్‌ డిగ్రీ, బీటెక్‌ ఉత్తీర్ణులు అర్హులు. ఏటా రెండుసార్లు సీడీఎస్‌ఈ(1), సీడీఎస్‌ఈ(2) పేరుతో నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది. తాజాగా సీడీఎస్‌ఈ(2)–2020కి నోటిఫికేషన్‌ విడుదలైంది. 

మొత్తం 344 ఖాళీల భర్తీ..

  • సీడీఎస్‌ఈ(2)–2020 ద్వారా త్రివిధ దళాలకు చెందిన మొత్తం అయిదు అకాడమీలలో    ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఆయా అకాడమీలు, ఖాళీల వివరాలు..
  • ఇండియన్‌ మిలటరీ అకాడమీ(డెహ్రాడూన్‌): 100
  • ఇండియన్‌ నేవల్‌ అకాడమీ(ఎజిమలా): 26
  • ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ(హైదరాబాద్‌): 3
  • ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ(చెన్నై)(పురుషులు): 169
  • ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ(చెన్నై)(మహిళలు): 17

శిక్షణ.. ఆ తర్వాత కొలువు

సీడీఎస్‌ఈ పరీక్ష, ఆ తర్వాత నిర్వహించే ఎస్‌ఎస్‌బీ ఇంటర్వూలో విజయం సాధించి.. తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు వారు ఎంపికైన అకాడమీలలో ముందుగా శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ కూడా పూర్తి చేసుకుంటే.. సంబంధిత దళంలో ఆఫీసర్‌ హోదాలో పర్మనెంట్‌ కమిషన్‌ లభిస్తుంది.

అకాడమీలు.. అర్హతల వివరాలు

  •  ఆయా అకాడమీల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించే సీడీఎస్‌ఈకి హాజరు కావడానికి... అకాడమీ ఆధారంగా అర్హత నిబంధనలు పేర్కొన్నారు. 
  • ఐఎంఏ, ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీ
  • అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
  • వయసు: మిలటరీ అకాడమీ: జూలై 2, 1997– జూలై 1, 2002 మధ్య జన్మించిన అవివాహిత పురుష అభ్యర్థులు అర్హులు; ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీ: జూలై 2, 1996– జూలై 1, 2002 మధ్య జన్మించి ఉండాలి.

నేవల్‌ అకాడమీ

  • అర్హత: బీటెక్‌/బీఈ ఉత్తీర్ణులై ఉండాలి.
  • వయసు: జూలై 2, 1997–జూలై 1, 2002 మధ్య జన్మించిన అవివాహిత పురుష అభ్యర్థులు అర్హులు.

ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ

  • అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ చదివుండాలి లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ. 
  • వయసు: జూలై 2, 1997–జూలై 1, 2002 మధ్య జన్మించి ఉండాలి. డీజీసీఏ జారీచేసిన కమర్షియల్‌ పైలట్‌ లైసె¯న్స్ ఉన్నవారికి రెండేళ్ల సడలింపు ఉంటుంది. నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

మహిళలు– ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌

  • మహిళా అభ్యర్థులు ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీకి మాత్రమే అర్హులు.
  • విద్యార్హత చివరి సంవత్సరం విద్యార్థులు కూడా సీడీఎస్‌ఈకి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. ఎలాంటి బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులు ఉండకూడదు. కోర్సు ప్రారంభానికి ముందు ఉత్తీర్ణత పత్రాలు చూపించాల్సి ఉంటుంది. ఆర్మీ/నేవీ/ఎయిర్‌ఫోర్స్‌కు మొదట ప్రాధాన్యమిచ్చేవారు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వూ్య సమయానికి ప్రొవిజినల్‌ సర్టిఫికెట్‌ చూపించాలి. 

రాత పరీక్ష విధానం..

సీడీఎస్‌ఈ రాత పరీక్ష కూడా రెండు విధాలుగా ఉంటుంది. ఇండియ మిలటరీ అకాడమీ(ఐఎంఏ), ఇండియన్‌ నేవల్‌ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ అభ్యర్థులకు 300 మార్కులకు; ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ అభ్యర్థులకు 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఆబ్జెక్టివ్‌ తరహాలో జరిగే రాత పరీక్షలో నెగెటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కులు కోత విధిస్తారు. 


ఐఎంఏ, నేవల్, ఎయిర్‌ఫోర్స్‌ పరీక్ష విధానం

సబ్జెక్ట్‌    వ్యవధి    మార్కులు

ఇంగ్లిష్‌    2 గం.    100

జనరల్‌ నాలెడ్జ్-ఎలిమెంటరీ    2 గం.    100

మ్యాథమెటిక్స్‌    2 గం.    100


ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ పరీక్ష విధానం

సబ్జెక్ట్‌    వ్యవధి    మార్కులు

ఇంగ్లిష్‌    2 గం.    100

జనరల్‌ నాలెడ్జ్‌    2 గం.    100

రాత పరీక్షలో నిర్దేశిత కటాఫ్‌ మార్కులు పొందిన అభ్యర్థులకు సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌(ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో ఇంటెలిజె¯Œన్స్ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌ నిర్వహిస్తారు. అన్ని అకాడమీల అభ్యర్థులకు ఉమ్మడిగా అయిదు రోజులపాటు జరుగుతుంది. ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీకి టెస్టులను 6 రోజులపాటు నిర్వహిస్తారు.


ఇంటర్వూకు 300 మార్కులు..

  • ఇండియన్‌ మిలిటరీ అకాడమీ, నేవల్‌ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్‌లకు సంబంధించి ఇంటర్వూకు 300 మార్కులు, ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ ఇంటర్వూకు 200 మార్కులు కేటాయించారు. 
  • ఎస్‌ఎస్‌బీ టెస్టుల్లో వేర్వేరు పరీక్షలు నిర్వహించి.. ఆఫీసర్‌ ఉద్యోగాలకు సరిపోయే నైపుణ్యాలున్న అభ్యర్థులను గుర్తిస్తారు. ఈ టెస్టులో మొదటి రోజు స్క్రీనింగ్‌ టెస్టు ఉంటుంది. ఇదే స్టేజ్‌–1 టెస్ట్‌. ఈ దశలో అర్హత సాధిస్తే స్టేజ్‌–2కు అనుమతిస్తారు.
  • స్టేజ్‌–1లో ఆఫీసర్‌ ఇంటెలిజె¯Œన్స్ రేటింగ్‌ (ఓఐఆర్‌) టెస్ట్‌లు ఉంటాయి. స్టేజ్‌–2లో సైకాలజీ టెస్ట్‌లు, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్‌ టాస్కులు, ఇంటర్వూలు, కాన్ఫరెన్స్‌లు జరుగుతాయి. వీటిని నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు.
  • ఆ తర్వాత వర్డ్‌ అసోసియేషన్‌ టెస్ట్‌(డబ్ల్యూఏటీ), సిట్యుయేషన్‌ రియాక్షన్‌ టెస్ట్‌ (ఎస్‌ఆర్‌టీ)ల ద్వారా విద్యార్థుల సమయస్ఫూర్తిని పరీక్షిస్తారు. తుదిగా సెల్ఫ్‌ డిస్క్రిప్షన్‌ టెస్ట్‌(ఎస్‌డీ)లో అభ్యర్థి తన కుటుంబం, స్నేహితులు, కాలేజీ, ఉపాధ్యాయుల గురించి రాయాలి. ఈ టెస్టుల తర్వాత రెండు రోజుల పాటు 9 రకాల గ్రూప్‌ టాస్కులు ఉంటాయి.
  • వీటన్నింటి తర్వాత బోర్డ్‌ ప్రెసిడెంట్‌ లేదా సీనియర్‌ సభ్యుడు ఇంటర్వూ్య నిర్వహిస్తారు. తర్వాత చివరగా కాన్ఫరె¯Œన్స్ ఉంటుంది. ప్యానెల్‌ ముందు విద్యార్థులు వేర్వేరుగా హాజరవ్వాలి. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ వారికి పీఏబీటీ జరుగుతుంది. ఎంపిక చేసిన అభ్యర్థులకు శారీరక, వైద్య పరీక్షలు నిర్వహించి.. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్టుల్లో ప్రతిభ ఆధారంగా ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేస్తారు.

సన్నద్ధత ఇలా..

సీడీఎస్‌ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్‌ సాధించేందుకు మొదటి నుంచే సిలబస్‌ అంశాలపై పెట్టి ప్రిపరేషన్‌ సాగించాలి. 

ఇంగ్లిష్‌..

అభ్యర్థుల ఇంగ్లిష్‌ పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన విభాగం ఇది. 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఇంగ్లిష్‌పై అభ్యర్థి అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్‌లో యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్‌ ద ఎర్రర్స్, ఆర్డరింగ్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, సెంటెన్సెస్‌లో పదాల ఆర్డరింగ్, ప్యాసేజ్‌లు, సెంటె¯Œ్స ఇంప్రూవ్‌మెంట్స్, ఇడియమ్స్, ఫ్రేజెసెస్, క్లోజ్‌ టెస్టు, ఫిల్‌అప్స్, అనాలజీస్‌ సెక్షన్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సెంటె¯Œన్స్ ఇంప్రూవ్‌మెంట్, స్పాటింగ్‌ ద ఎర్రర్స్‌ విభాగాల్లో మార్కులు సాధించేందుకు గ్రామర్‌ రూల్స్‌ తెలుసుకోవాలి. అలాగే ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెసెస్‌ కోసం సాధ్యమైనంత ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. 

జనరల్‌ నాలెడ్జ్‌..

ఈ సెక్ష¯Œన్ కు 100 మార్కులు కేటాయించారు. ఇందులో కరెంట్‌ అఫైర్స్, జాగ్రఫీ, హిస్టరీ, ఇండియన్‌ పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తదితర అన్ని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. డిఫె¯Œ్సకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు, ప్రాముఖ్యం ఉన్న అంశాలు, అవార్డులు, జాయింట్‌ మిలిటరీ ఎక్సర్‌సైజెస్‌–అందులో పాల్గొన్న దేశాలు, ఆయా ఉమ్మడి సైనిక విన్యాసాల పేర్లు మొదలైన వాటిని తెలుసుకోవడం మేలు. కరెంట్‌ అఫైర్స్‌ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు.

ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌..

ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీకి మినహా మిగతా పోస్టులకు మ్యాథమెటిక్స్‌ విభాగం ఉంటుంది. ఇది 100 మార్కులకు జరుగుతుంది. పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. టైమ్‌ అండ్‌ డిస్టె¯Œ్స, స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రాబబిలిటీ, వాల్యూమ్‌ అండ్‌ సర్ఫేస్‌ ఏరియా, లీనియర్‌ అండ్‌ క్వాడ్రాటిక్‌ ఈక్వేష¯Œ్స, ట్రిగనామెట్రీ, ఫ్యాక్టరైజేషన్‌ తదితర చాప్టర్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పదో తరగతి స్థాయి పుస్తకాలు ఒకటికి నాలుగుసార్లు చదవడం ద్వారా సన్నద్ధత లభిస్తుంది.

సీడీఎస్‌ఈ(2)–2020 ముఖ్య తేదీలు..

  •     ఆ¯Œన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్ట్‌ 25, 2020
  •     దరఖాస్తుల సవరణ: సెప్టెంబర్‌ 1, నుంచి సెప్టెంబర్‌ 7 వరకు
  •     రాత పరీక్ష తేదీ: నవంబర్‌ 8, 2020.
  •     తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం
  •     పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.upsconline.nic.in, www.upsc.gov.in
Published date : 25 Aug 2020 04:02PM

Photo Stories