తక్కువ సమయంలో రెండు డిగ్రీలు పొందేందుకు ఉపయోగపడే డ్యూయల్ డిగ్రీ.. డబుల్ బెనిఫిట్స్ ఎంటో తెలుసా?
ఐసర్..
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐసర్‌లు).. సైన్స్ విద్య, పరిశోధనల్లో జాతీయ ప్రాధాన్య సంస్థలుగా వెలుగొందుతు న్నాయి. ఇవి అందించే కోర్సులకు క్రేజ్ నెలకొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏడు ఐసర్ క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిలో ఐదేళ్ల బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది.
బీఎస్-ఎంఎస్
ఇంటర్ సైన్స్ ఉత్తీర్ణుల కోసం బీఎస్-ఎంఎస్ కోర్సును ప్రత్యేకంగా రూపొందించారు. కోర్సు వ్యవధి ఐదేళ్లు. ఈ కోర్సు..బేసిక్ సైన్స్, అభ్యర్థి ఎంచుకున్న స్పెషలైజేషన్, ఎంఎస్ రీసెర్చ్ ప్రాజెక్టుల సమాహారంగా సాగుతుంది. బీఎస్-ఎంఎస్ ఉత్తీ ర్ణులకు బోధన, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, పరిశ్రమ విభాగాల్లో కొలువులకు అవసరమైన నైపుణ్యాలను లభిస్తాయి. సైన్స్ విభాగంలో ఇంటర్ లేదా తత్సమాన ఉత్తీర్ణులు ఈ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
- స్పెషలైజేషన్స్: బయోలాజికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, డేటాసైన్స్, ఎర్త్ అండ్ క్లైమేట్ సెన్సైస్ /ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సెన్సైస్, జియో లాజికల్ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్.
- మొత్తం సీట్ల సంఖ్య: 1662
- క్యాంపస్‌ల వారీగా సీట్ల వివరాలు: ఐసర్ భోపాల్ 252, బెర్హంపూర్ 185, కోల్‌కత 233, మొహాలీ 239, పుణె 240, తిరువనంతపురం 280, తిరుపతి 193.