టీసీఎస్ కొత్తగా నియామకాలు @ విద్యార్థుల ప్రతిభ కు గుర్తింపు
Sakshi Education
స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారా? మీ కాలేజీలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు టాప్ కంపెనీలు రావట్లేదని బాధపడుతున్నారా? మీ ప్రతిభను నిరూపించుకునే దారులు కనిపించట్లేదని నిరాశగా ఉందా?! అయితే, ఇకపై అలాంటి ఆందోళన అవసరంలేదని టెక్ దిగ్గజం టీసీఎస్ స్పష్టం చేస్తోంది. ఇప్పటివరకూ కేవలం 370 ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహించి నియామకాలు జరుపుతూ వస్తున్న టీసీఎస్... ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న మారుమూల ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులకు కూడా అవకాశం కల్పించనుంది. అందుకోసం ‘నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్’ పేరుతో దేశవ్యాప్తంగా ఉమ్మడి అర్హత పరీక్ష నిర్వహించి ప్రతిభావంతులను గుర్తించే ప్రక్రియకు ఇప్పటికే శ్రీకారం చుట్టింది. ఏటా వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు జాబ్ ఆఫర్స్ ఇచ్చే టీసీఎస్ కొత్త నియామక ప్రక్రియ వివరాలు...
కొత్త ఒరవడి :
నెలలోపే పూర్తి..
టీసీఎస్ గతేడాది వరకు ఎంపిక చేసిన 370 క్యాంపస్‌ల్లో వేర్వేరుగా ప్లేస్‌మెంట్ డ్రైవ్స్ నిర్వహించేవి. సంస్థ సాంకేతిక ప్రతినిధులు, మానవ వనరుల విభాగ సిబ్బంది, రిక్రూట్‌మెంట్ టీం సంప్రదాయ పద్ధతిలో ఆయా కాలేజీల్లో ప్లేస్‌మెంట్స్ డ్రైవ్స్ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేసేవారు. ఈ ప్రక్రియ అంతా పూర్తవ్వడానికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతూ ఉండేది. తాజాగా టీసీఎస్ తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహణ ద్వారా నియామక ప్రక్రియ మొత్తం మూడు నుంచి నాలుగు వారాల్లోనే పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
వీడియో ఇంటర్వ్యూలు..
ఆన్‌లైన్ టెస్ట్‌లో ప్రతిభ చూపి తదుపరి దశకు ఎంపికైన విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వీడియో ఇంటర్వ్యూ నిర్వహించనుంది. అభ్యర్థి నివాస ప్రాంతాన్ని బట్టి వారికి అందుబాటులో ఉన్న టీసీఎస్ గుర్తించిన విద్యాసంస్థలో వీడియో ఇంటర్వ్యూ లేదా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు జరపనున్నారు.
ఆప్టిట్యూడ్‌కు పరీక్ష!
ఇటీవల టీసీఎస్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆన్‌లైన్ టెస్టు ద్వారా జావా, సీ, సీ ++ వంటి ప్రాథమిక సబ్జెక్టుల్లో విద్యార్థుల విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించింది. నేషనల్ క్వాలి ఫైయర్ టెస్టును 90 నిమిషాల కాలపరిమితిలో నిర్వహించారు. ఇందులో ప్రధానంగా విద్యార్థుల ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగారు. వీటితో పాటు కోడింగ్ పరిజ్ఞానం, బేసిక్ సబ్జెక్టులైన సీ, సీ++ల్లో ప్రోగ్రామింగ్ లాజిక్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉన్నాయి. మొత్తం టెస్టులో సగం మార్కులు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సెక్షన్ (20 ప్రశ్నలు) నుంచే వచ్చాయి. ఇందులోనూ స్టాండర్డ్, అడ్వాన్స్‌డ్ మోడల్స్‌లో ప్రశ్నలు వచ్చాయి. కొన్ని ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటే, మరికొన్ని ఫిల్ ఇన్‌ది బ్లాంక్స్ విధానంలో ఎదురయ్యాయి. ఆబ్జెక్టివ్ విధానంలోని ప్రశ్నలకు రుణాత్మక మార్కులు ఉంటాయి. ఇక ప్రోగ్రామింగ్ లాజిక్ సెక్షన్‌లో బేసిక్ ప్రోగ్రామింగ్ కాన్సెప్టుల నుంచి ప్రశ్నలు వచ్చాయి. అలానే ఇంగ్లిష్ విభాగంలో వెర్బల్ సెక్షన్ నుంచి సుమారు 10 ప్రశ్నల వరకు అడిగారు.
- వాస్తవానికి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అంటే పేరున్న కాలేజీలకే పరిమితం. స్థానిక, మారుమూల కాలేజీల్లో చదివే విద్యార్థులు టీసీఎస్ వంటి ప్రముఖ సంస్థల నియామక ప్రక్రియలో పాల్గొనే అవకాశం దాదాపు కల్లే! తాజాగా టెక్ దిగ్గజం టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. మారుమూల ఇంజనీరింగ్ కాలేజీలో చదివే విద్యార్థులకు సైతం ఆన్‌లైన్ టెస్టు ద్వారా తమ ప్రతిభను చాటుకునే అవకాశం కల్పించింది.
- టీసీఎస్ ‘నేషనల్ క్వాలిఫైర్ టెస్ట్’ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులందరికి అవకాశం లభించినట్లైంది. సుమారు రెండు వేల ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులు ఈ పరీక్షకు నమోదు చేసుకున్నారు. దేశం నలుమూలల నుంచి 24 రాష్ట్రాల్లోని 100 నగరాల నుంచి దాదాపు 2 లక్షల 80 వేల మంది విద్యార్థులు.. టీసీఎస్ డిజిటల్ ప్లాట్‌ఫాం ఐయాన్ (iON) ద్వారా రిజిస్టర్ చేసుకున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
- పెద్దసంఖ్యలో ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహిస్తున్న ఐయాన్.. బ్యాంకింగ్ పరీక్షలు, క్యాట్, గేట్, క్లాట్ వంటి పోటీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు సుపరిచితమే. సంప్రదాయ పద్ధతిలో రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్‌లో లక్ష మంది పాల్గొంటే.. ఈ ఏడాది 175 శాతం పెరుగుదలతో 2.80 లక్షల మంది టీసీఎస్ ఎంపిక ప్రక్రియకు నమోదు చేసుకున్నారు.
- ఐఐటీ, ఎన్‌ఐటీలు, ఐఐఎంల్లో మాత్రం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ యథావిధిగా నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
నెలలోపే పూర్తి..
టీసీఎస్ గతేడాది వరకు ఎంపిక చేసిన 370 క్యాంపస్‌ల్లో వేర్వేరుగా ప్లేస్‌మెంట్ డ్రైవ్స్ నిర్వహించేవి. సంస్థ సాంకేతిక ప్రతినిధులు, మానవ వనరుల విభాగ సిబ్బంది, రిక్రూట్‌మెంట్ టీం సంప్రదాయ పద్ధతిలో ఆయా కాలేజీల్లో ప్లేస్‌మెంట్స్ డ్రైవ్స్ నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేసేవారు. ఈ ప్రక్రియ అంతా పూర్తవ్వడానికి మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతూ ఉండేది. తాజాగా టీసీఎస్ తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహణ ద్వారా నియామక ప్రక్రియ మొత్తం మూడు నుంచి నాలుగు వారాల్లోనే పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.
వీడియో ఇంటర్వ్యూలు..
ఆన్‌లైన్ టెస్ట్‌లో ప్రతిభ చూపి తదుపరి దశకు ఎంపికైన విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వీడియో ఇంటర్వ్యూ నిర్వహించనుంది. అభ్యర్థి నివాస ప్రాంతాన్ని బట్టి వారికి అందుబాటులో ఉన్న టీసీఎస్ గుర్తించిన విద్యాసంస్థలో వీడియో ఇంటర్వ్యూ లేదా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు జరపనున్నారు.
ఆప్టిట్యూడ్‌కు పరీక్ష!
ఇటీవల టీసీఎస్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆన్‌లైన్ టెస్టు ద్వారా జావా, సీ, సీ ++ వంటి ప్రాథమిక సబ్జెక్టుల్లో విద్యార్థుల విషయ పరిజ్ఞానాన్ని పరీక్షించింది. నేషనల్ క్వాలి ఫైయర్ టెస్టును 90 నిమిషాల కాలపరిమితిలో నిర్వహించారు. ఇందులో ప్రధానంగా విద్యార్థుల ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగారు. వీటితో పాటు కోడింగ్ పరిజ్ఞానం, బేసిక్ సబ్జెక్టులైన సీ, సీ++ల్లో ప్రోగ్రామింగ్ లాజిక్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉన్నాయి. మొత్తం టెస్టులో సగం మార్కులు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సెక్షన్ (20 ప్రశ్నలు) నుంచే వచ్చాయి. ఇందులోనూ స్టాండర్డ్, అడ్వాన్స్‌డ్ మోడల్స్‌లో ప్రశ్నలు వచ్చాయి. కొన్ని ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటే, మరికొన్ని ఫిల్ ఇన్‌ది బ్లాంక్స్ విధానంలో ఎదురయ్యాయి. ఆబ్జెక్టివ్ విధానంలోని ప్రశ్నలకు రుణాత్మక మార్కులు ఉంటాయి. ఇక ప్రోగ్రామింగ్ లాజిక్ సెక్షన్‌లో బేసిక్ ప్రోగ్రామింగ్ కాన్సెప్టుల నుంచి ప్రశ్నలు వచ్చాయి. అలానే ఇంగ్లిష్ విభాగంలో వెర్బల్ సెక్షన్ నుంచి సుమారు 10 ప్రశ్నల వరకు అడిగారు.
Published date : 27 Sep 2018 04:13PM