సీఏ/సీఎంఏ...ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి
Sakshi Education
సీఏ/సీఎంఏ తదితర కోర్సుల్లో భాగంగా ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి అయింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయా రంగాల్లో ఆధునిక ధోరణులపై విద్యార్థులకు అవగాహన కల్పించడం దీని లక్ష్యం.
తరగతిగదిలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అన్వయించేందుకు ప్రాక్టికల్ శిక్షణ వీలుకల్పిస్తుంది. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన వారికి జాబ్ మార్కెట్లో అపార అవకాశాలు అందుబాటులో ఉంటాయి.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి..
సీఏ ఇంటర్ దశలోని రెండు గ్రూపులు పూర్తిచేసిన వారు లేదా ఏదైనా ఒక గ్రూపు పూర్తిచేసినవారు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ద్వారా పేరు నమోదు చేయించుకోవాలి. ప్రాక్టికల్ శిక్షణ ఎక్కడ తీసుకుంటారు? శిక్షణ ప్రారంభ సమయం తదితర వివరాలను ముందే ఐసీఐఏకు తెలియజేయాలి.
ప్రాక్టికల్ శిక్షణ ప్రయోజనాలు..
అసెస్‌మెంట్ టెస్ట్‌లు :
సీఏ కోర్సు కొత్త విధానం ప్రకారం ప్రాక్టికల్ శిక్షణలో ఉన్న విద్యార్థులు సీఏ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే అసెస్‌మెంట్ టెస్టులు రాయాల్సి ఉంటుంది. అప్పటి వరకు ప్రాక్టికల్ శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలను పరీక్షించడం ఈ అసెస్‌మెంట్ టెస్టుల ఉద్దేశం. ప్రాక్టికల్ శిక్షణలో మొదటి ఏడాది పూర్తయ్యాక తొలిసారి, రెండో ఏడాది పూర్తయ్యాక రెండోసారి అసెస్‌మెంట్ టెస్ట్ రాయాలి.
మొదటి సంవత్సరం: అకౌంటింగ్, ఆడిటింగ్ (కార్పొరేట్ లాస్ కలిపి)కు 50 మార్కులు ఉంటాయి. 25 మార్కులకు డెరైక్ట్ ట్యాక్స్, ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్, ఇంటర్నల్ ఆడిట్ నుంచి ఏదో ఒక మాడ్యూల్‌ను ఎంపిక చేసుకోవాలి (ప్రాక్టికల్ శిక్షణ స్పెషలైజేషన్‌బట్టి).
సమయం: రెండు గంటలు.
రెండోసంవత్సరం: అకౌంటింగ్, ఆడిటింగ్ (కార్పొరేట్ లాస్‌తో కలిపి)కు 50 మార్కులుంటాయి. డెరైక్ట్ ట్యాక్స్ (ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్‌తో కలిపి), ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్, ఇంటర్నల్ ఆడిట్ నుంచి ఏవైనా రెండు మాడ్యూళ్లను ఎంపిక చేసుకోవాలి (ప్రాక్టికల్ శిక్షణ స్పెషలైజేషన్ బట్టి). ఒక్కో మాడ్యూల్‌కు 25 మార్కులు ఉంటాయి.
సమయం: 3 గంటలు, మార్కులు 100.
సంస్థ ఎంపిక ఇలా..
గమనించాల్సిన అంశాలు..
సంస్థల్లో ఆడిట్ చేసే సమయంలో గుర్తించాల్సిన అంశాలు
ఉదా: అకౌంటింగ్, ఆడిటింగ్ ప్రమాణాలతో పాటు పన్ను సవరణలపైనా అవగాహన పెంపొందించుకోవచ్చు.
ఇంటర్వ్యూలో విజయానికి..
కొన్ని పెద్ద ఆడిట్ సంస్థలు తమవద్ద ప్రాక్టికల్ శిక్షణ తీసుకోవాలనుకునే విద్యార్థులకు మౌఖిక పరీక్ష నిర్వహిస్తున్నాయి. ఈ పరీక్ష విజయానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి..
- ఎం.ఎస్.ఎస్.ప్రకాశ్, డెరైక్టర్, మాస్టర్‌మైండ్స్
- ప్రాక్టికల్ శిక్షణ ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో చేయబోయే ప్రాక్టీస్/ఉద్యోగానికి సంబంధించి విషయ పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యాలు, ఆచరణాత్మకత, వ్యక్తీకరణ తదితర అంశాలపై ముందుగానే అవగాహన పెంపొందించుకోవచ్చు.
- చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) కోర్సులోని రెండోదశ సీఏ-ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు లేదా ఇంటర్‌లోని ఏదో ఒక గ్రూప్ పూర్తిచేసిన వారు ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ వద్ద లేదంటే ఆడిట్ సంస్థలో ప్రాక్టికల్ శిక్షణ తీసుకోవాలి.
- తొలుత సీఏ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే నాలుగు వారాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్‌స్కిల్స్ (ఐసీఐటీఎస్‌ఎస్) కోర్సు పూర్తిచేయాలి. తర్వాత మూడేళ్ల ప్రాక్టికల్ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.
- రెండున్నరేళ్ల ప్రాక్టికల్ శిక్షణ పూర్తిచేశాక సీఏ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే నాలుగు వారాల అడ్వాన్స్‌డ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్‌స్కిల్స్ (ఐసీఐటీఎస్‌ఎస్) కోర్సును పూర్తిచేయాలి. తర్వాత సీఏ ఫైనల్ పరీక్ష రాయొచ్చు.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి..
సీఏ ఇంటర్ దశలోని రెండు గ్రూపులు పూర్తిచేసిన వారు లేదా ఏదైనా ఒక గ్రూపు పూర్తిచేసినవారు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ద్వారా పేరు నమోదు చేయించుకోవాలి. ప్రాక్టికల్ శిక్షణ ఎక్కడ తీసుకుంటారు? శిక్షణ ప్రారంభ సమయం తదితర వివరాలను ముందే ఐసీఐఏకు తెలియజేయాలి.
ప్రాక్టికల్ శిక్షణ ప్రయోజనాలు..
- ఎంతో ముందుచూపుతో ఐసీఏఐ.. కోర్సును ప్రారంభించినప్పటి నుంచే ప్రాక్టికల్ శిక్షణను అమలు చేస్తోంది. విదార్థులు తరగతిగదిలో నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణాత్మకంగా ఎలా అమలు చేయాలో దీనిద్వారా తెలుసుకుంటారు.
- ప్రాక్టికల్ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్‌పై స్పష్టత వస్తుంది.
- సీఏ కోర్సు పూర్తిచేసిన వారు ఉద్యోగంలో చేరొచ్చు. లేదా సొంతంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వీటిలో రాణించేందుకు ప్రాక్టికల్ శిక్షణ ఉపయోగపడుతుంది. కెరీర్‌లో విజయవంతంగా ప్రయాణించేందుకు ప్రాక్టికల్ నైపుణ్యాలు దోహదం చేస్తాయి.
- సీఏ ఫైనల్‌లో కొన్ని ప్రశ్నలు ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ఉంటాయి. అందువల్ల ప్రాక్టికల్ శిక్షణ సమయంలో ఏ విషయాన్నీ వదలకుండా పూర్తిస్థాయి అవగాహన ఏర్పరచుకోవాలి.
- ప్రాక్టికల్స్ సమయంలో విద్యార్థులు.. ఆయా సంస్థల్లోని అధికారులు, సీనియర్లు తదితరులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఈ రకమైన వాతావరణం కమ్యూనికేషన్ స్కిల్స్, బృంద స్ఫూర్తిని పెంపొందించుకునేందుకు ఉపయోగపడుతుంది.
అసెస్‌మెంట్ టెస్ట్‌లు :
సీఏ కోర్సు కొత్త విధానం ప్రకారం ప్రాక్టికల్ శిక్షణలో ఉన్న విద్యార్థులు సీఏ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే అసెస్‌మెంట్ టెస్టులు రాయాల్సి ఉంటుంది. అప్పటి వరకు ప్రాక్టికల్ శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలను పరీక్షించడం ఈ అసెస్‌మెంట్ టెస్టుల ఉద్దేశం. ప్రాక్టికల్ శిక్షణలో మొదటి ఏడాది పూర్తయ్యాక తొలిసారి, రెండో ఏడాది పూర్తయ్యాక రెండోసారి అసెస్‌మెంట్ టెస్ట్ రాయాలి.
మొదటి సంవత్సరం: అకౌంటింగ్, ఆడిటింగ్ (కార్పొరేట్ లాస్ కలిపి)కు 50 మార్కులు ఉంటాయి. 25 మార్కులకు డెరైక్ట్ ట్యాక్స్, ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్, ఇంటర్నల్ ఆడిట్ నుంచి ఏదో ఒక మాడ్యూల్‌ను ఎంపిక చేసుకోవాలి (ప్రాక్టికల్ శిక్షణ స్పెషలైజేషన్‌బట్టి).
సమయం: రెండు గంటలు.
రెండోసంవత్సరం: అకౌంటింగ్, ఆడిటింగ్ (కార్పొరేట్ లాస్‌తో కలిపి)కు 50 మార్కులుంటాయి. డెరైక్ట్ ట్యాక్స్ (ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్‌తో కలిపి), ఇన్‌డెరైక్ట్ ట్యాక్స్, ఇంటర్నల్ ఆడిట్ నుంచి ఏవైనా రెండు మాడ్యూళ్లను ఎంపిక చేసుకోవాలి (ప్రాక్టికల్ శిక్షణ స్పెషలైజేషన్ బట్టి). ఒక్కో మాడ్యూల్‌కు 25 మార్కులు ఉంటాయి.
సమయం: 3 గంటలు, మార్కులు 100.
- pttest.icai.org, ICAI క్లౌడ్ క్యాంపస్ ద్వారా ఈ టెస్టులకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
సంస్థ ఎంపిక ఇలా..
- నైపుణ్యాలు, ప్రతిభను మెరుగుపరచుకునేందుకు ఎక్కువ అవకాశం కల్పించే ఆడిట్ సంస్థను శిక్షణ కోసం ఎంపిక చేసుకోవాలి.
- ఎంపిక చేసుకునే ఆడిట్ సంస్థ చిన్నదైనా, పెద్దదైనా మనం నేర్చుకునే నైపుణ్యంపై ఆధారపడి ఉంటుందని గుర్తించాలి.
- ఏ ఆడిట్ సంస్థలో చేరాలనుకుంటున్నారో అందులో ప్రాక్టికల్ శిక్షణ పూర్తిచేసిన సీనియర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి.
- ఆడిట్ సంస్థల బదిలీ ప్రక్రియను సీఏ ఇన్‌స్టిట్యూట్ కఠినం చేసింది. అందువల్ల ఒక ఆడిట్ సంస్థ నుంచి వేరే దానికి మారడం అంత తేలిక కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని, అన్ని కోణాల్లో ఆలోచించి తుది నిర్ణయం తీసుకోవాలి.
గమనించాల్సిన అంశాలు..
సంస్థల్లో ఆడిట్ చేసే సమయంలో గుర్తించాల్సిన అంశాలు
- సంస్థకు సంబంధించి పుస్తకాలు ఎలా రూపొందిస్తారు?
- సంస్థ వ్యాపార లావాదేవీలను ఎలా జరుపుతోంది?
- వ్యాపార సంస్థకు సంబంధించిన మంచి, చెడులు, వ్యాపార సూత్రాలు.
- వ్యాపార పద్ధతులు.
- తయారీ సంస్థలైతే వస్తు తయారీలోని వివిధ దశల గురించి తెలుసుకోవడం మంచిది.
- ఓ సీఏ ఏ పనైతే చేస్తాడో అదే పనిని ప్రాక్టికల్ శిక్షణ ద్వారా నేర్చుకునేందుకు అవకాశముంటుంది.
ఉదా: అకౌంటింగ్, ఆడిటింగ్ ప్రమాణాలతో పాటు పన్ను సవరణలపైనా అవగాహన పెంపొందించుకోవచ్చు.
ఇంటర్వ్యూలో విజయానికి..
కొన్ని పెద్ద ఆడిట్ సంస్థలు తమవద్ద ప్రాక్టికల్ శిక్షణ తీసుకోవాలనుకునే విద్యార్థులకు మౌఖిక పరీక్ష నిర్వహిస్తున్నాయి. ఈ పరీక్ష విజయానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి..
- ఏ ఆడిట్ సంస్థ ఇంటర్వ్యూకు వెళ్తున్నారో ఆ సంస్థ ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకోవాలి. సంస్థ నిబంధనల మేరకు ప్రాక్టికల్స్ చేస్తామనే భరోసా ఇంటర్వ్యూ చేసేవారిలో కల్పించడం ముఖ్యం.
- ఇంటర్‌లోని అన్ని సబ్జెక్టులను ఒకసారి రివైజ్ చేసుకొని, ఇంటర్వ్యూకు వెళ్లాలి.
- ప్రాక్టికల్ సమయంలో విద్యార్థికి సంపాదన కూడా ఉంటుంది. ఆడిట్ సంస్థ.. ఐసీఏఐ నిబంధనల ప్రకారం విద్యార్థులకు స్టైపెండ్ ఇస్తుంది. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులపై ఆధారపడకుండా చదువుకునేందుకు అవకాశముంటుంది.
- ఎం.ఎస్.ఎస్.ప్రకాశ్, డెరైక్టర్, మాస్టర్‌మైండ్స్
Published date : 26 Feb 2019 05:43PM