Skip to main content

రోబోల రాజ్యంలోనూ..బోలెడన్ని ఉద్యోగవ కాశాలు

ఏ పత్రికలో చూసినా... ఏ సదస్సులో విన్నా... ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)... మెషిన్ లెర్నింగ్ వంటి పదాలే!! భవిష్యత్తుపై ఒకటే మాట... రాబోయే కాలమంతా రోబోలదేనని... మనుషులకు ఉద్యోగాలుండవని!!. నిజమే...
మనుషులకన్నా వేగంగా, తెలివిగా పనిచేసే యంత్రాలు చవగ్గా కూడా దొరికాయనుకోండి!! పెపైచ్చు వాటికి సెలవులు అక్కర్లేదు. ఆలస్యంగా రావటం, ఐపీఎల్ గురించి మాట్లాడటం వంటివి చెయ్యవు కూడా. కాబట్టి కంపెనీలు వాటిపై ఆధారపడటం సహజం. మరి అప్పుడేంటి పరిస్థితి? అలాంటి భయాలేవీ వద్దంటున్నారు టెక్నాలజీ నిపుణులు. చేసే పని మారుతుంది తప్ప పని లేకుండా పోయే అవకాశమే లేదంటున్నారు. పాత రకం ఉద్యోగాలు పోతాయని, కొత్తవి పుట్టుకొస్తాయని... కాకపోతే అవి కొన్ని సూత్రాలకు లోబడి ఉంటాయని టెక్నాలజీ దిగ్గజం ‘కాగ్నిజెంట్’ అభిప్రాయపడింది. నిజమే! పని ఎప్పుడూ మారుతూనే ఉంది. గతంలో లక్షల మంది చేసిన టైపిస్టు, టెలిగ్రాఫిస్టు, స్విచ్‌బోర్డు ఆపరేటర్, లిఫ్ట్ ఆపరేటర్, సెక్రటరీ వంటి ఉద్యోగాలు ఇపుడు చాలా కొద్దిమందే చేస్తున్నారు. మున్ముందు మరోరకం మార్పులొస్తా. అంతే!!.

యంత్రాలకు మనుషులు కావాలి. అవి ఎంత పనిచేసినా... వాటితో మరింత పని చేంచగలిగేది మనిషే. వాటిని సృష్టించేది, విక్రంచేది, డెలివరీ చేసేది, ఆఖరికి శుభ్రం చేయగలిగేది కూడా మనిషే. ‘‘ఇంకా ఏం చేయొచ్చు?’’ అంటూ మనిషిలోని శోధించే తత్వమే దేనికైనా పునాది. యంత్రాలు చాలా సమస్యల్ని పరిష్కరిస్తా. కానీ ఆ క్రమంలో పుట్టుకొచ్చే కొత్త సమస్యల్ని పరిష్కరించగలిగేది మనిషే. ‘‘అందుకే... భవిష్యత్తులో కూడా ఉద్యోగాలు భేషుగ్గా ఉంటా. కానీ వాటి తీరు మారుతుంది’’ అంటూ మరో పదేళ్ల తరవాత బాగా పాపులర్ అయ్యే 21 ఉద్యోగాలను కాగ్నిజెంట్ సంస్థ లిస్ట్ చేసింది. ఆ ఫ్యూచర్ జాబ్స్ వివరాలు..

1. డేటా డిటెక్టివ్
‘సృజనాత్మకత కలిగిన డేటాసైంటిస్టులు కావాలి. మా బిగ్‌డేటాలో నిగూఢంగా దాగున్న రహస్యాలు కనిపెట్టగలిగే వారికి ఆకర్షణీయ వేతనం లభిస్తుంది. డేటా చెప్పే రహస్యాలు అర్థం చేసుకునే వారికి ఇదే ఆహ్వానం’-కంపెనీలు 2028లో తమ ఉద్యోగ నియామకాల సందర్భంగా ఇలాంటి ప్రకటనలిస్తా.
పని తీరు..
డేటా డిటెక్టివ్ కంపెనీకి సంబంధించిన డేటా డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్‌లోని ఇతర డేటా నిపుణులతో కలసి పనిచేయాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎండ్ పాంట్స్, సదరు యంత్ర పరికరాలు; బయోమెట్రిక్ మానిటర్స్, సెన్సర్లు, సంప్రదాయ కంప్యూటర్లు, ఇతర అన్ని రకాల ఆధునిక మార్గాల ద్వారా వచ్చిన డేటాను డేటా డిటెక్టివ్ బృందం కేంద్ర కార్యాలయంలో కూర్చొని విశ్లేషిస్తుంది. సదరు విశ్లేషణ ద్వారా కంపెనీ ఎలాంటి భవిష్యత్ మార్కెటింగ్ వ్యూహాలు రూపొందించాలి... ఎలాంటి వ్యాపార నిర్ణయాలు తీసుకోవాలో చెబుతుంది.
అవసరమైన నైపుణ్యాలు..
డేటా విశ్లేషణకు అవసరమైన అత్యాధునిక టూల్స్ ఉపయోగించే సామర్థ్యం. డేటా ఏం చెబుతోందో అర్థం చేసుకునే మనసు, మేధస్సు చాలా అవసరం.
అర్హతలు:
  • మ్యాథ్స్/ఫిజిక్స్/ఎకనామిక్స్/లా/అకౌంటెన్సీ/ఫైనాన్స్/మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీలో బ్యాచిలర్ డిగ్రీ.
  • డేటా సైన్స్ టెక్నాలజీల్లో శిక్షణ పొందడం అవసరం.
  • లా నేపథ్యం, లా ఎన్‌ఫోర్‌్నమెంట్‌లో పనిచేసిన అనుభవం ఉంటే మేలు.

2. ఐటీ ఫెసిలిటేటర్
"మా కంపెనీ డిజిటల్ వర్క్‌ప్లేస్ స్ట్రాటజీకి అనుగుణంగా ఐటీ కార్యకలాపాల నిర్వహణకు అనుభవం కలిగిన బిజినెస్-ఐటీ నిపుణులు కావాలి. తాజా డిజిటల్ ట్రెండ్స్ అందిపుచ్చుకుంటూ.. ఐటీ ఇన్నోవేషన్స్ ఉపయోగించుకునే పని వాతావరణాన్ని సృష్టించగలగాలి. అంతేకాకుండా వినియోగదారులు తమకు అవసరమైన అప్లికేషన్స్ను స్వయంగా వాడుకునేలా సెల్ఫ్‌సర్వీస్ ప్లాట్‌ఫార్మ్స్‌ను రూపొందించగలగడం, వర్చువల్ అసిస్టెంట్స్ ద్వారా ఉద్యోగి పనితీరు మెరుగుపడేలా చూస్తూ.. డేటాసెక్యూరిటీ, నియంత్రణపై దృష్టిసారించే వారికి ప్రాధాన్యం ఉంటుంది"- ఐటీ ఫెసిలిటేటర్ జాబ్ రిక్రూట్‌మెంట్ కోసం భవిష్యత్‌లో కంపెనీలు ఇచ్చే ప్రకటన ఇది.
విధులు-బాధ్యతలు:
  • కంపెనీలో ఆటోమేటెడ్ సెల్ఫ్‌సర్వీస్, కొలాబరేషన్, నాలెడ్జ్‌ షేరింగ్ వ్యవస్థలను రూపొందించాల్సి ఉంటుంది. ఒకవైపు ఐటీ కేంద్రీకృత నియంత్రణ వ్యవస్థను నిర్వహిస్తూనే.. మరోవైపు వినియోగదారులు తమంతట తాము తమకు అనుకూలమైన ఐటీ ఎన్విరాన్‌మెంట్‌ను తయారుచేసుకునేలా ప్లాట్‌ఫార్మ్స్ రూపొందించాలి. అందుకోసం ఐటీ ఫెసిలిటేటర్ నిరంతరం ప్రస్తుత బిజినెస్, ఐటీ వ్యవస్థలో మెరుగుదల కోసం కృషిచేయాలి.
  • షాడో ఐటీ అసెస్‌మెంట్ నిర్వహించాలి. తద్వారా అవకాశాలు, సమస్యలపై అవగాహన వస్తుంది.
  • రిస్క్ మేనేజ్‌మెంట్, గవర్నెస్ కాంప్లియన్స్ స్ట్రాటజీని రూపొందించాలి.
  • పాస్ (ప్రీ అప్రూవ్‌‌డ లోకోడ్ ప్లాట్‌ఫ్మార్స్ యాజ్ ఏ సర్వీస్)ను బిజినెస్ యూజర్ల కోసం అమలు చేయగలగాలి.
అర్హతలు:
  • ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ డిగ్రీ.
  • బిజినెస్ మేనేజ్‌మెంట్, మౌలిక వసతులు, నెట్‌వర్క్ సర్వీసెస్ కంపెనీల్లో ఐటీ టీమ్‌ల్లో పనిచేసిన అనుభవం ఉంటే మంచిది.

3. ఎథికల్ సోర్సింగ్ ఆఫీసర్
  • మా కంపెనీలో ఎథికల్ సోర్సింగ్ కార్యకలాపాల నిర్వహణకు సమర్థుడైన అభ్యర్థి కోసం చూస్తున్నాం. సరైన అభ్యర్థి ఎథికల్ సోర్సింగ్ టీంకు నేతృత్వం వహించాల్సి ఉంటుంది. ఈ ఎథికల్ సోర్సింగ్ ఆఫీసర్.. మా స్టేక్ హోల్డర్స్ ప్రయోజనాలు కాపాడేందుకు వీలుగా ఆటోమేటెడ్ విధానంలో వస్తువులు,సేవల సరఫరా, నిర్వహణ జరిగేలా ఒప్పందాలు చేసుకోవడంలో సమర్థత చూపాల్సి ఉంటుంది
  • భవిష్యత్‌లో ఎథికల్ సోర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగానికి సంబంధిత కంపెనీలు ఇచ్చే రిక్రూట్‌మెంట్ ప్రకటన ఇది.
విధులు- బాధ్యతలు :
  • ఎథికల్ సోర్సింగ్ ఆఫీసర్.. ఎథిక్స్ బోర్డ్ నిర్దేశించిన ప్రమాణాల మేరకు.. కార్యకలాపాలు నడిచేలా చూడాలి. సదరు ఎథికల్ ఆఫీసర్ తన డిజిటల్ ప్రోక్యూర్‌మెంట్, అడిట్, ఇన్నోవేషన్ నైపుణ్యాల ద్వారా కంపెనీ నిర్ణయాలు అమలయ్యేలా చూస్తారు.
  • కాంట్రాక్ట్‌కు సంబంధించిన క్రిప్టో రిజిస్టర్స్ నిర్వహణ, ఎథిక్స్ బోర్డ్ ఆలోచనలకు తగ్గట్టు కేటగిరీ అల్గారిథమ్స్‌లో సర్దుబాట్లు చేయాలి.
అర్హతలు: బిజినెస్/లా/ఫిలాసఫీలో గ్రాడ్యుయేషన్. మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ కలిగి ఉండాలి.

4. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ డవలప్‌మెంట్ మేనేజర్
"మాది ఏఐ కంప్యూటర్ సేవల కంపెనీ. కంప్యూటింగ్ ఇన్‌ప్రాస్ట్రక్చర్ నుంచి ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ వరకూ... మేం అనేక వస్తువులు, సేవలు అందిస్తున్నాం. మీరు ఈ మధ్య కాలంలో ఏదైనా కంప్యూటర్‌ను వాడినా, లేదా ఆన్‌లైన్లో ఏదైనా కొన్నా... బహుశా మీరు మా సేవలు పొందే ఉంటారు. మా సేవలన్నీ ఏఐ ఆధారితం. అన్నింటికీ ఏఐని వినియోగిస్తున్నా... ఏఐ తనను తాను అమ్ముకోలేదు. ఏఐని అమ్మాలంటే.. మనుషులు కావాలి. అందుకే మేం ఏఐ బిజినెస్ డవలప్‌మెంట్ నిపుణుల కోసం ఎదురుచూస్తున్నాం"- 2028లో ఓ ఏఐ కంపెనీ ఉద్యోగ ప్రకటన ఇలా ఉండొచ్చు.

విధులు- బాధ్యతలు :
  • ఏఐ బీడీఎంలు ఏఐ సేల్స్ వ్యూహాన్ని రూపొందించి సమర్థంగా అమలు చేయాల్సి ఉంటుంది. వినియోగదారుడు కేంద్రంగా అమ్మకాలు జరిపేలా స్ట్రాటజీ సిద్ధం చేయాలి. కస్టమర్ల అవసరాలు తెలియజేసేందుకు ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, డవలప్‌మెంట్ టీమ్స్‌తో నిరంతరం సంప్రదిస్తుండాలి.
  • కంపెనీ ఏఐ సేవలు, ప్లాట్‌ఫామ్స్, ఫ్రేమ్ వర్క్స్.. వినియోగదారులు, భాగస్వాములకు అర్థమయ్యేలా చెప్పేందుకు వీలుగా సేల్స్, మార్కెటింగ్, భాగస్వామ్య బృందాలతో పనిచేయాల్సి ఉంటుంది.
అర్హతలు:
  • ఎంబీఏ చదివుండాలి. ఏఐ/మెషీన్ లెర్నింగ్ సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫార్మ్‌లో అనుభవం గడించాలి.
  • క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధిత విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉంటే మంచిది.

5. మాస్టర్ ఆఫ్ ఎడ్జ్‌ కంప్యూటింగ్

మాస్టర్ ఆఫ్ ఎడ్జ్‌ కంప్యూటింగ్ నిపుణుడు.. టెక్నాలజిస్టు. ఇతను ఎడ్జ్‌ కంప్యూటింగ్ కోసం సమగ్ర టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేస్తాడు. అంతేకాకుండా ఏ డేటాను స్టోర్ చేయాలి.. ఎక్కడ స్టోర్ చేయాలి.. ఎలాంటి డేటాను తొలగించవచ్చో తెలిపేలా క్లౌడ్ ఎడ్జ్‌ అనుసంధానాన్ని ఏర్పాటు చేస్తాడు. దీని అమల్లో ఎదురయ్యే సవాళ్లను సైతం మాస్టర్ ఆఫ్ ఎడ్జ్‌ కంప్యూటింగ్ నిపుణుడు పరిష్కరించాల్సి ఉంటుంది.
అర్హతలు..
  • కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ చేసుండాలి.
  • ఐవోటీ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ విభాగాల్లో అనుభవం తప్పనిసరి.
  • ఎంబెడెడ్ సిస్టమ్స్ డవలప్‌మెంట్, ఐవోటీ సెక్యూరిటీ ప్రోటోకాల్స్, రియల్‌టైమ్ సాఫ్ట్‌వేర్ డవలప్‌మెంట్, డీప్ లెర్నింగ్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్‌లో అనుభవం ఉండాలి.

6. వాకర్/టాకర్

"సాటి మనుషులతో మాట్లాడటం మీకు ఇష్టమా... ముఖ్యంగా తోటి వాళ్లు మాట్లాడేది వినడంపై అమితమైన ఆసక్తి ఉందా... అతే ఈ ఉద్యోగం మీ కోసమే! మా కనెక్ట్ ప్లాట్‌ఫామ్ ద్వారా మీకు వీలున్న సమయంలో ఈ ఉద్యోగం చేయొచ్చు"- వాకర్/టాకర్ జాబ్ కోసం ఓ కంపెనీ 2028లో విడుదల చేసే ప్రకటన.
విధులు-బాధ్యతలు..
  • వినియోగదారులతో మాట్లాడం.
  • వినియోగదారులు చెప్పేది సహానుభూతితో వినడం.
  • కస్టమర్స్‌తో కలిసి నడవటం వంటివి.
అర్హతలు-నైపుణ్యాలు..
  • ఏదైనా విద్యా నేపథ్యం, ఎలాంటి ఉద్యోగ అనుభవం ఉన్నా ఫర్వాలేదు.-ఫోన్ ఆధారిత యాప్స్, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ తదితర పరికరాలు ఉపయోగించడం రావాలి.
  • కస్టమర్స్ ఇళ్లకు వెళ్లగలగడం.. టైమ్ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు ఉంటే మేలు.

7. ఫిట్‌నెస్ కమిట్‌మెంట్ కౌన్సెలర్

ఫిట్‌నెస్ కమిట్‌మెంట్ కౌన్సెలర్లు.. ఎక్కడో సుదూరంలో ఉండి.. రోగులకు అవసరమైన వ్యాయామం, న్యూట్రిషన్, ఆరోగ్యకర జీవన విధానం గురించి నిరంతరం కౌన్సెలింగ్ ఇస్తుంటారు.
విధులు-బాధ్యతలు
  • టెక్నాలజీ పరికరాల ద్వారా రోగి ఆరోగ్యం మెరుగయ్యేలా సహాయం అందించడం.
  • ఫిట్‌నెస్ బ్యాండ్ ప్లాట్‌ఫార్మ్స్ పూర్తిగా అవగాహన చేసుకోవడం ముఖ్యంగా కేలరీలు, డైట్ వంటివి.
  • కస్టమర్స్ యాక్టివిటీ ట్రాకర్స్ ఉపయోగించేలా ప్రోత్సహించాలి.
  • రోగుల యాక్టివేషన్ రేట్స్‌ను లెక్కించడం వంటివి చేయాల్సి ఉంటుంది.
అర్హతలు-నైపుణ్యాలు..
నర్సింగ్/న్యూట్రిషన్/సైకాలజీ చదివి ఉండాలి. ఫిట్‌నెస్ విభాగంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉంటే మంచిది. ఫిట్‌నెస్ ట్రాకర్స్, వియరబుల్స్, స్మార్ట్ ఫిట్‌నెస్ గార్మెంట్స్ వినియోగం వచ్చి ఉండటం తప్పనిసరి.

8. ఏఐ అసిస్టెడ్ హెల్త్‌కేర్ టెక్నీషియన్
డిజిటల్ డయాగ్నసిస్ టూల్స్ వినియోగంతోపాటు.. రోగులతో సత్సంబంధాలు నెరపడంలో నైపుణ్యం కలిగి ఉండాలి. జనరల్ పేషెంట్స్‌కు ఇన్‌సర్జరీ సేవలతోపాటు మారుమూలన ఉన్న రోగులకు సైతం ఏఐ ఆధారిత సేవలు అందించాల్సి ఉంటుంది. ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలు అందించడంలో ఏఐ అసిస్టెడ్ హెల్త్ టెక్నీషియన్స్ పాత్ర కీలకంగా మారనుంది.
అర్హతలు..
నర్సింగ్‌లో యూనివర్సిటీ డిగ్రీ ఉండాలి. మంచి ఇంటర్‌పర్సన్ స్కిల్స్ ఉండాలి. ఏఐ ఆధారిత డిజిటల్ టూల్స్, సాఫ్ట్‌వేర్ వినియోగంలో నైపుణ్యం ఉండాలి.

9. సైబర్ సిటీ అనలిస్ట్
సైబర్ సిటీ అనలిస్ట్ ఆయా నగరాల మున్సిపల్ డిజిటల్ సిస్టమ్స్ భద్రత, పనితీరు మెరుగ్గా ఉండేట్లు చూడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయా నగరాల మధ్య సమాచార ప్రసారానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్నిరకాల టెక్నికల్, ట్రాన్స్మిషన్ పరికరాలు సరిగా పనిచేసేట్లు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. నగరాలు భద్రంగా ఉండేట్లు చూడటంలో వీరి పాత్ర కీలకం కానుంది.
విధులు-బాధ్యతలు :
డేటాసరఫరాలో పొరపాట్లు తెలుసుకోవడం, డేటాప్రసారం, డేటా ఇంటిగ్రిటీని ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండటం, డేటా సొల్యూషన్స్ను డిజైనింగ్‌తో పాటు అమలు చేయడం, పరికరాల స్పాట్ చెక్స్‌ను రన్ చేయడం, సెక్యూరిటీ నాలెడ్జ్‌ను అప్‌డేట్ చేస్తుండటం వీరి ప్రధాన బాధ్యతలు.
అర్హతలు..
  • అజైల్, డెవ్‌ఆప్స్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్... డిజిటిల్ ఇంజనీరింగ్ సంబంధిత విద్యార్హతలు ఉండాలి. సెక్యూరిటీ స్కిల్స్ ముఖ్యంగా సోల్డర్ ఎలక్ట్రానిక్స్, ప్రింట్ సిలికాన్ తదితరాలపై అవగాహన ఉండాలి.
  • లీన్ స్టార్టప్ మెథడాలజీలు, అనలిటిక్స్ అండ్ విజువలైజేషన్ ప్లాట్‌ఫార్మ్స్ తెలుసుండాలి. డిజైన్ థింకింగ్‌ను అర్థం చేసుకోవడం, డాష్‌బోర్డ్ కస్టమైజేషన్ నైపుణ్యాలు ఉండాలి. త్రీ డీ ప్రింటింగ్‌పై అవగాహన తప్పనిసరి.

10. జినోమిక్ పోర్ట్‌ఫోలియో డెరైక్టర్

వ్యాపార వాణిజ్య నేపథ్యంతో లైఫ్ సైన్స్ ఉత్పత్తులకు మార్కెట్‌ను సృష్టించే నైపుణ్యాలు కలిగి ఉండాలి. ఇతను ఒకరకంగా కంపెనీ బిజినెస్ ఎగ్జిక్యూటివ్. లైఫ్ సెన్సైస్ ఉత్పత్తుల కంపెనీ భవిష్యత్ అభివృద్ధి, లాభాల కోసం చిత్తశుద్ధితో పనిచేయాల్సి ఉంటుంది.
అర్హతలు: జీనోమిక్స్‌లో అండర్‌గ్రాడ్యుయేషన్, బిజినెస్ మేనేజ్‌మెంట్ / మాలిక్యులర్ బయాలజీలో పీజీ.

11. మ్యాన్-మెషీన్ టీమింగ్ మేనేజర్
2030 తర్వాత ఆఫీసుల్లో హోదాల పేర్లు కూడా మారనున్నా. ప్రస్తుతం మనం టీమ్ లీడర్, టీమ్ మేనేజర్‌గా పిలుచుకుంటున్న ఉద్యోగాలు.. భవిష్యత్తులో మ్యాన్-మెషీన్ టీమింగ్ మేనేజర్గా మారనున్నా. ఎందుకంటే.. భ విష్యత్తులో మనుషులు, రోబోలు కలసి పనిచేయాల్సి ఉంటుంది. ఆ మేరకు టీమ్ మేనేజర్ బాధ్యత కూడా మారిపోతుంది. అటు మనుషులు, ఇటు రోబోలను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హత: ఎక్స్‌పరిమెంటల్ సైకాలజీ/న్యూరోసైన్స్లో గ్రాడ్యుయేషన్. దాంతోపాటు కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్‌లో మాస్టర్స్. రోబోటిక్స్, హ్యూమాన్- రోబోటిక్స్ ఇంటరాక్షన్, మెషీన్ లెర్నింగ్, సోషల్ రోబోట్స్ విభాగాల్లో ఐదేళ్ల అనుభవం తప్పనిసరి.

12. ఫైనాన్షియల్ వెల్‌నెస్ కోచ్
ఎమోషనల్ ఇంటెలిజెన్స్ (భావోద్వేగ ప్రజ్ఞ) ఆధారంగా.. కస్టమర్లు తమ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను రూపొందించుకునేలా సహాయం చేయడమే ఫైనాన్షియల్ వెల్‌నెస్ కోచ్ పని. ఈ పని రోబోలు చేయలేవు. ఎందుకంటే.. వాటికి భావోద్వేగ సామర్థ్యం ఉండదు. టెక్నాలజీ ఆధారంగా క్లంట్ ఆర్థిక లక్ష్యాలను అర్థం చేసుకుంటూ... వారి పెట్టుబడుల నిర్ణయాలను ప్రభావితం చేయాల్సి ఉంటుంది.

13. డిజిటల్ టైలర్
డిజిటల్ టైలర్.. వినియోగదారులు తమకు అవసరమైన దుస్తులు కచ్చితమైన మెజర్‌మెంట్స్‌తోసహా ఆన్‌లైన్‌లో కొనగోలు చేసుకునేలా సహాయం చేస్తాడు. ఈ డిజిటల్ టైలర్ కస్టమర్లకు తమ స్టైలింగ్, దుస్తుల ఎంపిక, రంగులు, డిజైన్, ఫ్యాషన్ ట్రెండ్స్ తదితర అంశాలపైనా సలహాలు అందిస్తాడు. వినియోగదారులకు దుస్తుల ఎంపిక పరంగా టెక్నాలజీ ఆధారిత సేవలు వేగంగా అందించేలా చూడాలి.
అర్హత: ఆర్‌‌ట్స లేదా సైన్స్ డిగ్రీ.

14. చీఫ్ ట్రస్ట్ ఆఫీసర్
కంపెనీ ఆర్థికంగా బలంగా ఉంది, నిజాతీగా పనిచేస్తోంది.. అనే మంచి అభిప్రాయం ప్రజల్లో కలిగేలా చేయడం... చీఫ్ ట్రస్ట్ ఆఫీసర్ బాధ్యత. ఒకరకంగా ఇతను సంస్థ ఇమేజ్ బిల్డర్ లేదా బ్రాండింగ్ అంబాసిడర్ లాంటి వ్యక్తి. ఈ ఆఫీసర్‌కు క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్, స్పెక్యులేషన్, బ్లాక్‌చైన్, కరెన్సీ ట్రేడింగ్, పీఆర్/మార్కెటింగ్ తదితర అంశాలపై అవగాహన అవసరం.
అర్హతలు: ఫైనాన్స్/ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్/ఎకనామిక్స్/అకౌంటింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ. దీంతోపాటు చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ లెవెల్ 1 ఉత్తీర్ణత ఉంటే అదనపు ప్రయోజనం కలుగుతుంది.

15. క్వాంటమ్ మెిషీన్ లెర్నింగ్ అనలిస్ట్
క్వాంటమ్ అల్గారిథమ్స్, మెషిన్‌లెర్నింగ్ పద్ధతులను ఉపయోగించడం ద్వారా ప్రత్యేక బిజినెస్ సవాళ్లు, సమస్యలను పరిష్కరించేవారే క్వాంటమ్ మెషిన్ లెర్నింగ్ అనలిస్ట్‌లు. గతంలో లేని టెక్నాజీని సృష్టించడం ద్వారా వీరు కంపెనీల వ్యాపార సమస్యలకు పరిష్కారాలు చూపాల్సి ఉంటుంది. ఆ క్రమంలో వీరు బిజినెస్, ఐటీ బృందాలతో కలసి పనిచేయాల్సి ఉంటుంది. లీగల్ టీమ్స్‌తోనూ ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది.
అర్హతలు: స్టాటిస్టిక్స్/మ్యాథ్స్/ఫిజిక్స్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/కంప్యూటర్ సైన్స్లో కనీసం పీజీ చేసుండాలి.

16. వర్చువల్ స్టోర్ షెర్పా
కస్టమర్లకు వర్చువల్ సేవలు, సలహాలు అందించేవారు.. వర్చువల్ స్టోర్ షెర్పాలు. తద్వారా వినియోగదారులు ఆయా వస్తువులు, సేవలపై ఎక్కువగా ఖర్చుపెట్టకుండా వీరు సలహాలు ఇస్తుంటారు. ట్రస్టీ క్రూ ప్లాట్‌ఫామ్ ద్వారా వీరు సేవలు అందిస్తారు.

17. పర్సనల్ డేటా బ్రోకర్
వివిధ మార్గాల ద్వారా సృష్టించిన క్లంట్ డేటాను ఈ పర్సనల్ డేటా బ్రోకర్ పర్యవేక్షిస్తుంటాడు. ఇతను క్లంట్ తరఫున డేటా అమ్మకం వంటి వ్యవహారాలను సైతం చూస్తుంటాడు. తద్వారా క్లంట్ తన డేటా ద్వారా అధిక ప్రయోజనం, లాభాలు పొందేలా చూస్తాడు.

18. పర్సనల్ మెమరీ క్యూరేటర్
వృద్ధాప్యంలో ఉన్నవారు తాము మరిచిపోన జ్ఞాపకాలు తిరిగి గుర్తుకు తెచ్చుకోవడం... లేదా వద్దనుకుంటున్న జ్ఞాపకాలు మరిచిపోయేలా చేయడంలో ఈ పర్సనల్ మెమరీ క్యూరేటర్లు సాయం చేస్తారు. వీరు ఒక రకమైన వర్చువల్ వాతావరణం సృష్టించి వృద్ధులైన రోగులకు సేవలు అందిస్తారు.

19. ఆగ్‌మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) జర్నీ బిల్డర్
ఏఆర్ జర్నీ బిల్డర్ ప్రతిభావంతులైన ఇంజనీర్లు, ఆర్టిస్టులతో కలిసి క్లయింట్లకు మంచి ఏఆర్ అనుభూతులు అందించేలా కృషిచేస్తుంటారు. ఈ ఏఆర్ జర్నీ బిల్డర్... ప్రేక్షకుల మూడ్, కోరుకుంటున్న కాలం, సమాచారం, పాత్రల ఆధారంగా వారికి ఇష్టమైన గేమ్స్, వీడియోలు, మ్యూజిక్ రూపొందించి ఇస్తారు.

20. హైవే కంట్రోలర్
2030 నాటికి భూమ్మీద రోబోలతో సమానంగా ఆకాశంలో డ్రోన్లు పెరగనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవి కూడా ఎగిరే రోబోల లాంటివే. అప్పుడు భూమిపై ఎంత ట్రాఫిక్ ఉంటుందో.. డ్రోన్లు పెరగడంతో ఆకాశంలోనూ అంతే ట్రాఫిక్ ఉండబోతోంది. అందుకే ఆకాశంలో ట్రాఫిక్‌ను నియంత్రించే ఉద్యోగాలు భారీగా అందుబాటులోకి రానున్నా. ఆ ఉద్యోగం పేరే... 'హైవే కంట్రోలర్'.

21. జెనిటిక్ డైవర్సిటీ ఆఫీసర్
జెనిటికల్‌గా ఉన్నతమైన వ్యక్తులు ఒకే సంస్థలో పనిచేసేలా చేయడం ఈ జెనిటిక్ డైవర్సిటీ ఆఫీసర్ బాధ్యత. ముఖ్యంగా విభిన్న జెనిటికల్ నేపథ్యాల వ్యక్తులు ఒకేచోట కలిపి పనిచేసేలా... మంచి పని వాతావరణం సృష్టించడం.. తద్వారా కంపెనీ ఉత్పత్తి గణనీయంగా పెంచడం వీరి జాబ్ ప్రొఫైల్. వీరు పాథాలజిస్టులు, లీగల్, హెచ్‌ఆర్ టీమ్స్‌తో కలసి పనిచేయాల్సి ఉంటుంది.
Published date : 17 Apr 2018 06:55PM

Photo Stories