రెండో రకాలుగా వీవీఎం పరీక్ష దరఖాస్తు ప్రక్రియ.. రిజిస్ట్రేషన్ విధానం ఇలా..
Sakshi Education
విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం)పై ఆసక్తి ఉండి దరఖాస్తు చేసుకోవాలనుకునే ఔత్సాహిక విద్యార్థులు.. రెండు రకాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.. అలాగే ఫీజు, ఇతర సమాచారం ఇదిగో..
ఫీజు..
సెప్టెంబర్ 30లోగా వీవీఎం పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రూ.20 ఆలస్య రుసుముతో అక్టోబర్ 15వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు ఇలా..
- ఈ పరీక్ష దరఖాస్తుకు సంబంధించి రెండు రకాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలను వీవీఎం అందుబాటులో ఉంచింది. ఒకటి వ్యక్తిగత రిజిస్ట్రేషన్ ప్రక్రియ, రెండోది స్కూల్ /ఇన్‌స్టిట్యూషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ.
- ఆన్‌లైన్‌లో www.vvm.org.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది.
- స్కూల్ లెవల్ దరఖాస్తు చేసుకునేందుకు ఒక ఉపాధ్యాయుడిని వీవీఎమ్ కోఆర్టినేటర్‌గా నియమించి, స్కూల్, విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి.
- ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు నవంబర్ మొదటి వారంలో వీవీఎం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని.. అందులో లాగిన్ అవ్వాలి.పరీక్షకు ముందు ఈ యాప్ ద్వారా మాక్ టెస్టులు కూడా రాసుకునే వెసులుబాటు కూడా వీవీఎం కల్పించింది.
ఫీజు..
సెప్టెంబర్ 30లోగా వీవీఎం పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రూ.20 ఆలస్య రుసుముతో అక్టోబర్ 15వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2020
- పరీక్షా తేదీ: నవంబర్ 29/30 (ఏదైనా ఒక రోజు)
- పరీక్ష ఫలితాల వెల్లడి: డిసెంబర్ 15
- రాష్ట్రస్థాయి క్యాంపు: 2021 జనవరి 10, 17, 24 (ఆయా తేదీల్లో ఏదైనా ఒక రోజు)
- రెండు రోజుల జాతీయస్థాయి క్యాంపు: 2021 మే 15, 16
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.vvm.org.in
Published date : 24 Sep 2020 12:43PM