ఫార్మా కోర్సులకు సరైన దారి... నైపర్
Sakshi Education
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్.. నైపర్! ఇంజనీరింగ్‌కు ఐఐటీలు.. మేనేజ్‌మెంట్ విద్యకు ఐఐఎంలు ఎలాగో.. ఫార్మసీ కోర్సులను అందించడంలో ఆ స్థాయి ఇన్‌స్టిట్యూట్‌లుగా నైపర్‌లకు మంచి పేరుంది. కాగా, కొత్త విద్యా సంవత్సరంలో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నైపర్ 2020 నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లో వెలువడే అవకాశముంది.
ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా నైపర్ క్యాంపస్‌లు.. అందిస్తున్న కోర్సులు.. ప్రవేశ విధానం గురించి తెలుసుకుందాం...
నైపర్ జేఈఈ :
కేంద్ర ప్రభుత్వం ఫార్మా విద్య, పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ స్థాయిలో నైపర్‌లను ఏర్పాటుచేసింది. తొలి నైపర్‌ను ఎస్‌ఏఎస్ నగర్ (మొహలీ)లో ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏడు నైపర్‌లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇవన్నీ ఫార్మాకు సంబంధించి పలు స్పెషలైజేషన్స్‌తో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులతోపాటు పీహెచ్‌డీని అందిస్తున్నాయి. నైపర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలంటే.. జాతీయ స్థాయిలో నిర్వహించే నైపర్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(నైపర్ జేఈఈ)లో మంచి ర్యాంకు సాధించాల్సి ఉంటుంది.
నైపర్ అహ్మదాబాద్ :
నైపర్ అహ్మదాబాద్ క్యాంపస్ గాంధీనగర్‌లో ఉంది. దీనికి 2019 ఎన్‌ఐఆర్‌ఎఫ్ ఫార్మా ర్యాంకింగ్స్‌లో 9వ స్థానం దక్కింది. క్యాంపస్‌లో రీసెర్చ్ ల్యాబొరేటరీ, యానిమల్ హౌజ్ తదితర సౌకర్యాలు ఉన్నాయి. నైపర్ అహ్మదాబాద్ ఏడు స్పెషలైజేషన్స్‌తో ఎంఎస్(ఫార్మా) కోర్సును ఆఫర్ చేస్తోంది. బయోటెక్నాలజీ 10, మెడిసినల్ కెమిస్ట్రీ 16, మెడకల్ డివెజైస్10, నేచురల్ ప్రొడక్ట్స్ 10, ఫార్మాస్యూటికల్ అనాలసిస్ 20, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ 16, ఫార్మాస్యూటిక్స్ 20 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
నైపర్ గువహటి :
ఇది 2008 నుంచి కోర్సులను అందిస్తోంది. ఎంఎస్(ఫార్మా),ఎంఫార్మా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తోంది. ఎంఎస్‌లో ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ స్పెషలైజేషన్‌తో15, బయోటెక్నాలజీలో10,ఫార్మాస్యూ టిక్స్‌లో 15, ఫార్మాస్యూటికల్ అనాలసిస్‌లో 15 సీట్లు ఉండగా.. ఎంఫార్మాలో ఫార్మసీ ప్రాక్టీస్ స్పెషలైజేషన్‌తో 10 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
నైపర్ హాజీపూర్ :
పాట్నా ఎయిర్‌పోర్ట్‌కి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. తాజాగా ఈ ఇన్‌స్టిట్యూట్ అకడెమిక్, అడ్మినిస్ట్రేషన్ పరంగా పలు సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రస్తుతం మూడు విభాగాల్లో ఎంఎస్(ఫార్మా) కోర్సును ఆఫర్‌చేస్తోంది. బయోటెక్నాలజీలో 16, ఫార్మసీ ప్రాక్టీస్‌లో 16 సీట్లు, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీలో 16 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
నైపర్ హైదరాబాద్ :
నైపర్ హైదరాబాద్‌కు ఫార్మాస్యూటికల్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో హయ్యర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌ల పరంగా దేశవ్యాప్త గుర్తింపు ఉంది. జాతీయ ప్రాధాన్య ఇన్‌స్టిట్యూట్‌గా కూడా గుర్తింపు పొందింది. ఎంఎస్(ఫార్మా), ఎంటెక్(ఫార్మా), ఎంబీఏ(ఫార్మా) కోర్సులను ఆఫర్‌చేస్తోంది. ఎంఎస్‌లో మెడికల్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌లో 20, ఫార్మాస్యూటికల్ అనాలసిస్‌లో 20, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీలో 15, ఫార్మాస్యూటిక్స్‌లో 20, రెగ్యులేటరీ టాక్సికాలజీలో 15, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ(ప్రాసెస్ కెమిస్ట్రీ)లో 15 సీట్లు, ఎంబీఏ(ఫార్మా)లో 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
నైపర్ కోల్‌కతా :
దీన్ని 2007లో ఏర్పాటు చేశారు. జాతీయ ప్రాధాన్య ఇన్‌స్టిట్యూట్‌గా గుర్తింపు పొందింది. నాలుగు స్పెషలైజేషన్స్‌తో ఎంఎస్(ఫార్మా) కోర్సును ఆఫర్‌చేస్తోంది. మెడికల్ కెమిస్ట్రీలో 7, నేచురల్ ప్రొడక్ట్స్‌లో 6, ఫార్మకోఇన్‌ఫర్మాటిక్స్‌లో 4, ఫార్మాకాలజీ అండ్ టాక్సికాలజీలో 12 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
నైపర్ రాయ్‌బరేలి :
2008లో ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా ప్రకటించింది. నాలుగు స్పెషలైజేషన్స్‌లో ఎంఎస్(ఫార్మా) కోర్సును అందిస్తోంది. మెడికల్ కెమిస్ట్రీలో 20, ఫార్మాస్యూటిక్స్‌లో 15, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీలో 15, రెగ్యులేటరీ టాక్సికాలజీలో 10 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
నైపర్ ఎస్‌ఏఎస్ నగర్ (మొహాలి) :
ఇది దేశంలో ఏర్పాటైన తొలి నైపర్. దీన్ని కేంద్రం జాతీయ ప్రాధాన్య ఇన్‌స్టిట్యూట్‌గా గుర్తించింది. ప్రస్తుతం 14 విభాగాల్లో ఎంఎస్(ఫార్మా) కోర్సును ఆఫర్‌చేస్తోంది. మెడికల్ కెమిస్ట్రీలో 26, నేచురల్ ప్రొడక్ట్స్‌లో 12, ట్రెడిషనల్ మెడిసిన్‌లో 4, ఫార్మాస్యూటికల్ అనాలసిస్‌లో 8, ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీలో 16, రెగ్యులేటరీ టాక్సికాలజీలో 8, ఫార్మాస్యూటిక్స్‌లో 18, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ(ఫార్ములేషన్)లో 6, బయోటెక్నాలజీలో 32, ఫార్మసీ ప్రాక్టీస్‌లో 8, క్లినికల్ రీసెర్చ్‌లో 8, ఫార్మకోఇన్‌ఫర్మాటిక్స్‌లో 16, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ(ప్రాసెస్ కెమిస్ట్రీ)లో 16, ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (బయోటెక్నాలజీ)లో 10సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంబీఏ(ఫార్మా)లో 42 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు..
ఎంఎస్ ఫార్మా, ఎంబీఏ(ఫార్మా) కోర్సులకు కామన్ ఎంట్రన్స్ టెస్టు ఉంటుంది. ప్రశ్నపత్రం 200 ప్రశ్నలు-200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ప్రశ్నలు.. బీఫార్మసీ, ఎంఎస్సీ స్థాయిలో ఉంటాయి.
ఎంపిక :
నైపర్ జేఈఈ మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి ఎంఎస్(ఫార్మా), ఎంఫార్మా, ఎంటెక్(ఫార్మా) కోర్సుల్లో ప్రవేశాలు ఖరారు చేస్తారు. ఎంబీఏ ఫార్మా(హైదరాబాద్, ఎస్.ఎ.ఎస్.నగర్) కోర్సులో ప్రవేశాలను ఎంట్రెన్స్ టెస్టు, గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూలో పొందిన మార్కుల ఆధారంగా ఖరారు చేస్తారు. ఎంట్రెన్స్ టెస్టుకు 85 శాతం వెయిటేజీ, గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూలకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది.
పీహెచ్‌డీ ప్రవేశాలు :
అర్హత: నైపర్‌లు పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి ఎంఎస్(ఫార్మా)/ ఎంఫార్మ్/ఎంటెక్(ఫార్మా) ఉత్తీర్ణత. సీఎస్‌ఐఆర్/యూజీసీ/ఐసీఎంఆర్ /డీబీటీ/ డీఎస్‌టీ నెట్-జేఆర్‌ఎఫ్‌లో క్వాలిఫై అయిన వారు దరఖాస్తుకు అర్హులు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. వీరింతా ఇంటర్వ్యూ సమయంలో అర్హతలను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. వీరితో పాటు నిర్దిష్ట విభాగాల్లో సీఎస్‌ఐఆర్/యూజీసీ/ఐసీఎంఆర్/డీబీటీ/డీఎస్‌టీ ఇన్‌స్పైర్, ఆర్‌జీఎన్‌ఎఫ్ ఫెలోషిప్‌లు పొందిన వారికి కొన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి.
పరీక్ష విధానం: ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. పేపర్‌లో కెమికల్ సెన్సైస్, బయలాజికల్ సెన్సైస్, ఫార్మాస్యూటికల్ సెన్సైస్ విభాగాలు ఉంటాయి. ప్రశ్నలను ఎంఎస్(ఫార్మా), ఎంఫార్మా, ఎంటెక్(ఫార్మా), ఎంవీఎస్‌సీ, ఎండీ, ఎంఎస్సీ సిలబస్‌లోని అనుబంధ అంశాల నుంచి అడుగుతారు. వీటితోపాటు ప్రతి విభాగంలో ఫార్మాస్యూటికల్ సెన్సైస్, జనరల్ ఆప్టిట్యూడ్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు, ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు.
నైపర్ ముఖ్య సమాచారం :
దరఖాస్తు ప్రక్రియ: ఏప్రిల్ మొదటివారం.
దరఖాస్తు ఫీజు: ఎంఎస్(ఫార్మా)/ఎంఫార్మా/ఎంటెక్(ఫార్మా): జనరల్, ఓబీసీ, పీహెచ్, ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులకు రూ. 3000, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.1500.
ఎంబీఏ(ఫార్మా): జనరల్, ఓబీసీ, పీహెచ్, ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులకు రూ.3000, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.1500.
ఎంఎస్(ఫార్మా)/ఎంఫార్మా/ఎంటెక్(ఫార్మా)-ఎంబీఏ(ఫార్మా): జనరల్, ఓబీసీ, పీహెచ్, ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులకు రూ. 4000, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.2000.
పీహెచ్‌డీ: జనరల్, ఓబీసీ, పీహెచ్ కేటగిరీ అభ్యర్థులకు రూ.3000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1500.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.niperahm.ac.in

- పీజీ కోర్సులకు బీఫార్మసీ, ఎంఎస్సీ, బీవీఎస్సీ, ఎంబీబీఎస్, బీఏఎంఎస్ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణత. వ్యాలిడ్ జీప్యాట్ స్కోరుతోపాటు అర్హత డిగ్రీలో 60 శాతం మార్కులు లేదా 6.75 సీజీపీఏ(10 పాయింట్ల స్కేల్‌లో) ఉండాలి. ఫైనలియర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. వారంతా తుది కౌన్సెలింగ్ కంటే ముందు విశ్వవిద్యాలయాల అధికారిక మెయిల్ ఐడీల ద్వారా స్వీయ ఫలితాలను పంపాల్సి ఉంటుంది.
- కౌన్సెలింగ్/గ్రూప్ డిస్కషన్ వచ్చేటప్పుడు అభ్యర్థులు తప్పనిసరిగా జీప్యాట్/నెట్/గేట్ స్కోర్ కార్డును తీసుకురావాల్సి ఉంటుంది.
- బీవీఎస్‌సీ/ఎంబీబీఎస్/బీఏఎంఎస్ డిగ్రీ ఉత్తీర్ణులు, విదేశీ విద్యార్థులు, పబ్లిక్- ప్రైవేట్ సెక్టార్ అండర్ టేకింగ్,ప్రభుత్వ విభాగాలు, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ల స్పాన్సర్డ్ అభ్యర్థులు మినహా మిగిలిన కోర్సుల విద్యార్థులకు జీప్యాట్/నెట్/గేట్ అర్హత తప్పనిసరి.
- ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 55 శాతం, పీడబ్ల్యూడీ విద్యార్థులకు 50 శాతం ఉత్తీర్ణత ఉండాలి.
ఎంఎస్ ఫార్మా, ఎంబీఏ(ఫార్మా) కోర్సులకు కామన్ ఎంట్రన్స్ టెస్టు ఉంటుంది. ప్రశ్నపత్రం 200 ప్రశ్నలు-200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ప్రశ్నలు.. బీఫార్మసీ, ఎంఎస్సీ స్థాయిలో ఉంటాయి.
ఎంపిక :
నైపర్ జేఈఈ మెరిట్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి ఎంఎస్(ఫార్మా), ఎంఫార్మా, ఎంటెక్(ఫార్మా) కోర్సుల్లో ప్రవేశాలు ఖరారు చేస్తారు. ఎంబీఏ ఫార్మా(హైదరాబాద్, ఎస్.ఎ.ఎస్.నగర్) కోర్సులో ప్రవేశాలను ఎంట్రెన్స్ టెస్టు, గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూలో పొందిన మార్కుల ఆధారంగా ఖరారు చేస్తారు. ఎంట్రెన్స్ టెస్టుకు 85 శాతం వెయిటేజీ, గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూలకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది.
పీహెచ్‌డీ ప్రవేశాలు :
అర్హత: నైపర్‌లు పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి ఎంఎస్(ఫార్మా)/ ఎంఫార్మ్/ఎంటెక్(ఫార్మా) ఉత్తీర్ణత. సీఎస్‌ఐఆర్/యూజీసీ/ఐసీఎంఆర్ /డీబీటీ/ డీఎస్‌టీ నెట్-జేఆర్‌ఎఫ్‌లో క్వాలిఫై అయిన వారు దరఖాస్తుకు అర్హులు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. వీరింతా ఇంటర్వ్యూ సమయంలో అర్హతలను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. వీరితో పాటు నిర్దిష్ట విభాగాల్లో సీఎస్‌ఐఆర్/యూజీసీ/ఐసీఎంఆర్/డీబీటీ/డీఎస్‌టీ ఇన్‌స్పైర్, ఆర్‌జీఎన్‌ఎఫ్ ఫెలోషిప్‌లు పొందిన వారికి కొన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయి.
పరీక్ష విధానం: ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. పేపర్‌లో కెమికల్ సెన్సైస్, బయలాజికల్ సెన్సైస్, ఫార్మాస్యూటికల్ సెన్సైస్ విభాగాలు ఉంటాయి. ప్రశ్నలను ఎంఎస్(ఫార్మా), ఎంఫార్మా, ఎంటెక్(ఫార్మా), ఎంవీఎస్‌సీ, ఎండీ, ఎంఎస్సీ సిలబస్‌లోని అనుబంధ అంశాల నుంచి అడుగుతారు. వీటితోపాటు ప్రతి విభాగంలో ఫార్మాస్యూటికల్ సెన్సైస్, జనరల్ ఆప్టిట్యూడ్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు, ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు.
నైపర్ ముఖ్య సమాచారం :
దరఖాస్తు ప్రక్రియ: ఏప్రిల్ మొదటివారం.
దరఖాస్తు ఫీజు: ఎంఎస్(ఫార్మా)/ఎంఫార్మా/ఎంటెక్(ఫార్మా): జనరల్, ఓబీసీ, పీహెచ్, ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులకు రూ. 3000, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.1500.
ఎంబీఏ(ఫార్మా): జనరల్, ఓబీసీ, పీహెచ్, ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులకు రూ.3000, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.1500.
ఎంఎస్(ఫార్మా)/ఎంఫార్మా/ఎంటెక్(ఫార్మా)-ఎంబీఏ(ఫార్మా): జనరల్, ఓబీసీ, పీహెచ్, ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులకు రూ. 4000, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.2000.
పీహెచ్‌డీ: జనరల్, ఓబీసీ, పీహెచ్ కేటగిరీ అభ్యర్థులకు రూ.3000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1500.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.niperahm.ac.in
Published date : 05 Feb 2020 01:18PM