పదో తరగతి ఉత్తీర్ణతతో...‘ సీఏ ’ చదవండిలా..
Sakshi Education
చార్టర్డ్ అకౌంటెన్సీ.. సంక్షిప్తంగా సీఏ. కామర్స్ ప్రొఫెషనల్ కోర్సుల్లో.. అత్యంత క్లిష్టమైనదని భావిస్తారు. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేస్తే కానీ.. సీఏలో రాణించలేరని చెబుతుంటారు.
అలాగే కామర్స్ నేపథ్యం ఉన్న విద్యార్థులకే అనుకూలమని మరికొంతమంది వాదిస్తారు. ఇలాంటి సీఏ కోర్సుకు పదో తరగతి ఉత్తీర్ణతతోనే.. ప్రొవిజినల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఐసీఏఐ(ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. పదో తరగతితోనే సీఏకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల కలిగేప్రయోజనాలు, కోర్సు పూర్తి స్వరూపం, భవిష్యత్ అవకాశాలపై ప్రత్యేక కథనం...
సీఏ కోర్సు పూర్తి చేయాలంటే.. ఏళ్ల తరబడి కష్టపడాలి..ఉత్తీర్ణత శాతం చాలా తక్కువ.. సీఏ కోర్సు గురించి సర్వ సాధారణంగా వినిపించే అభిప్రాయాలివి!! ఇటీవల సీఏ కోర్సు నిర్వాహక సంస్థ.. ఐసీఏఐ.. పదో తరగతి ఉత్తీర్ణతతోనే సీఏ కోర్సుకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ప్రకటించింది. దాంతో చిన్న వయసులోనే కామర్స్ ప్రొఫెషనల్ కోర్సు దిశగా అడుగులు వేసే అవకాశం లభించినట్లయింది. తద్వారా కోర్సును ఆరు నెలల ముందుగానే పూర్తి చేసుకునే అవకాశం ఉంది.
{పొవిజినల్ రిజిస్ట్రేషన్:
ఐసీఏఐ తాజా నిర్ణయం ప్రకారం-పదో తరగతి ఉత్తీర్ణత ఆధారంగా విద్యార్థులు సీఏ కోర్సులోని తొలిదశ ఫౌండేషన్‌కు ప్రొవిజినల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకొని.. ఆ సర్టిఫికెట్‌తో ఫౌండేషన్ పరీక్షకు నమోదు చేసుకొని, హాజరవ్వచ్చు. ఇలా ఫౌండేషన్ పరీక్షకు నమోదు చేసుకోవాలంటే..పరీక్ష తేదీకి ముందు కనీసం నాలుగు నెలల వ్యవధి ఉండాలి. అంటే.. నవంబర్‌లో జరిగే పరీక్షకు జూన్ 30లోపు, మే నెలలో జరిగే పరీక్షకు డిసెంబర్ 31లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఫౌండేషన్ పరీక్ష:
సీఏ ఇంటర్మీడియెట్‌లోని రెండు గ్రూప్‌లు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సీఏ ఫైనల్‌కు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. ఫైనల్ పరీక్షకు నమోదు చేసుకోవాలంటే.. ఆర్టికల్‌షిప్‌గా పిలిచే మూడేళ్ల వ్యవధిలో ఉండే ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు దరఖాస్తు చేసుకొని... దాని ఆధారంగా సీఏ ఫైనల్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సీఏ ఫైనల్ అభ్యర్థులు ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను ప్రాక్టీసింగ్ సీఏ వద్ద లేదా ఆడిట్ సంస్థలో చేయొచ్చు. ఇటీవల మారిన విధానం ప్రకారం-సీఏ ఇంటర్మీడియెట్‌లోని రెండు గ్రూప్‌లు, లేదా ఏదైనా ఒక గ్రూప్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు సైతం ఆర్టికల్‌షిప్ చేయడానికి అర్హులే. ఈ ఆర్టికల్‌షిప్ సమయంలోనే ఏడాది వ్యవధి పూర్తయ్యాక సీఏ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే నాలుగు వారాల వ్యవధిలోని అడ్వాన్స్‌డ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ పూర్తి చేసుకోవాలి.
ఫైనల్‌లో ఎలక్టివ్ పేపర్ :
సీఏ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ప్రస్తుత కార్పొరేట్ యుగంలో ఉపాధి అవకాశాలు విస్తృతం అవుతున్నాయి. వీరికి కార్పొరేట్ సంస్థల్లో.. చీఫ్ అకౌంటెంట్, ఫైనాన్స్ డెరైక్టర్, మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓ, ఫైనాన్స్ కంట్రోలర్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ప్లాంట్ అకౌంటెంట్స్, సిస్టమ్ ఇంప్లిమెంటార్స్, టెక్నో ఫంక్షనలిస్ట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. ట్రస్టీ, అడ్మినిస్ట్రేటర్, వాల్యుయర్, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్, ట్యాక్స్ కన్సల్టెంట్‌లుగానూ కొలువులు సొంతం చేసుకోవచ్చు.
స్వయం ఉపాధి :
సీఏ పూర్తి చేసిన వారికి స్వయం ఉపాధి మార్గం కూడా ఉంది. ప్రాక్టీసింగ్ సీఏగా సొంతంగా కన్సల్టెన్సీని స్థాపించి.. ఆయా సంస్థలకు అకౌంటింగ్ సలహాదారులుగా ఉండొచ్చు. సంస్థలు.. ప్రభుత్వ విభాగాలకు అందించే ఆర్థిక నివేదికలకు సర్టిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ధ్రువీకరణ తప్పనిసరి. పూర్తిస్థాయిలో సీఏలను నియమించుకోలేని సంస్థలు.. ప్రాక్టీసింగ్ సీఏలను సంప్రదిస్తున్నాయి. ఆర్థిక నివేదిక తయారీ, అందిస్తున్న సేవలు ప్రాతిపదికగా ఆదాయం పొందొచ్చు.
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ :
సీఏ పూర్తి చేసిన వారికి, అదే విధంగా ఫైనల్ కోర్సు చదువుతున్న వారికి క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఐసీఏఐకి సంబంధించిన చాప్టర్లు, బ్రాంచ్‌లలో.. సంస్థలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తూ అభ్యర్థులకు నియామకాలు ఖరారు చేస్తున్నాయి. ముఖ్యంగా బీఎఫ్‌ఎస్‌ఐ, కన్సల్టింగ్ విభాగాల్లోని సంస్థలు రూ.లక్షల ప్యాకేజీతో ఆఫర్లు అందిస్తున్నాయి. కనిష్టంగా రూ.8లక్షలు, గరిష్టంగా రూ.30 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తోంది.
సీఏ ఫౌండేషన్.. ముఖ్యాంశాలు :
ఆసక్తి ఉంటే కష్టం కాదు..
సీఏ కోర్సు కష్టమని, ఏళ్ల తరబడి కష్టపడాలనే అభిప్రాయం కేవలం అపోహ మాత్రమే. ఆసక్తి, అభిరుచి ఉంటే సీఏ కోర్సును సింగిల్ అటెంప్ట్‌లోనే పూర్తి చేయొచ్చు. ఇక.. ఐసీఏఐ తాజా నిర్ణయంతో.. పదో తరగతితోనే ఫౌండేషన్ ప్రొవిజినల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫలితంగా ఇంటర్మీడియెట్ తర్వాత అయిదేళ్ల వ్యవధిలోనే కోర్సు పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. తద్వారా చిన్న వయసులోనే ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు.
-పంకజ్ కుమార్ త్రివేది, చైర్మన్, ఐసీఏఐ హైదరాబాద్ బ్రాంచ్

- ఫౌండేషన్ పరీక్ష మొత్తం నాలుగు పేపర్లలో నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్‌తో ఉంటాయి. మరో రెండు పేపర్లు సబ్జెక్టివ్ విధానంలో జరుగుతాయి.
- పేపర్-1,2,3లలో ప్రతి పేపర్‌లోనూ రెండు చొప్పున ఉప విభాగాల్లో పరీక్ష ఉంటుంది. పేపర్ 3,4లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. పేపర్-1,2లు సబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ పేపర్ల విషయంలో నెగెటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది.
- పేపర్-1: ప్రిన్సిపుల్స్ అండ్ ప్రాక్టీసింగ్ అకౌంటింగ్-100 మార్కులు.
- పేపర్-2: బిజినెస్ లా అండ్ బిజినెస్ కరెస్పాండెన్స్ అండ్ రిపోర్టింగ్-100 మార్కులు(సెక్షన్-ఎ: బిజినెస్ లా-60 మార్కులు; సెక్షన్-బి: బిజినెస్ కరెస్పాండెన్స్ అండ్ రిపోర్టింగ్-40 మార్కులు).
- పేపర్-3: బిజినెస్ మ్యాథమెటిక్స్ అండ్ లాజికల్ రీజనింగ్,స్టాటిస్టిక్స్-100 మార్కులు(పార్ట్-1: బిజినెస్ మ్యాథమెటిక్స్ అండ్ లాజికల్ రీజనింగ్-60 మార్కులు; పార్ట్-2: స్టాటిస్టిక్స్-40 మార్కులు)
- పేపర్-4: బిజినెస్ ఎకనామిక్స్, బిజినెస్ అండ్ కమర్షియల్ నాలెడ్జ్-100 మార్కులు(పార్ట్-1: బిజినెస్ ఎకనామిక్స్-60 మార్కులు; పార్ట్-2: బిజినెస్ అండ్ కమర్షియల్ నాలెడ్జ్-40 మార్కులు)
- ఈ మొత్తం నాలుగు పేపర్లలో నాలుగు వందల మార్కులకు నిర్వహించే ఫౌండేషన్ పరీక్షలో.. ఒక్కో పేపర్‌లో 40 శాతం మార్కుల చొప్పున, అన్ని పేపర్లలో కలిపి 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే.. సీఏ కోర్సులోని రెండో దశగా పేర్కొనే ఇంటర్మీడియెట్‌కు నమోదు చేసుకునేందుకు అర్హత లభిస్తుంది.
- సీఏ కోర్సులోని రెండో దశ.. సీఏ ఇంటర్మీడియెట్. ఫౌండేషన్ పరీక్ష పూర్తి చేసిన వారికి సీఏ ఇంటర్మీడియెట్‌కు అర్హత లభిస్తుంది. ఇందులో రెండు గ్రూప్‌లు ఉంటాయి. ఒక్కో గ్రూప్‌లో నాలుగు పేపర్లు చొప్పున.. మొత్తం ఎనిమిది పేపర్లు ఉంటాయి. ఈ పరీక్షలు ప్రతి ఏటా రెండుసార్లు మే, నవంబర్‌లలో నిర్వహిస్తారు. విద్యార్థులు పరీక్షకు హాజరయ్యేందుకు, రిజిస్ట్రేషన్‌కు మధ్య ఎనిమిది నెలల వ్యవధి తప్పనిసరి. సీఏ ఇంటర్మీడియెట్‌లోని అన్ని పేపర్లు పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలోనే ఉంటాయి. ఇలా.. రెండు గ్రూప్‌లలో కలిపి ఎనిమిది పేపర్లలో.. ఒక్క పేపర్‌లో 40 శాతం మార్కుల చొప్పున, అన్ని పేపర్లు కలిపి 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే.. కోర్సు చివరి దశగా పేర్కొనే సీఏ ఫైనల్‌కు అర్హత లభిస్తుంది.
- సీఏ ఇంటర్మీడియెట్‌కు డెరైక్ట్ ఎంట్రీ విధానం కూడా అమల్లో ఉంది. కామర్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు.. ఇతర బ్యాచిలర్, పీజీ కోర్సుల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు ఫౌండేషన్ ఉత్తీర్ణత అవసరం లేకుండానే నేరుగా సీఏ ఇంటర్మీడియెట్ పరీక్షకు నమోదు చేసుకోవచ్చు.
సీఏ ఇంటర్మీడియెట్‌లోని రెండు గ్రూప్‌లు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సీఏ ఫైనల్‌కు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. ఫైనల్ పరీక్షకు నమోదు చేసుకోవాలంటే.. ఆర్టికల్‌షిప్‌గా పిలిచే మూడేళ్ల వ్యవధిలో ఉండే ప్రాక్టికల్ ట్రైనింగ్‌కు దరఖాస్తు చేసుకొని... దాని ఆధారంగా సీఏ ఫైనల్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సీఏ ఫైనల్ అభ్యర్థులు ప్రాక్టికల్ ట్రైనింగ్‌ను ప్రాక్టీసింగ్ సీఏ వద్ద లేదా ఆడిట్ సంస్థలో చేయొచ్చు. ఇటీవల మారిన విధానం ప్రకారం-సీఏ ఇంటర్మీడియెట్‌లోని రెండు గ్రూప్‌లు, లేదా ఏదైనా ఒక గ్రూప్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు సైతం ఆర్టికల్‌షిప్ చేయడానికి అర్హులే. ఈ ఆర్టికల్‌షిప్ సమయంలోనే ఏడాది వ్యవధి పూర్తయ్యాక సీఏ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే నాలుగు వారాల వ్యవధిలోని అడ్వాన్స్‌డ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ పూర్తి చేసుకోవాలి.
ఫైనల్‌లో ఎలక్టివ్ పేపర్ :
- సీఏ ఇంటర్మీడియెట్ తర్వాత మూడేళ్ల ఆర్టికల్‌షిప్ (ప్రాక్టికల్ ట్రైనింగ్) చేస్తున్న విద్యార్థులు.. ఈ ఆర్టికల్‌షిప్ రెండున్నరేళ్లు పూర్తికాగానే సీఏ ఫైనల్ పరీక్ష రాసేందుకు అర్హత లభిస్తుంది. సీఏ ఫైనల్ పరీక్ష కూడా రెండు గ్రూప్‌లుగా.. ఒక్కో గ్రూప్‌లో నాలుగు పేపర్లు ఉంటాయి. ఈ పరీక్షను కూడా ప్రతి ఏటా మే,నవంబర్ నెలల్లో నిర్వహిస్తారు.
- సీఏ ఫైనల్‌లో ఎలక్టివ్ పేపర్ అనే విధానం అమలవుతోంది. ఈ మేరకు ఫైనల్‌లోని గ్రూప్-2లో పేపర్-6ను ఎలక్టివ్ పేపర్‌గా నిర్ణయించారు. విద్యార్థులు నిర్దేశించిన ఆరు సబ్జెక్ట్‌ల నుంచి ఏదైనా ఒక సబ్జెక్ట్‌ను ఎలక్టివ్‌గా ఎంచుకోవాల్సి ఉంటుంది. అలా ఎలక్టివ్‌గా ఎంచుకున్న సబ్జెక్ట్‌లోనే పరీక్ష నిర్వహిస్తారు. రిస్క్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్, ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్, ఎకనామిక్ ‘లా’స్, గ్లోబల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్, మల్టీ డిసిప్లినరీ కేస్ స్టడీ సబ్జెక్ట్‌లను ఎలక్టివ్ సబ్జెక్ట్‌లుగా అందుబాటులో ఉంచారు. ఇలా మొత్తం 800 మార్కులకు ఎనిమిది పేపర్లలో నిర్వహించే ఈ పరీక్షలో.. ప్రతి పేపర్‌లో 40 శాతం మార్కులు, అన్ని పేపర్లలో కలిపి 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే సీఏ కోర్సు పూర్తయినట్లే.
సీఏ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ప్రస్తుత కార్పొరేట్ యుగంలో ఉపాధి అవకాశాలు విస్తృతం అవుతున్నాయి. వీరికి కార్పొరేట్ సంస్థల్లో.. చీఫ్ అకౌంటెంట్, ఫైనాన్స్ డెరైక్టర్, మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓ, ఫైనాన్స్ కంట్రోలర్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, ప్లాంట్ అకౌంటెంట్స్, సిస్టమ్ ఇంప్లిమెంటార్స్, టెక్నో ఫంక్షనలిస్ట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. ట్రస్టీ, అడ్మినిస్ట్రేటర్, వాల్యుయర్, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్, ట్యాక్స్ కన్సల్టెంట్‌లుగానూ కొలువులు సొంతం చేసుకోవచ్చు.
స్వయం ఉపాధి :
సీఏ పూర్తి చేసిన వారికి స్వయం ఉపాధి మార్గం కూడా ఉంది. ప్రాక్టీసింగ్ సీఏగా సొంతంగా కన్సల్టెన్సీని స్థాపించి.. ఆయా సంస్థలకు అకౌంటింగ్ సలహాదారులుగా ఉండొచ్చు. సంస్థలు.. ప్రభుత్వ విభాగాలకు అందించే ఆర్థిక నివేదికలకు సర్టిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ధ్రువీకరణ తప్పనిసరి. పూర్తిస్థాయిలో సీఏలను నియమించుకోలేని సంస్థలు.. ప్రాక్టీసింగ్ సీఏలను సంప్రదిస్తున్నాయి. ఆర్థిక నివేదిక తయారీ, అందిస్తున్న సేవలు ప్రాతిపదికగా ఆదాయం పొందొచ్చు.
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ :
సీఏ పూర్తి చేసిన వారికి, అదే విధంగా ఫైనల్ కోర్సు చదువుతున్న వారికి క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఐసీఏఐకి సంబంధించిన చాప్టర్లు, బ్రాంచ్‌లలో.. సంస్థలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తూ అభ్యర్థులకు నియామకాలు ఖరారు చేస్తున్నాయి. ముఖ్యంగా బీఎఫ్‌ఎస్‌ఐ, కన్సల్టింగ్ విభాగాల్లోని సంస్థలు రూ.లక్షల ప్యాకేజీతో ఆఫర్లు అందిస్తున్నాయి. కనిష్టంగా రూ.8లక్షలు, గరిష్టంగా రూ.30 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తోంది.
సీఏ ఫౌండేషన్.. ముఖ్యాంశాలు :
- మూడు దశల సీఏ కోర్సులో తొలి దశ..ఫౌండేషన్.
- పదో తరగతి ఉత్తీర్ణతతోనే ఫౌండేషన్‌కు ప్రొవిజినల్ రిజిస్ట్రేషన్ సదుపాయం.
- ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక ఫౌండేషన్ పరీక్ష రాసేందుకు అనుమతి.
- మొత్తం నాలుగు పేపర్లలో ఫౌండేషన్ పరీక్ష.
ఆసక్తి ఉంటే కష్టం కాదు..
సీఏ కోర్సు కష్టమని, ఏళ్ల తరబడి కష్టపడాలనే అభిప్రాయం కేవలం అపోహ మాత్రమే. ఆసక్తి, అభిరుచి ఉంటే సీఏ కోర్సును సింగిల్ అటెంప్ట్‌లోనే పూర్తి చేయొచ్చు. ఇక.. ఐసీఏఐ తాజా నిర్ణయంతో.. పదో తరగతితోనే ఫౌండేషన్ ప్రొవిజినల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫలితంగా ఇంటర్మీడియెట్ తర్వాత అయిదేళ్ల వ్యవధిలోనే కోర్సు పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. తద్వారా చిన్న వయసులోనే ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు.
-పంకజ్ కుమార్ త్రివేది, చైర్మన్, ఐసీఏఐ హైదరాబాద్ బ్రాంచ్
Published date : 03 Nov 2020 03:43PM